వెస్ట్ బ్యాంక్: పాలస్తీనియన్ల ఇళ్లను కూల్చివేసిన ఇజ్రాయెల్
x
వెస్ట్ బాంక్ లో ఇజ్రాయెల్ దళాలు

వెస్ట్ బ్యాంక్: పాలస్తీనియన్ల ఇళ్లను కూల్చివేసిన ఇజ్రాయెల్

ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా చర్యలకు దిగినట్లు ప్రకటించిన ఐడీఎఫ్


కొత్త సంవత్సరం రోజున పాలస్తీనా శరణార్థుల ఇళ్లను ఇజ్రాయెల్ కూల్చివేసింది. వెస్ట్ బ్యాంక్ లోని నూర్ షామ్స్ శరణార్థి శిబిరం దగ్గరకు ఇజ్రాయెల్ సైన్యం బుల్డోజర్లు పంపింది. దాదాపు ఏడాది పొడవునా ఆ ప్రాంతంలో ఐడీఎఫ్ తరుచు దాడులు చేస్తూనే ఉంది.

2025 ప్రారంభంలో ఇజ్రయెల్ దళాలు ‘ఐరన్ వాల్’ ను ప్రారంభించింది. దాదాపుగా 11 నెలలుగా వెస్ట్ బ్యాంక్ లోని చాలా ప్రాంతాలను పాలస్తీనియన్లను ఖాళీ చేయించి తమ ఆధీనంలోకి తీసుకుంటోంది.
హ్యుమన్ రైట్స్ వాచ్ ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ ప్రకారం.. నూర్ షామ్స్, జెనిన్, తుల్కరేమ్ శరణార్థి శిబిరాలలో కనీసం 850 నిర్మాణాలను సైన్యం కూల్చివేసింది. 1967 ఇజ్రాయెల్ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నప్పటికీ నుంచి వెస్ట్ బ్యాంక్ లో ఇదే అతిపెద్ద కూల్చివేతలుగా చెప్తున్నారు.
వేలాదిమంది పాలస్తీనా నివాసితులు బంధువులతో నివసిస్తున్నారు. వీరంతా ప్రభుత్వం నిర్మించిన అపార్ట్ మెంట్లు, అద్దె భవనాల్లో కాలం వెళ్లదీస్తున్నారు. సాయుధ గ్రూపులను నిర్మూలించడం ఈ ఆపరేషన్ లక్ష్యం అని ఇజ్రాయెల్ ఓ వైపు ప్రకటించింది.
ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయడానికి లేదా దళాలకు మార్గం క్లియర్ చేయడానికి కూల్చివేతలు అవసరమని చెబుతోంది. ఇజ్రాయెల్ దళాలు ఇక్కడ మరో సంవత్సరం పాటు ఉంటాయని టెల్ అవీవ్ పేర్కొంది. పాలస్తీనియన్లకు ఎప్పుడు ఈ ప్రాంతం తిరిగి అప్పగిస్తారో ఇజ్రాయెల్ ఇంకా స్పష్టం చేయలేదు.
చాలామంది పాలస్తీనియన్లు బుల్డోజర్లు తమ ఇళ్లను కూల్చివేస్తున్న వీడియోలను షేర్ చేస్తున్నారు. సైన్యం కూల్చివేయాలని ప్రణాళిక వేసిన మొత్తం 25 ఇళ్లలో ప్రస్తుతానికి కొన్ని అపార్ట్ మెంట్లను కూల్చివేతలు జరిగాయి.
‘‘మా ఇల్లు అంటే మాకు చాలా ఇష్టం. అనేక జ్ఞాపకాలు దానితోనే ముడిపడి ఉన్నాయి. ఇంటిపక్కల వారు చాలామంచివారు’’ అని మోతాజ్ మోహూర్ అన్నారు. బుల్డోజర్ ను చూపిస్తూ నా ఇళ్లు నాశనం కావడానికి సిద్ధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం తాను తన 25 మంది బంధువులతో కలిసి వేరే దగ్గర ఆశ్రయం పొందుతున్నట్లు చెప్పారు. తన ఇల్లు కూడా కూల్చివేసినట్లు అహ్మద్ అల్ సయ్యస్ అనే వృద్దుడు ఆవేదన వ్యక్తం చేశారు.
తాను నిద్రనుంచి లేచి చూసేసరికి బుల్డోజర్లు ఇంటిని చుట్టుముట్టాయని వెల్లడించారు. ‘‘ఇది చాలా కష్టమైనది, బాధకరమైనది. నేను ఆశ్రయం పొందుతున్న ఇల్లు అమ్మకానికి ఉంది. దానిని వదిలి వెళ్లాల్సి ఉంది. ఒక విషాదం తరువాత మరొక విషాదం. మనం ఎక్కడికి చేరుకుంటామో దేవుడికి మాత్రమే తెలుసు’’ అన్నారు.
‘‘మా తాతలు మొదటి సారి ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు మేము మరోసారి వెళ్లిపోవాల్సి వచ్చింది. 1948 లో ఇజ్రాయెల్ సృష్టి సందర్భంగా జరిగిన యుద్ధంలో జాఫా, హైఫా నగరాల నుంచి వారి వలసలు జరిగాయి. అప్పుడు తాతలు నూర్ షామ్స్ తరలివెళ్లారు. ఆ సమయంలో దాదాపు 7 లక్షల మంది పాలస్తీనియన్లు శరణార్థులుగా ఉన్నారు. ఈ సంఘటనను పాలస్తీనియన్లు ‘నక్భా’(విపత్తు) అని పిలుస్తారు.
సైన్యం పాలస్తీనియన్ల ఇళ్ల నుంచి వస్తువులు తీసుకునేందుకు అనుమతి ఇచ్చిందని సంబంధిత ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయ చర్యలు పరిశీలించిన తరువాతనే కూల్చివేతలు ప్రారంభించినట్లు వెల్లడించింది.
ఆపరేషన్ ప్రారంభమై దాదాపు ఏడాది గడిచిన కూడా ఈ శిబిరం ఇంకా ఉగ్రవాద కార్యకలాపాల ప్రాంతంగానే ఉందని, గత నెలలో దళాలు శిబిరంలో పేలుడు పదార్థాలను గుర్తించాయని సైన్యం ప్రకటించింది.
Read More
Next Story