
టెహ్రాన్ లో దాడులు తరువాత వెలువడుతున్న పొగలు
పశ్చిమాసియా: ఇరాన్ పై దాడులు చేసిన ఇజ్రాయెల్, యూఎస్
టెహ్రన్ లో భారీ పేలుళ్లు
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత చెలరేగింది. ఇజ్రాయెల్ మరోసారి భారీ దాడులకు దిగింది. ఈ దాడులతో రాజధాని టెహ్రాన్ దద్దరిల్లింది. మొదటి దాడి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయం సమీపంలో జరిగింది. దీనిలో అమెరికా పాత్ర ఉందా లేదా అని స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఈ ఆపరేషన్ గురించి మాకు తెలుసని అన్నారు. దాడుల సమయంలో ఖమేనీ ఉన్నారో లేరో మాకు స్పష్టంగా తెలియలేదని అన్నారు.
అమెరికా - ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడులు జరగడం గమనార్హం. చర్చలలో ఒత్తిడి పెట్టడానికి భారీ సంఖ్యలో యుద్ధ విమానాలు, విమాన వాహక నౌకలను అమెరికా మెహరించింది. అయితే ఇరాన్ మాత్రం అణు కార్యక్రమాలను నిలిపివేయడానికి అస్సలు అంగీకరించడం లేదు. ఈ దాడులపై ఇరాన్ వెంటనే స్పందించలేదు. అసలు దాడులు జరిగినట్లు కూడా ప్రకటించలేదు. కానీ ఇరాన్ వ్యాప్తంగా పేలుడులు జరిగినట్లు స్థానిక మీడియా వార్తలు ప్రసారం చేసింది.
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ మాట్లాడుతూ.. బెదిరింపుల కోసం ఈ దాడులు చేయలేదని వివరించారు. ఈ దాడుల విషయాన్ని ట్రంప్ కూడా తన సొంత సోషల్ మీడియాలో ధృవీకరించారు.
Next Story

