పాకిస్తాన్, భారత్ ను ఏమైనా చేయగలదు: కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
x

పాకిస్తాన్, భారత్ ను ఏమైనా చేయగలదు: కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. ఇప్పటికే సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలతో తలబొప్పి కట్టించుకున్న కాంగ్రెస్..


కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ అణ్వాయుధ దేశమని, భారత్ పై ఆ ఆయుధాలను ప్రయోగించగలదని, దానిపై పొగడ్తులు కురిపించి, భారత్ ను తక్కువ చేసే ప్రయత్నం చేశారు.

పాకిస్తాన్ అణ్వాయుధ దేశమని, దానికి ఇబ్బందిపెట్టే పనులు భారత్ చేయకూడదని సుద్దులు చెప్పారు. సరిహద్దుకు సైనిక బలగాలు పంపి పాక్ కవ్వించకూడని, అలా చేస్తే న్యూఢిల్లీకి వ్యతిరేకంగా, ఇస్లామాబాద్ అణ్వాయుధాలు ప్రయోగించే అవకాశం ఉందని అన్నారు.

ప్రభుత్వం కోరుకుంటే ఇస్లామాబాద్‌తో కఠినంగా మాట్లాడవచ్చు, కానీ పొరుగు దేశాన్ని గౌరవించకపోతే, అది భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. “వారి వద్ద అణు బాంబులు ఉన్నాయి. మన దగ్గర అవి కూడా ఉన్నాయి, కానీ ఒక 'పిచ్చివాడు' లాహోర్‌పై బాంబు వేయాలని నిర్ణయించుకుంటే, రేడియేషన్ అమృత్‌సర్‌కు చేరుకోవడానికి 8 సెకన్లు పట్టదు, ”అని మాజీ దౌత్యవేత్త, న్యాయవాదీ అయిన ఈ కాంగ్రెస్ నాయకుడు హెచ్చరించాడు.
"మేము వారిని గౌరవిస్తే, వారు శాంతియుతంగా ఉంటారు. కానీ మనం వాటిని పట్టించుకోకపోతే, ఒక 'పిచ్చివాడు' వచ్చి [భారతదేశంపై] బాంబులు వేయాలని నిర్ణయించుకుంటే ఏమి జరుగుతుంది? అని అయ్యర్ ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అయ్యర్ ఇలా అన్నారు, “విశ్వగురువుగా మారాలంటే, పాకిస్తాన్‌తో మన సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నా, వాటిని పరిష్కరించడానికి మనం తీవ్రంగా కృషి చేస్తున్నామని చూపించాలి. కానీ గత 10 సంవత్సరాలలో, [దీని కోసం] ఎటువంటి కృషి జరగలేదన్నారు.
సరిహద్దు దాటి పారిపోయిన వారిని హతమార్చేందుకు భారత బలగాలు పాకిస్థాన్‌లోకి ప్రవేశిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడంతో భారత్‌-పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. పీఓకే పై రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యల సందర్భంగా కూడా ఫరూక్ అబ్దుల్లా ఇలానే వివాదాస్పదంగా మాట్లాడారు.
‘‘ పీఓకే త్వరలో భారత్ వశం అవుతుంది, దానికోసం భారత్ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. తనంతట తానుగా వచ్చి అది భారత్ లో చేరుతుంది’’ అనే రక్షణమంత్రి వ్యాఖ్యలపై నేషనల్ కాన్పరెన్స్ అధినేత మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఏమి గాజులు తొడుక్కుని కూర్చుని ఉండదన్నారు. పాకిస్తాన్ దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయని భారత్ కు సద్దులు చెప్పాడు.
మరోవైపు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో బిజెపి నాయకులు కాంగ్రెస్‌పై విరుచుకుపడింది, “కాంగ్రెస్ నేతలు భారతదేశంలోనే ఉంటారు, కానీ వారి హృదయాలు పాకిస్తాన్‌లో ఉన్నాయి. పాకిస్థాన్‌కు అసలు ధైర్యం ఉందా? పాకిస్తాన్ కు ఎలాంటి సమాధానం ఇవ్వాలో భారత్ తెలుసంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మణిశంకర్ అయ్యర్ ఇంతకుముందు కూడా ప్రధాని నరేంద్ర మోదీని ‘నీచ్’ అంటూ వ్యాఖ్యానించారు. అది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయం కావడంతో ప్రధాని ఈ వ్యాఖ్యలనే ఆయుధంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లి గెలిచారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారు.
కొన్ని రోజుల తరువాత మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. మొన్న కాంగ్రెస్ పార్టీ విదేశీ వ్యవహరాలు చూసే సామ్ పిట్రోడా(సత్యనారాయణ గంగారామ్ పిట్రోడా)ఇలాగే దక్షిణ భారతీయులను ఆఫ్రికన్లంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి తీవ్ర దుమారం రేపడంతో ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు మరోసారి మణిశంకర్ అయ్యార్ పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు చేశారు.
Read More
Next Story