‘సీఏఏ’ అమలు తీరును నిశితంగా పరిశీలిస్తున్నాం: అమెరికా
x

‘సీఏఏ’ అమలు తీరును నిశితంగా పరిశీలిస్తున్నాం: అమెరికా

భారత దేశంలో అమలు చేస్తున్న సీఏఏను నిశితంగా పరిశీలిస్తున్నామని వైట్ హౌజ్ తెలిపింది. ప్రజాస్వామ్యంలో మతస్వేచ్ఛ అందరికి సమానంగా ఉండాలంది.


భారత దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమలు పై నిశితంగా పరిశీలిస్తున్నామని, దాని అమలుపై ఆందోళన చెందుతున్నామని అమెరికా సన్నాయి నొక్కులు నొక్కింది.

"పౌరసత్వ (సవరణ) చట్టం నోటిఫికేషన్ గురించి మేము ఆందోళన చెందుతున్నాము" అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తన రోజువారీ సమావేశంలో విలేకరులతో అన్నారు.
“ఈ చట్టం ఎలా అమలు చేయబడుతుందో మేము నిశితంగా పరిశీలిస్తున్నాము. మత స్వేచ్ఛను గౌరవించడం, అన్ని వర్గాలకు చట్టం కింద సమానమైన గౌరవం అందించడం ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలు, ”అని మిల్లర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
డిసెంబర్ 31, 2014కి ముందు భారతదేశానికి వచ్చిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పత్రాలు లేని ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం మంజూరు చేయడానికి భారత ప్రభుత్వం సోమవారం పౌరసత్వ (సవరణ) చట్టం 2019ని అమలు చేసింది.
CAA ముస్లింల పౌరసత్వాన్ని ప్రభావితం చేయదు కాబట్టి భారతీయ ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాధారణంగా పౌరసత్వం పొందే హక్కు ఉందని భారత ప్రభుత్వం ఇంతకుముందే స్పష్టం చేసింది. CAA తో పౌరసత్వాన్ని మంజూరు చేయడమేనని, దేశంలోని ఏ పౌరుడు పౌరసత్వాన్ని కోల్పోరని భారత ప్రభుత్వం పేర్కొంది.
Read More
Next Story