ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించాలన్న మస్క్
x

ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించాలన్న మస్క్

ఎన్నికల ప్రక్రియ నుంచి ఓటింగ్ మెషిన్లను తొలగించాలని టెస్లా అధినేత మస్క్ అభిప్రాయపడ్డారు. వాటిని నూతన సాంకేతిక ప్రక్రియల ద్వారా సులభంగా..


ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈవీఎంలను తొలగించాలని, వాటిని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటి నూతన సాంకేతిక ప్రక్రియల ద్వారా సులభంగా హ్యక్ చేయబడతాయని టెస్లా అధినేత ఎలన్ మస్క్ అభిప్రాయపడ్డారు. అందుకే పోలింగ్ ప్రక్రియ నుంచి మెషీన్లను తొలగించాలని అన్నాడు

ప్యూర్టో రికో లోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా జరిగిన అవకతవకలపై ప్రచురితమైన కథనాన్ని షేర్ చేసిన యూఎస్ స్వత్రంత్య అభ్యర్థి రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ చేసిన పోస్ట్ కు సమాధానమిస్తూ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతర్జాతీయ మీడియా ప్రకారం.. ప్యూర్టోరికో లో ఈ మధ్య ప్రాథమిక ఎన్నికలు జరిగాయి. అయితే ఓటింగ్ సందర్భంగా వందల కొద్ది అక్రమాలు వెలుగు చూశాయి. అయితే అదృష్టవశాత్తూ వీవీప్యాట్ ఉండటంతో వాటిని తిరిగి లెక్కించి సరి చేశారు. పేపర్ ట్రయల్ లేని అధికార పరిధిలో ఏం జరుగుతుంది? అని రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అమెరికాలో కూడా ఇటువంటి వైరుధ్యాలను నివారించడానికి యూఎస్ కూడా తిరిగి బ్యాలెట్ పేపర్ కు తిరిగి రావాలని కోరారు.
‘‘ యూఎస్ పౌరులు తమ ప్రతి ఓటును లెక్కించారని, వారి ఎన్నికలను హ్యాక్ చేయలేరని నమ్మకంగా తెలుసుకోవాలి. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్స్ జోక్యాన్ని నివారించడానికి మనం పేపర్ బ్యాలెట్ లకు తిరిగి రావాలి. నా పరిపాలనకు పేపర్ బ్యాలెట్లు అవసరమవుతాయి. మేము నిజాయితీ, నిష్పక్షపాత ఎన్నికలకు హామీ ఇస్తాం’’ అని అన్నారాయన.
మస్క్ సమర్థన..
కెన్నెడీ పోస్ట్ ను మస్క్ సమర్ధిస్తూ.. ఈవీఎంలను తొలగించాలని అన్నారు. ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ లను రద్దు చేయాలి. మానవులు లేదా ఏఐ ద్వారా ఈవీఎం లను హ్యాక్ చేయవచ్చు. ఈ ప్రమాదం చిన్నదే కావచ్చు. కానీ ఇప్పటికి ఆ అవకాశం ఉందని మస్క్ అభిప్రాయపడ్డాడు.
ప్యూర్టోరికో ప్రాథమిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలో అవకతవకలు జరిగాయని అక్కడి ఎన్నికల సంఘం అంగీకరించింది. ఈ నేపథ్యంలో వాటిపై చర్చ జరిగింది. పోల్ బాడీ తాత్కాలిక అధ్యక్షురాలు జెస్సికా పాడిల్లా రివెరా ప్రకారం, సాప్ట్ వేర్ లోపం కారణంగా డొమినియన్ ఓటింగ్ సిస్టమ్స్ సరఫరా చేసిన ఈవీఎంలు ఓట్లను తప్పుగా లెక్కించాయి. అయితే అధికారులు దీనిని గుర్తించి పేపర్ ట్రయిల్ ద్వారా సరి చేశారు.
ఇటీవల లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఈవీఎంల ట్యాంపరింగ్ పై విస్తృతంగా చర్చ జరిగింది. ప్రతిపక్షాలను కేంద్ర ప్రభుత్వం కావాలనే ఓడిస్తుందనే సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కానీ ఈ పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం వీటిని తిరస్కరించింది. ఈవీఎంలను హ్యాక్ చేసి నిరూపించాలని అంతకుముందే ఎన్నికల సంఘం సవాల్ విసిరింది. అయితే వీటిని ఏ రాజకీయ పార్టీ స్పందించలేదు.



Read More
Next Story