మీ ఇష్టమొచ్చింది చేసుకోండి.. మేం చర్చలకు రాం’’
x
Iran President Masoud Pezeshkian (File)

"మీ ఇష్టమొచ్చింది చేసుకోండి.. మేం చర్చలకు రాం’’

"మాకు ప్రపంచంతో సంబంధాలు అవసరం. కానీ వాటి కోసం ఒకరి ముందు తలొగ్గం" అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు గట్టిగా చెప్పారు.


Click the Play button to hear this message in audio format

అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వైఖరిని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ (Masoud Pezeshkian) తప్పుబట్టారు. అగ్రరాజ్యం బెదిరింపులకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. "మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి.. మేం చర్చలకు రాము గాక రాం’’ అని గట్టిగా చెప్పారు.

ఎంతకూ ఏం జరిగిదంటే..

ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమెనీకి ట్రంప్ లేఖ రాశారు. కొత్త అణు ఒప్పందాన్ని చేసుకుంటే మంచిది. లేకపోతే సైనిక చర్య ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

బెదిరిస్తే బెదరం..

ట్రంప్ హెచ్చరికకు ఆయతొల్లా స్పందించారు. "బెదిరింపులకు తలొగ్గి ఇరాన్ ఎప్పుడు చర్చలకు వెళ్లదు’’ అని స్పష్టం చేశారు. అమెరికాతో చర్చలు జరపడం అవివేకమని ఖమెనీ ఫిబ్రవరిలోనే వ్యాఖ్యానిస్తూ.. 2015లో కుదిరిన అణు ఒప్పందం(Nuclear agreement) నుంచి అమెరికా తప్పకోవడాన్ని ఆయన గుర్తుచేశారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి కూడా అమెరికా ధోరణిని తప్పుబట్టారు. ఒత్తిడి, బెదిరింపులకు బెదిరేది లేదని, ఆ ధోరణి అమెరికాకు మంచిది కాదని హితవు పలికారు.

పెజెష్కియన్ ఎవరు?

పెజెష్కియన్ ఒక సంస్కరణవాది. గత ఏడాది జూలైలో ఇరాన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2015 అణు ఒప్పందాన్ని పునరుద్ధరించాల్సిన అవసరముందని పునరుద్ఘాటిస్తున్నారు. ట్రంప్ 2018లో ఒప్పందం నుంచి తప్పుకున్నారు.

Read More
Next Story