ఐఎంఎఫ్ ఓటింగ్ కు దూరంగా ఉండి భారత్ సాధించింది ఏమిటీ?
x
పాకిస్తాన్

ఐఎంఎఫ్ ఓటింగ్ కు దూరంగా ఉండి భారత్ సాధించింది ఏమిటీ?

పాక్ కు అనుకూలంగా ఓటు వేసిన అమెరికా, చైనా


(మూలం.. రచెల్ చిత్ర)

భారత్ నుంచి తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) శుక్రవారం పాకిస్తాన్ కు 2.3 బిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించింది. ఈ నిర్ణయం కేవలం డబ్బు గురించి మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన రాజకీయ చర్చ, ఆందోళనకు దారితీసింది.
ఈ రుణం రెండు భాగాలుగా ఐఎంఎఫ్ ఇవ్వబోతోంది. ఒకటి ఈఎఫ్ఎఫ్ కింద 1 బిలియన్ డాలర్లు, ఆర్ఎస్ఎఫ్ కింద మరో 1.3 బిలియన్ డాలర్లు ఇవ్వబోతున్నామని ప్రకటించింది. ఈ రెండు పథకాలు ఆర్ధిక నిర్వహణ లేదా వాతావరణ సంబంధిత ప్రమాదాల కారణంగా ఇబ్బందుల్లో ఉన్న దేశాలకు సాయం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఐఎంఎఫ్ రుణాన్ని ఎలా నిర్ణయిస్తుంది..
ఐఎంఎఫ్ ఏ దేశానికి రుణాన్ని గుడ్డిగా ఇవ్వదు. ఏ దేశానికి ఎంత ఇవ్వాలో మూడు భాగాల సూత్రాన్ని ఉపయోగిస్తుంది.
మొదట ప్రతి సభ్య దేశానికి దాని ఆర్థిక వ్యవస్థ ప్రమాణం, వాణిజ్యస్వేచ్ఛ, విదేశీ నిల్వల ఆధారంగా ఒక కోటా నిర్ణయిస్తారు. ఒక క్లబ్ లో సభ్యత్వ వాటాగా దీనిని భావిస్తే పాకిస్తాన్ కోటా కింద దాదాపు 5.5 బిలియన్లుగా లెక్కగట్టారు. క్లిష్ట సమయాల్లో అది మరింత రుణం తీసుకోవచ్చు. ఐఎంఎఫ్ అప్పుడు ఒక దేశం ఆర్థిక అవసరాలను పరిశీలిస్తుంది.
ప్రస్తుతం పాకిస్తాన్ చెల్లింపుల కొరతను ఎదుర్కొంటోంది. 2025 లో దాదాపు 4.5 బిలియన్ డాలర్లు బయట అప్పులు చెల్లించాల్సి ఉంది. ఇందులో 2.3 బిలియన్ డాలర్ల ప్యాకేజీ పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు అయిపోకుండా, డిఫాల్ట్ చేయకుండా ఉండటానికి ఉపయోగిస్తారు.
ఈఎఫ్ఎఫ్ అండ్ ఆర్ఎస్ఎఫ్..
మూడవది, ఐఎంఎఫ్ఏ కార్యక్రమం కింద రుణం ఇస్తుందనేది ముఖ్యం. ఐఎంఎఫ్ ప్రొగ్రాం ఈఎఫ్ఎఫ్ లోతైన ఆర్థిక సంస్కరణల కోసం దీర్ఘకాలిక రుణాలను అందిస్తుంది. ఈ రుణాల టర్మ్ సాధారణంగా మూడు నుంచి ఐదుసంవత్సరాల వరకూ ఉంటుంది.
ఆర్ఎస్ఎఫ్ అనేది వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి పేద దేశాలకుసాయం చేయడానికి ఉద్దేశించిన కొత్త రుణం. దీనికి చాలా సరళమైన నిబంధనలు ఉంటాయి. తక్కువ వడ్డీరేట్లు, 20 సంవత్సరాల వరకూ దీర్ఘకాలిక సమయం ఉంటాయి.
పాకిస్తాన్ వద్ద ఇప్పటికే ఏడు బిలియన్ డాలర్ల ఈఎఫ్ఎఫ్ ఉన్నందున వరదలు, నీటి కొరత వంటి వాతావరణ ముప్పులను తట్టుకునే దేశ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి 1.3 బిలియన్ డాలర్లను అదనంగా మంజూరు చేశారు.
ఆమోదం ఎలా జరిగింది..
ఈ రుణం పొందడానికి ఏర్పాటు అయిన మార్గం చిన్నది కాదు. పాకిస్తాన్ 2024 సెప్టెంబర్ లో అధికారికంగా ఐఎంఎఫ్ నుంచి సాయం కోరింది. ఐఎంఎఫ్ దీనికోసం అనేక షరతులు విధించింది. అధిక పన్నులు, ఇంధన సబ్సీడీల కోత, అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
నెలల తరబడి జరిగిన చర్చల తరువాత ఐఎంఎఫ్ సిబ్బంది, పాకిస్తాన్ సిబ్బంది స్థాయి ఒప్పందానికి వచ్చాయి. కానీ తుది నిర్ణయం 190 దేశాల ప్రతినిధులతో కూడిన ఐఎంఎఫ్ కార్యనిర్వహాక బోర్డు తీసుకుంటుంది.
ఓటింగ్ కు దూరంగా ..
కార్యనిర్వాహాక బోర్డు శుక్రవారం ఓటింగ్ నిర్వహించింది. అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనా ఈ రుణానికి మద్దతు ఇచ్చాయి. కానీ భారత్ మాత్రం అలా చేయలేదు. భారత్ కు ఐఎంఎఫ్ లో 2.75 శాతం ఓటు హక్కు ఉంది. స్వయంగా నిర్ణయం తీసుకోవాలంటే దాని బలం సరిపోదు. అలాగే ఐఎంఎఫ్ వద్దు అనే నిబంధనలను అనుమతించదు. సభ్యులు అవును అని లేదా ఓటింగ్ కు దూరంగా ఉండవచ్చు.
ఓటింగ్ కు దూరంగా ఉండటం ద్వారా భారత తీవ్ర అసమ్మతిని తెలియజేసింది. దాని ఆందోళనలు తీవ్రమైనవి. పాకిస్తాన్ ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ పై ఎక్కువగా ఆధారపడి ఉంది. అది మొట్టమొదటి సారిగా 1958 లో బెయిల్ అవుట్ పొందింది. ఇప్పటి దాకా పాకిస్తాన్ 28 సార్లు ఐఎంఎఫ్ నుంచి రుణం పొందింది.
భారత్ వాదన..
పాకిస్తాన్ తన ప్రధాన సమస్యలు పరిష్కరించకుండా బాహ్య శక్తులపైనే మాటిమాటికి ఆధారపడుతుందనే సత్యాన్ని ఈ రుణాలు తెలియజేస్తున్నాయని భారత్ వాదించింది. అయినప్పటికీ రుణం అనేక దేశాలు పాక్ కు రుణం ఇవ్వాలని కోరాయి.
దాదాపు 82 శాతం మద్దతుతో అది రుణం పొందింది. ఏదైన రుణం రావాలంటే ఇక్కడ 70 శాతం దేశాల మద్దతు అవసరం.
మొదటగా పాకిస్తాన్ కు 1 బిలియన్ డాలర్ల నిధులను వెంటనే విడుదల చేస్తారు. మిగిలినవి ముఖ్యంగా ఆర్ఎస్ఎఫ్ నిధులు, వాతావరణం అనుకూల ప్రాజెక్ట్ లు, సంస్కరణలపై పురోగతికి అనుసంధానించబడి ఉంటాయి.
రాబోయే కొన్ని సంవత్సరాలలో అంటే 2024-27 లో పాకిస్తాన్ తన పన్ను జీడీపీ నిష్పత్తిని 15 శాతానికి పెంచాలి. విద్యుత్ రంగంలో నష్టాలను 3.4 బిలియన్లకు తగ్గించడం, ప్రభుత్వ యాజమాన్యంలోని పది సంస్థలను ప్రయివేట్ పరం చేయడం, వాతావరణ మార్పులను తట్టుకునేలా మౌలిక సదుపాయాలను నిర్మించడం వంటి అనేక కఠినమైన లక్ష్యాలను చేరుకోవాలి. ఈ లక్ష్యాలను చేరుకోవడం అంత సులభం కాదు.
పాకిస్తాన్ లో గతంలో జరిగిన అనేక ఐఎంఎఫ్ కార్యక్రమాలు దీర్ఘ కాలిక మార్పును అందించడంలో విఫలమయ్యాయి. రాజకీయ ఒత్తిళ్లు, బలహీనమైన సంస్థలు, ఉన్నత వర్గాల ప్రతిఘటన తరుచుగా సంస్కరణ ప్రయత్నాలను పక్కదారి పట్టించాయి. వాస్తవానికి పాకిస్తాన్ గతంలో ఇచ్చిన 25 ఐఎంఎఫ్ రుణాలలో 12 మాత్రమే పూర్తిగా అమలు చేశారు.
అప్పు ఇప్పటికే ఒక సమస్య..
ఈ కొత్త నిధులతో కూడా 2025 చివరి నాటికి పాకిస్తాన్ ఐఎంఎఫ్ కు బాకీ ఉన్న మొత్తం అప్పు 8.3 బిలియన్ డాలర్లకు చేరుతుంది. దేశ ఎగుమతి ఆదాయంలో దాదాపు 35 శాతం రుణ చెల్లింపులకే వెళ్తుంది.
కాబట్టి అది దానిపై అతిపెద్ద భారం. అయితే ఆర్ఎస్ఎఫ్ రుణం పై వడ్డీ కేవలం 25 పైసలే కాబట్టి కాస్త ఉపశమనం లభిస్తుంది.
పాకిస్తాన్.. ఎఫ్ఏటీఎఫ్..
ఈ రుణం కేవలం ఆర్థిక అంశాలకే పరిమితం కాలేదు. భౌగోళిక రాజకీయాలకు సంబంధించినది కూడా. ఐఎంఎఫ్ ప్రధాన సహకారి అయిన భారత్ తన వాదనలను వినిపించింది. నిధుల దుర్వినియోగం, ఉగ్రవాద నిధుల ఆరోపణలపై పాకిస్తాన్ పై ఒత్తిడి తీసుకురావడంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వంటి ప్రపంచ ఆర్థిక నిఘా సంస్థలకు మద్దతు ఇచ్చింది.
పాకిస్తాన్ ను తిరిగి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కూడా భారత్ కోరింది. దీనివల్ల పాక్ రుణ సమీకరణ కష్టమైపోతుంది. కానీ అమెరికా, చైనా తమ సాధారణ చర్యలతో రుణానికి మద్దతు ఇచ్చాయి.
కానీ అదే సమయంలో అత్యంత కఠినమైన షరతులను సైతం విధించాయి. పాకిస్తాన్ కు ఇప్పటికే 14 బిలియన్ డాలర్ల రుణాన్ని అందించిన చైనా కూడా దానికి అనుకూలంగా ఓటు వేసింది.
భారత్ సాధించింది ఏమిటీ?
భారత్ ఓటింగ్ కు దూరంగా ఉండటం వ్యూహాత్మకమైనది. ఇది రుణాన్ని ఆపలేకపోయినా, అది ప్రజా నిరసనగా ఉపయోగపడుతుంది. ఈ గైర్హజరు అక్కడ నమోదు అవుతుంది. భవిష్యత్ లో పాక్ కు రుణాలు ఇచ్చే సమయంలో వాటిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.
భారత ప్రకటన పాకిస్తాన్ చేసే దుర్వినియోగ ప్రమాదాలను హెచ్చరించింది. ఇస్లామాబాద్ సీరియల్ డిఫాల్టర్ అని ఆరోపించింది. ఐఎంఎఫ్ రాజకీయాల్లో ఇటువంటి వ్యాఖ్యలు రుణ ప్రక్రియను పట్టాలు తప్పకుండా ఒత్తిడిని పెంచుతాయి.
పాక్ భవిష్యత్ ఏంటీ?
ఐఎంఎఫ్ ఇచ్చిన 2.3 బిలియన్ రుణం పాకిస్తాన్ కు ఊపిరి పీల్చుకునే అవకాశం ఇచ్చినప్పటికీ అది అంతర్గతంగా ఉన్న సమస్యలను పరిష్కరించదు. దేశం రుణాలు, సంక్షోభం, సంస్కరణల వాగ్థానాల చక్రంలో చిక్కుకుంది. ఈ హమీలు తరుచుగా నేరవేరవు.
భారత్ చేసిన లోతైన నిరసన పాక్ బండారాన్ని హైలైట్ చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనమైన ఆర్థిక వ్యవస్థలను ప్రొత్సహించవచ్చు, అవి నిజంగా మారతాయని నిర్ధారించుకోవచ్చు. ప్రస్తుతానికి పాకిస్తాన్ డిఫాల్ట్ ను తప్పించుకుంది. కానీ ఈ రుణం నిజమైన సంస్కరణకు దారితీస్తుందా? లేదా తదుపరి సంక్షోభాన్ని ఆలస్యం చేస్తుందా? అనేది ఇంకా తేలాల్సి ఉంది.
Read More
Next Story