
ట్రంప్ కన్నేసిన వెనెజువెలా చమురు గురించి మనం తెలుసుకోవాల్సిందేంటీ?
చమురు ఉత్పత్తికి కనీసం ఐదు నుంచి ఏడు సంవత్సరాల వరకూ పడుతుందని చెబుతున్న నిఫుణులు
అమెరికా దళాలు వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను స్వాధీనం చేసుకున్న తరువాత మీడియాతో మాట్లాడిన ట్రంప్.. వెనెజువెలా లో ఉన్న అపారమైన చమురు సంపద కోసం వాషింగ్టన్ ప్రణాళికలు రూపొందిస్తుందని స్ఫష్టం చేశారు.
ఆయన ఫాక్స్ న్యూస్ తో మాట్లాడారు. ‘‘వెనెజువెలా చమురు పరిశ్రమలో అమెరికా బలంగా పాల్గొంటుంది’’ అని ట్రంప్ ఉద్ఘాటించారు. అమెరికాలో ఉన్న అతిపెద్ద చమురు కంపెనీలు పంపుతామని, ఉత్పత్తిని పునరుద్దరించడానికి బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతామని హమీ ఇచ్చారు.
వెనెజువెలా లో ప్రపంచంలో అతిపెద్ద చమురు నిక్షేపాలు ఉన్న దేశాలలో ఒకటి. కానీ అమెరికా ఆంక్షల కారణంగా ఆ దేశం తన చమురు ఉత్పత్తిని భారీ తగ్గించుకుంది. రాజకీయ అస్థిరత కారణంగా అమెరికాతో వైరం ఏర్పడింది. అయితే అమెరికా మద్దతు ఉన్నప్పటికీ ఉత్పత్తిలో మెరుగుదల సాధించడానికి సంవత్సరాల కాలం పడుతుందని ఇంధన రంగ నిఫుణులు చెబుతున్నారు.
ట్రంప్ ఏం అన్నారు?
వెనెజువెలా చమురు రంగంలో అమెరికా ప్రమేయాన్ని ఆర్థికంగా, వ్యూహాత్మక ప్రాధాన్యతను ట్రంప్ రూపొందించారు. ‘‘మాకు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు కంపెనీలు ఉన్నాయి. అతి పెద్దవి, గొప్పవి. మేము పాల్గొంటాము’’ అని ట్రంప్ అన్నారు. అమెరికన్ సంస్థలు వెనెజువెలా దెబ్బతిన్న ఇంధన మౌలిక సదుపాయాలను సరిచేయడానికి, పెద్ద మొత్తంలో చమురును ఇతర దేశాలకు విక్రయించడానికి సాయం చేస్తామని అన్నారు.
వెనెజువెలా చమురు ఆంక్షలు అధికారికంగా అమలులో ఉన్నప్పటికీ, ప్రధాన అమెరికా చమురు కంపెనీలు వెనెజువెలాలోకి ప్రవేశించి ఉత్పత్తిని పెంచడానికి భారీగా పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచించారు. వెనిజువెలాలో తాత్కాలిక పరివర్తనను వాషింగ్టన్ పర్యవేక్షిస్తుందని ట్రంప్ చెప్పారు.
వెనెజువెలాలో చమురు నిల్వల గురించి..
రాయిటర్స్ లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. వెనెజువెలాలో 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచ చమురు నిల్వల మొత్తంలో 17 శాతానికి సమానం.
ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద చమురు నిల్వలు. సౌదీ అరేబియాలో 267 బిలియన్ బ్యారెళ్ల కంటే ఎక్కువ. యూఎస్ కంటే ఆరు రెట్లు ఎక్కువ.
ఈ చమురులో ఎక్కువ భాగం ఈశాన్య వెనెజువెలా విస్తారమైన ప్రాంతమైన ఒరినోకో బెల్ట్ లో ఉన్నాయి. దీనికి వెలికి తీయడానికి భారీ ఎత్తున పెట్టుబడులు అవసరం. అయితే అమెరికాకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలతో ఈ ప్రక్రియ సాంకేతికంగా లాభదాయకంగా తెలుస్తోంది.
అమెరికా ఆంక్షల కారణంగా చాలా సంవత్సరాలుగా వెనెజువెలా సరైన పద్దతిలో చమురును ఉత్పత్తి చేయలేకపోయింది. ట్రంప్ మొదటి పరిపాలన సమయంలో వేసిన ఆంక్షలను, రెండో పాలనలో కఠినతరం చేయడంతో ఎగుమతులు పరిమితం అయ్యాయి.
వెనెజువెలా ఎక్కువగా చైనా, క్యూబాపై ఎక్కువ ఆధారపడవలసి వచ్చింది. 2006 లో హ్యూగో చావేజ్ పెట్రోలియం సంస్థలను జాతీయం చేసిన తరువాత అమెరికా చమురు సంస్థలు అన్ని నిష్క్రమించాయి. ప్రస్తుతం యూఎస్ చమురు ప్రధాన సంస్థ చెవ్రాన్ మాత్రమే అక్కడ చమురును ఉత్పత్తి చేస్తోంది. దీనివాటా 25 శాతంగా ఉంది.
ట్రంప్ ప్రణాళిక నెరవేరుతుందా?
ట్రంప్ ప్రణాళికలు త్వరతగతిన లాభాలు తీసుకురావడం సాధ్యం కాదని నిపుణులు సందేహిస్తున్నారు. వెనెజువెలా చమురు రంగంలో భద్రతా ప్రమాణాలు వెంటనే తీసుకురావడం సాధ్యం కాదు.
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. అమెరికా చమురు దిగ్గజాలు బిలియన్ల కొద్ది పెట్టుబడి పెట్టినప్పటికీ, వెనెజువెలా ముడి చమురు ఉత్పత్తిలో సంవత్సరాల తరబడి పెరుగదల సాధ్యం కాదని నిఫుణులు చెబుతున్న మాట.
అలాగే ఇక్కడ పెట్టుబడి పెట్టే ఏ కంపెనీకైనా ఆంక్షల ఎత్తివేత, అలాగే ఎక్కువ విదేశీ యాజమాన్యాన్ని అనుమతించే చట్టపరమైన సంస్కరణలు అవసరం.
ఇంధన, భౌగోళిక రాజకీయ వ్యూహాకర్త థామస్ ఓ డొన్నెల్ రాయిటర్స్ తో మాట్లాడారు. కనీసం ఐదు నుంచి ఏడు సంవత్సరాలలో ఉత్పత్తి పెరుగుదల ఉంటుందని అన్నారు.
ఈ మార్పును అమెరికా ఆధిపత్యం భావిస్తే సాయుధ ప్రతిఘటన తలెత్తి దీర్ఘకాలిక అస్థిరత ప్రమాదం ఉందని ఆయన ఎత్తి చూపారు. వెనెజువెలా ముడి చమురు భారీగా ఉండటం వల్ల అమెరికా గల్ఫ్ కోస్ట్ శుద్ది కర్మాగారాలకు ఇది బాగా సరిపోతుంది.
చివరికి అమెరికా శుద్ది కర్మాగారాలకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే ప్రపంచ చమురు మార్కెట్లు అమెరికా ఇంధన ధరలపై తక్షణ ప్రభావం ఉండదని విశ్లేషకులు అంటున్నారు.
వెనెజువెలా ప్రస్తుత ఉత్పత్తిలో ఎక్కువ భాగం చైనా, క్యూబా కొనుగోలు చేస్తున్నాయి. అమెరికా ఎగుమతులు చేయాలంటే ముందు కఠినంగా ఉన్న విధించిన ఆంక్షలు ఎత్తివేయడం ముఖ్యం.
Next Story

