
పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ
‘‘మీ పై 130 అణుబాంబులు వేస్తాం’’ భారత్ ను హెచ్చరించిన పాక్ మంత్రి
వరుసుగా వృథా ప్రేలాపనలు చేస్తున్న దాయాదీ మంత్రులు
భారత్ - పాకిస్తాన్ మధ్య పహల్గాం ఉగ్రదాడి తరువాత రెండు దేశాలు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తతను ఇంకా పెంచడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది.
తాజాగా ఆ దేశ మంత్రి హనీఫ్ అబ్బాసీ మాట్లాడుతూ.. మా దేశం దగ్గర ఉన్న 130 అణ్వాయుధాలు భారత్ కోసమే దాచిపెట్టామని అన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా పాకిస్తాన్ నీటి సరఫరాను నిలిపివేయడానికి భారత్ ధైర్యం చేస్తే అది పూర్తి స్థాయి యుద్దానికి సిద్దం కావాలని అబ్బాసీ ఒక ఇంటర్వ్యూలో హెచ్చరించారు.
ఉగ్రవాద దాడి తరువాత భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. రక్తం- నీరు కలిసి ప్రవహించలేమని కూడా ఇంతకుముందే ప్రధాని నరేంద్ర మోదీ ఉరి ఉగ్రవాద దాడి సందర్బంగానే ప్రకటించారు. తాజా పహల్గాం దాడితో దానిని ఆచరణలో పెట్టారు.
దీనితో పాకిస్తాన్ మంత్రులు వృథా ప్రేలాపనలు పేలుతున్నారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో అబ్బాసీ మాట్లాడుతూ.. పాకిస్తాన్ అణ్వాయుధాలు ప్రదర్శన కోసం కాదని, వాటి స్థావరాలు దేశవ్యాప్తంగా ఉన్నాయని, రెచ్చగొడితే దాడి చేయడానికి సిద్దంగా ఉన్నాయని న్యూఢిల్లీని హెచ్చరించే ప్రయత్నాలు చేశారు.
క్షిపణులన్నీ భారత్ వైపే..
పాకిస్తాన్ ఆయుధశాల, ఘోరీ, షాహీన్, ఘజ్నవీ క్షిపణులు, అణ్వాయుధాలతో సహ భారత్ ను లక్ష్యంగా చేసుకున్నాయని ఆయన రెచ్చగొట్టే విధంగా అన్నారు.
‘‘మన దగ్గర ఉన్న సైనిక పరికరాలు, క్షిపణులు ప్రదర్శన కోసం కాదు. దేశవ్యాప్తంగా మన అణ్వాయుధాలు ఎక్కడ ఉంచామో ఎవరికి తెలియదు. నేను మళ్లీ చెబుతున్నాను. ఈ బాలిస్టిక్ క్షిపణులు, అవన్నీ మీపై(భారత్) లక్ష్యంగా ఉన్నాయి’’ అని ఆయన హెచ్చరించారు.
రెసిస్టెన్స్ ఫ్రంట్..
హిందూ పర్యాటకులపై ఇస్లామిక్ ఉగ్రవాదులను కాల్పులు జరిపి 26 మందిని హతమార్చారు. తరువాత భారత్, పాక్ పై వరుసగా దౌత్యపరమైన చర్యలకు ఉపక్రమించింది.
పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా(ఎల్ఈటీ) షాడో గ్రూప్ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యత వహించింది. దీనితో భారత్ సింధు నదీ జలాల ఒప్పందాలను నిలిపివేసింది.
పాకిస్తాన్ జాతీయులకు అన్ని వీసాలు రద్దు చేసింది. అలాగే దౌత్యసంబంధాలను తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకుంది
న్యూఢిల్లీని ఎగతాళి చేసిన అబ్బాసీ..
భారత్,పాక్ ను చూసి భయపడుతుందని, తన నిర్ణయాల పర్యవసాలను గ్రహించడం ప్రారంభించిందని అన్నారు. పాకిస్తాన్ వైమానిక స్పేస్ ను మూసివేసిందని, ఇది భారత విమానయానంలో ఇస్లామాబాద్ నిర్ణయం తీవ్ర గందరగోళం సృష్టిచిందని అన్నారు.
‘‘ఇంకో పది రోజులు ఇలాగే కొనసాగితే దేశంలోని విమానయాన సంస్థలు దివాలా తీస్తాయి.’’ అని అబ్బాసీ అన్నారు. నియంత్రణ రేఖను ధృవీకరించే 1972 సిమ్లా ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తామని పాక్ ప్రకటించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. న్యూఢిల్లీ తన దేశంలోని వైఫల్యాలను దృష్టి మళ్లించడానికి పహల్గామ్ ఉగ్రవాద దాడిని పాకిస్తాన్ పై వేసిందని అన్నారు.
ఇంతకుముందే ఇలాగే మాట్లాడిన రక్షణ మంత్రి..
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజ ఆసిఫ్ కూడా ఇంతకుముందే ఇలాగే భారత్ పై నోరు పారేసుకున్నాడు. అమెరికా న్యూస్ ఛానెల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసీఫ్ మాట్లాడుతూ.. గత మూడు దశాబ్దాలుగా ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇచ్చిన శిక్షణ ఇచ్చిన మాట వాస్తవమేనన్నారు. వీటికి కారణం అమెరికాతో సహ ఇతర పశ్చిమదేశాలే కారణమని నిందించాడు.
‘‘సోవియట్ యూనియన్ పై జరిగిన యుద్ధంలో తరువాత 9/11 దాడులు జరగకపోతే పాకిస్తాన్ కు నిష్కళంకమైన చరిత్ర ఉండేది’’ అని ఆసిఫ్ వివరించాడు.
పాకిస్తాన్ ను లక్ష్యంగా చేసుకుని ప్రాంతీయ సంక్షోభాన్ని సృష్టించడానికి భారత్ పహల్గాం ఉగ్రవాద దాడిని ప్రొత్సహించిందని ఆయన వింతైన ఆరోపణలు చేశారు. లష్కర్ ఏ తోయిబా ఇప్పుడు ఉనికిలో లేదని, పహల్గామ్ దాడికి కారణమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కూడా తాను ఎప్పుడూ వినలేదని వివరించారు. ఇంతకుముందు బిలావల్ భుట్టో కూడా సింధు నదీ జలాల ఒప్పందం అమలు చేయకపోతే భారతీయుల రక్తం పారిస్తామని తీవ్ర వివాదాస్పదమైన ప్రకటన చేశారు.
Next Story