పశ్చిమ ఆసియా: ఇజ్రాయెల్ ప్రధాని పై తీవ్ర ఒత్తిడి, ఆ విషయంలో నేనా..
x

పశ్చిమ ఆసియా: ఇజ్రాయెల్ ప్రధాని పై తీవ్ర ఒత్తిడి, ఆ విషయంలో నేనా..

ఇజ్రాయెల్ ప్రధానమంత్రిపై సహచర క్యాబినెట్ మంత్రులు తీవ్ర ఒత్తిడి పెడుతున్నారు. గాజా పున: నిర్మాణ విషయంలో ఎటువంటి చర్య తీసుకోవాలనే దానిపై మంత్రుల మధ్య తీవ్ర..


ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ పై రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతోంది. గాజాపై యుద్దం కొనసాగుతుండగానే, ఆ తరువాత గాజాను ఎలా ఆపరేట్ చేయాలనే దానిపై ఇప్పుడు టెల్ అవీవ్ యుద్ధ క్యాబినేట్ లోనే తీవ్ర విభేదాలు పొడచూపాయి. అది కూడా ఆయనకు అత్యంత ఆప్త మిత్రుడు బెన్నిగాంట్జ్ నుంచే.

శనివారం, వార్ క్యాబినెట్ సభ్యుడు, నెతన్యాహు, ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన బెన్నీ గాంట్జ్, గాజాలో పౌర వ్యవహారాలను నిర్వహించడానికి అంతర్జాతీయ, అరబ్, పాలస్తీనా పరిపాలనతో సహా కొత్త యుద్ధ ప్రణాళికను రూపొందించకపోతే జూన్ 8న ప్రభుత్వం నుంచి వైదొలుగుతానని చెప్పారు.
క్యాబినెట్‌లోని మూడవ సభ్యుడు, రక్షణ మంత్రి యోవ్ గాలంట్ కూడా పాలస్తీనా పరిపాలనకి ఒక ప్రణాళిక కోసం పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్.. గాజాను పాలించడాన్ని తాను అంగీకరించనని ఈ వారంలో చేసిన ప్రసంగంలో చెప్పారు. యునైటెడ్ స్టేట్స్ అదే సమయంలో సౌదీ అరేబియా, ఇతర అరబ్ దేశాల సాయంతో గాజాను పాలించటానికి పాలస్తీనియన్ అథారిటీకి పాలనా అధికారాలు ఇవ్వాలని కోరింది. జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులైవన్ ఆదివారం ఇజ్రాయెల్‌ను పర్యటనకు వచ్చినప్పుడు ఆ ప్రణాళికలను ముందుకు తెస్తారని భావిస్తున్నారు. అయితే ఈ ప్రణాళికలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాత్రం అంగీకరించడం లేదు.
గాజాలో పాలస్తీనా అథారిటీకి ఎటువంటి ఇవ్వడానికి వీలులేదని ఆయన బలంగా వాదిస్తున్నాడు. అదే జరిగితే స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు తథ్యమని, దానివల్ల ఇజ్రాయెల్ ఉనికికే ప్రమాదం అని ఆయన భావన. మొదట మనపై దాడి చేసిన హమాస్ ను కూకటి వేళ్లతో సహ పీకేయాల్సిన అవసరం ఉందని, ఆ తరువాతే గాజా గురించి చర్చిద్దామని ఆయన భావన.
హమాస్ ను విడిచిపెట్టడం ఆయన లక్ష్యం
గాంట్జ్ షరతులన్నీ కూడా హమాస్ ను విడిచిపెట్టడం, ఇజ్రాయెల్ ను ఓడించడమే అని నెతన్యాహూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బందీలను విడిచిపెట్టడం, పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయడం ఆయన లక్ష్యంగా గా పెట్టుకున్నారని విమర్శలు గుప్పించారు. యుద్దాన్ని కొనసాగించడానికి అత్యవసర ప్రభుత్వం ఇప్పటికి అవసరమని తాను కోరుకుంటున్నానని, బెన్నీ గాంట్జ్ దీనిపై ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ లోని కొందరు మంత్రులు గాజాను తిరిగి ఆక్రమించుకోవాలని, పాలస్తీనియన్ల "స్వచ్ఛంద వలసలను" ప్రోత్సహించాలని, 2005లో తొలగించబడిన యూదుల స్థావరాలను తిరిగి స్థాపించాలని వారు పిలుపునిస్తున్నారు.
అయితే ఇటీవల జరిగిన ఆందోళనల్లో చాలామంది నిరసన కారులు నెతన్యాహూ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆయన ప్రధానిగా కొనసాగడానికి యుద్దాన్ని పొడిగిస్తున్నారని ఆరోపించారు. యుద్ధాన్ని ప్రేరేపించిన అక్టోబరు 7 దాడి తర్వాత తన మధ్యేవాద పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చిన గాంట్జ్, నెతన్యాహును "మతోన్మాదుల మార్గాన్ని ఎన్నుకోవద్దని, మొత్తం దేశాన్ని అగాధంలోకి తీసుకెళ్లవద్దని" హెచ్చరించాడు. అయితే నెతన్యాహు అలాంటి ఆరోపణలను ఖండించారు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం హమాస్ ను ఓడించడం పైనే అని, ఎన్నికలు నిర్వహిస్తే మన దృష్టి మరలుతుందని అన్నారు.
కొత్తగా ఎన్నికలు జరిగితే నెతన్యాహు పదవి నుంచి దిగిపోతారని దేశంలోని ముందస్తు పోల్స్ సూచిస్తున్నాయి. ఇప్పటికే ఆయనపై పలు రకాలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇవి బయటపడితే ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం మొత్తం ముగింపు పలికే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
రఫా పై దాడి..
ఐడీఎఫ్ దళాలు ఇప్పటికే రఫాపై దాడులు మొదలు పెట్టాయి. దీనిని అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. పరిమిత సంఖ్యలో దాడులు జరుగుతున్నాయని, దీనివల్ల దాదాపు ఎనిమిది లక్షల మంది ప్రజలు వలసపోయారు. వీరి దాడి వల్ల పాలస్తీనా ప్రజలకు అందాల్సిన సాయం కూడా అందడం లేదని ఐరాస ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్, ఖతార్, ఈజిప్ట్ కాల్పుల విరమణ కోసం చర్చలు జరిపిన అవి ముందుకు సాగడం లేదు. బందీలను విడిచిపెట్టడానికి హమాస్ అంగీకరించలేదు.


Read More
Next Story