
శ్రీనగర్ లో ఖమేనికి అనుకూలంగా నినాదాలు చేస్తున్న ముస్లింలు
పశ్చిమాసియా: ఇరాన్ నుంచి తిరిగొస్తున్న భారతీయులు
టెహ్రన్ లో మామూలు పరిస్థితులు ఉన్నాయంటున్న భారతీయులు, నిరసనకారులకంటే ప్రభుత్వ అనుకూల వర్గాల సంఖ్య ఎక్కువగా ఉందని సమాచారం
పశ్చిమాసియా దేశమైన ఇరాన్ లో తలెత్తిన ప్రజా ఆందోళనలు క్రమంగా హింసాత్మకంగా మారడంతో అక్కడ నివసిస్తున్న భారతీయులు స్వదేశాలకు బయల్దేరారు. తాజాగా ఇరాన్ నుంచి బయల్దేరిన రెండు వాణిజ్య విమానాలు భారతీయులతో సురక్షితంగా న్యూఢిల్లీలో దిగాయి.
ఇవి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రాలేదని సాధారణ ప్రయాణాలే అని తెలిసింది. సాధారణ వాణిజ్య విమానాల ప్రయాణానికి అంతరాయం కలిగినప్పుడే భారత ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటుందని కొన్ని నివేదికలు వెల్లడించాయి.
ఇరాన్ లో దాదాపు 9 వేల మంది భారతీయులు ఉన్నారు. వీరిలో కొంతమంది నుంచి జాతీయ మీడియా సమాచారం సేకరించింది. కొంతమంది ప్రయాణికులు తాము ఉన్నటువంటి ప్రాంతాలలో ఎటువంటి ఆందోళనలు జరగడం లేదని చెప్పగా, మరికొంతమంది మాత్రం తాము ప్రయాణిస్తున్న మార్గాలలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని వివరించారు.
ప్రస్తుతం ఇరాన్ లో ఆందోళనల దృష్ట్యా ఇంటర్ నెట్ వినియోగం, విదేశాలకు ఫోన్ చేయడంలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా కుటుంబాలు భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించలేకపోయాయి. పనికోసం ఇరాన్ వెళ్లి తిరిగి వచ్చని ఒక వ్యక్తి మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడిందని, తాను బసలో నెట్ వర్క్ కనెక్టివిటీ ఎదుర్కొన్నానని, అదే కష్టంగా అనిపించినట్లు చెప్పుకొచ్చారు.
‘‘ప్రజలు ఆందోళన చెందారు కానీ తరువాత టెహ్రన్ ప్రశాంతంగా మారింది. అగ్ని ప్రమాదాలు జరిగాయి. నిరసనలు హింసాత్మకంగా మారాయి. అయితే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే వారితో పోలిస్తే నిరసనకారుల సంఖ్య తక్కువ’’ అని మరో భారతీయుడు చెప్పారు.
ఇరాన్ లో నిరసనలు తీవ్రంగా మారడం, అమెరికా హెచ్చరికల నేపథ్యంలో భారతీయులను తరలించడానికి భారత ప్రభుత్వం సిద్ధమవుతుందని గతంలో విదేశాంగ శాఖ పేర్కొంది. అలాగే భారతీయులు ఎవరూ ఇరాన్ కు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది.
టెహ్రాన్ లో భారత రాయబార కార్యాలయం చేసిన ఒక అడ్వైజరీ ప్రకారం.. ప్రస్తుతం ఇరాన్ లో నివసిస్తున్న భారతీయులందరూ అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలతో దేశం విడిచి వెళ్లాలని కోరింది. పౌరులు ఇలాంటి నిరసనలకు దూరంగా ఉండాలని, ఏదైన సాయం కావాల్సి వస్తే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరింది.
భారతీయుల రాక..
భారత రాయబార కార్యాలయం సూచనలు అనుసరించి చాలామంది భారతీయులు దేశానికి రావడానికి వాణిజ్య విమానాలు ఎంచుకున్నారు. అయితే జనవరి 15న ఇరాన్ తన గగనతలాన్ని మూసివేయడంతో గందరగోళం ఏర్పడింది. దీనితో వాణిజ్య విమానాలు తమ కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. తరువాత ఈ నిషేధాలు తొలగిపోవడంతో భారతీయులు సురక్షితంగా తిరిగి వచ్చారు. తమకు సాయం చేసిన రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు తెలిపారు.
నిరసనలు ఎందుకు జరిగాయి..
అమెరికా డాలర్ తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ అయిన రియాల్ భారీగా పతనం చెందింది. ఒక్క డాలర్ కు ఏకంగా 42 లక్షల రియాల్స్ కు పెరగడంతో ద్రవ్యోల్భణం పెరిగి ప్రజల జీవనం కకావికలం అయింది. దీనితో ప్రజలు స్వచ్చందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. ఈ ఆందోళనలు క్రమంగా హింసాత్మకంగా మారడంతో దాదాపు 2 వేల మంది మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించగా, కొన్ని అంతర్జాతీయ మీడియా లెక్కల ప్రకారం ఇది 12 వేలకు పైమాటే. ఇలా ఇరాన్ నిరసనలను క్రూరంగా అణచివేసింది.
నిరసనకారులకు ఇరాన్ మాజీ పాలకుడు అయిన మహ్మద్ రెజా పహ్లావీ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. పట్టణ కేంద్రాలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. 1979 లో జరిగిన ఇస్లామిక్ తిరుగుబాటు తరువాత పహ్లవీ రాజకుటుంబం అధికారం కోల్పోయింది. తరువాత ఖమేనీల పరిపాలన టెహ్రాన్ లో మొదలయింది.
Next Story

