
పశ్చిమాసియా: అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అంతరాయం
డ్రోన్లు, క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందనే ఆందోళన నేపథ్యంలో సర్వీసులు నిలిపివేసిన విమానయాన సంస్థలు
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా సేనలు పశ్చిమాసియా వైపు కదలడం, ఇరాన్ పై దాడులకే అని ఊహాగానాలు చెలరేగడంతో అంతర్జాతీయ విమానయాన సర్వీసులు గల్ఫ్ దేశాలకు తమ సేవలను రద్దు చేసుకున్నాయి.
ఇరాన్ కూడా తన సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో డచ్, లుఫ్తాన్సా, ఎయిర్ ఫ్రాన్స్ తన సర్వీసులు రద్దు చేసుకున్నాయి.
ఇజ్రాయెల్, దుబాయ్, రియాద్ వంటి కీలక నగరాలకు విమానాలు ఆకస్మాత్తుగా రద్దు చేయడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు క్షీణించడంతో ఎయిర్ ఫ్రాన్స్ తమ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్, ఇరాన్ వంటి దేశాల గగనతలంలోకి విమానాలు ప్రవేశించడాన్ని రద్దుచేసుకున్నట్లు డచ్ క్యారియర్ కేఎల్ఎం తెలిపింది.
ఇరాన్ పై అమెరికా కచ్చితంగా సైనిక దాడులకు దిగుతుందనే ఆందోళనే కారణంగా ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇరాన్ లో ఇటీవల ఏర్పడిన ప్రజాఆందోళన జరిగింది. ఈ నిరసనలపై హింసాత్మక అణచివేతకు అక్కడి ఇస్లామిక్ పాలకులు పాల్పడ్డారు.
వీరికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతుగా నిలిచారు. ఒక్క ప్రాణం పోయిన అమెరికా సత్తా చూపుతామని హెచ్చరించారు. అయితే తరువాత ఎవరికి ప్రాణహని తలపెట్టమని హమీ లభించిందని అందుకే సైనిక దాడులు చేయట్లేదని ప్రకటించారు.
ఎయిర్ ఫ్రాన్స్... .
ఎయిర్ ఫ్రాన్స్, ఇతర అంతర్జాతీయ విమానయాన సంస్థలు టెల్ అవీవ్, గల్ఫ్ లోని అనేక ప్రధాన కేంద్రాలకు విమానాలు రద్దు చేయగా, లుఫ్తాన్సా కూడా తన సేవలను మధ్యప్రాచ్యంలో పగటిపూటకు మాత్రమే పరిమితం చేసింది. ‘‘పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా దుబాయ్ కు తన సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది’’ అని ఫ్రాన్స్ జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఫ్రాన్స్ తెలిపింది.
విమానయాన సంస్థ తన విమానాల భద్రతను నిర్ధారించడానికి భౌగోళిక రాజకీయ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. మరో వైపు కెనడా కూడా తన సేవలను నిలిపివేసింది.
క్షిపణులు, డ్రోన్ల దాడులు జరిగే అవకాశం ఉండే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. గతవారం తమపై అమెరికా సైనిక చర్య తీసుకుంటుందనే అంచనాతో ఇరాన్ నాలుగు గంటల పాటు తన గగనతలాన్ని మూసివేసింది.
Next Story

