
ట్రంప్- మోదీ సమావేశంలో ఎవరు ఎక్కువ లాభపడ్డారు?
ముందు వ్యాపారం, తరువాత రాజకీయం, ఆ తరువాతే స్నేహమంటున్న అమెరికా అధ్యక్షుడు
గత అమెరికా అధ్యక్షుడు బైడెన్ పరిపాలనలో తలెత్తిన సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇద్దరు నాయకుల మధ్య స్నేహం స్పష్టంగా కనిపించినప్పటికీ ఈ చర్చలు దేశానికి మిశ్రమ లాభాలనే మిగిల్చాయి.
రక్షణ ఒప్పందాల నుంచి వాణిజ్య అసమతుల్యత వరకూ ఈ సమావేశంలో ప్రధానంగా దేశాధినేతలు చర్చించుకున్నారు. కానీ ద్వైపాక్షిక చర్చలకు ముందే ప్రెస్ మీట్ పెట్టడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. ఇది వివాదాస్పద నిర్ణయాలను దాచిపెట్టే ప్రయత్నమా? కొంచెం ఆలోచించాల్సిన విషయం.
సమావేశం నుంచి కీలకాంశాలు..
ఇందులో రెండు కీలక అంశాలు ఉన్నాయి. అందులో ఒకటి 26/11 ముంబై ఉగ్రవాద నిందితుడు తహవ్వూర్ రాణాను భారత్ కు అప్పగించడానికి అమెరికా అంగీకరించింది.
అలాగే బంగ్లాదేశ్ తో వ్యవహరించే విషయంలో న్యూఢిల్లీకి స్వయం ప్రతిపత్తి ఉంటుందని ట్రంప్ సంకేతాలిచ్చారు. అయితే వాణిజ్య సమస్యలతో పాటు ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా సుంకాల నుంచి దేశానికి ఎటువంటి ఉపశమనం లభించలేదు.
భారత్ తో జరిగే వాణిజ్యంలో అమెరికా తన లోటును తగ్గించుకోవడానికి ఎఫ్ -35 స్టెల్త్ ఫైటర్ తో సహ పెద్ద ఎత్తున సైనిక హర్డ్ వేర్ కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే 2030 నాటికి వాణిజ్యాన్ని 500 బిలియన్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సుంకాలు.. వాణిజ్యం..
ట్రంప్ అనుసరిస్తున్న ‘అమెరికా ఫస్ట్ నినాదం’ ఇందులో బాగా ఉపయోగించుకున్నారు. దేశ ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను విధించారు. ఇది దేశ ఎగుమతులను దెబ్బతీస్తుంది.
ప్రతిగా దేశం మరిన్ని అమెరికన్ వస్తువులను ముఖ్యంగా రక్షణ పరికరాలను కొనుగోలు చేయడం ద్వారా తన వాణిజ్య లోటును తగ్గించుకోవాల్సి ఉంటుందన్న మాట. దేశానికి ఎఫ్ -35 జెట్ విమానాలు అమ్మకం ఒక వ్యూహాత్మక చర్య.
కానీ దీనికి ఈ షరతులు వర్తిస్తాయి. రష్యా లాగా అమెరికా తన సాంకేతికత బదిలీకి ఒప్పుకోదు. ఇప్పుడు వాషింగ్టన్ నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తే దాని నిర్వహణ కోసం దీర్ఘకాలంగా అమెరికా పైనే ఆధారపడాల్సి ఉంటుంది.
అదానీ వివాదం..
ఈ పర్యటనలో అంతగా ప్రచారం కానీ విషయం ఏంటంటే..భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై నమోదైన లంచం అభియోగాలను ఎత్తివేయాలని తీసుకున్న నిర్ణయం. మోదీ అమెరికా పర్యటన కన్నా ముందే ఎఫ్సీపీఏ చట్టాన్ని నిలిపివేస్తూ ట్రంప్ ఉత్తర్వూలు జారీ చేశారు.
భారత్ లో సౌర విద్యుత్ ఒప్పందాలను సంబంధించి 265 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చారని బైడెన్ పరిపాలన ప్రాసిక్యూషన్ ప్రారంభించింది. ఈ విషయంపై మోదీని జర్నలిస్టులు ప్రశ్నించినప్పుడూ ప్రపంచ నాయకులు ప్రైవేట్ వ్యక్తుల గురించి చర్చించరని అన్నారు.
అణు సంస్కరణలు..
ఈ పర్యటనలో ముఖ్యమైన మరో అంశం ఏమిటంటే.. భారత్ తన అణుశక్తి చట్టాన్ని సవరించాలని నిర్ణయించుకుంది. ఈ చట్టాన్ని సవరిస్తే దేశంలో అణు రియాక్టర్లను ఏర్పాటు చేసే అమెరికా కంపెనీలకు ఆర్థిక బాధ్యతలను తగ్గిస్తుంది.
1984 నాటి భోపాల్ గ్యాస్ లీక్ తరువాత ఆ దేశం భారీ జరిమానాల నుంచి తప్పించుకుంది. అయితే దేశ అణుచట్టాలు, అణు నష్టానికి పౌర బాధ్యత కఠినంగా ఉన్నాయి.
ఏదైనా ప్రమాదం జరిగితే అమెరికన్ సంస్థలు భారీ స్థాయిలో జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. వీటిని సవరించాలని వాషింగ్టన్ ఒత్తిడి చేస్తోంది. ఇప్పుడు మోదీ ఈ చట్టాన్ని సవరణ చేస్తే అమెరికా అణు సంస్థలకు తలుపులు తెరిచినట్లు అయింది.
హెచ్ వన్ బీ- ఉపశమనం లేదు.
ట్రంప్- మోదీతో ఎంతో సన్నిహితంగా ఉన్నప్పటికీ తమ దేశానికి వచ్చే నిపుణులకు జారీ చేసే హెచ్ వన్ బీ వీసా పరిమితులపై దృఢంగా ఉన్నారు. అమెరికా వర్క్ వీసాలపై ఎక్కువగా ఆధారపడే భారతీయ ఐటీ రంగానికి ఎటువంటి రాయితీలు లభించలేదు. రిపబ్లిక్ పార్టీకి సపోర్ట్ చేసే ఎక్కువ మంది విదేశీ టెక్ కార్మికులు ఈ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. అందుకే ట్రంప్ నుంచి దీనిపై ఎటువంటి హమీలు రాలేదు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు..
సరిహద్దు ఉద్రిక్తతలు, ముఖ్యంగా రెండు ఆసియా దేశాలైన భారత్- చైనా మధ్య ఉన్న జరుగుతున్న వివాదాలపై మధ్యవర్తిత్వం వహించడానికి ట్రంప్ ముందుకొచ్చారు. కానీ భారత్ దీనిపై జాగ్రత్తగా వ్యవహరించింది.
అలాగే గురుపత్వంత్ సింగ్ హత్య చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై బైడెన్ పరిపాలన భారత్ పై ఆరోపణలు చేసింది. దీనిపై ట్రంప్ వైఖరి అస్పష్టంగానే ఉంది.
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జార్ హత్యకు సంబంధించి కెనడా చేస్తున్న ఆరోపణలు ఇంకా అలాగే ఉన్నాయి. ట్రంప్ పాలన విభాగం బైడెన్ తీసుకున్న నిర్ణయానికి భిన్నమైన దారిలో తీసుకోవచ్చు. ఇది ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.
ఎవరికి ఎక్కువ లాభం
ట్రంప్- మోదీ సమావేశం దాదాపుగా నాలుగు గంటల పాటు జరిగింది. ఇందులో దేశానికి లాభనష్టాలు ఉన్నాయి. రాణా అప్పగింత, బంగ్లాదేశ్ పై పురోగతిని దేశానికి అనుకూలంగా ఉండగా, సుంకాలు, వీసా పరిమితులపై ఎటువంటి ఉపశమనం లభించలేదు. అణు బాధ్యత సవరణ అమెరికా వ్యాపారాన్ని పెంచవచ్చు. కానీ సైనిక కొనుగొళ్ల కారణంగా దేశ వాణిజ్య లోటు పెరుగుతుంది.
ఈ విషయంలో ట్రంప్ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ముందు వ్యాపారం, తరువాత రాజకీయం, ఆ తరువాతే స్నేహం. అమెరికాతో సంబంధాలు ఈ కొత్త దశ నుంచి దేశం నుంచి నిజంగా ప్రయోజనం పొందుతుందా లేదా అనేది రాబోయో నెలల్లో స్పష్టంగా తెలుస్తుంది.
ఇద్దరు నాయకులు ప్రస్తుతానికి నవ్వుతున్నారు. కానీ ఇది బలమైన భాగస్వామ్యానికి పునాదా? లేక మరో లావాదేవీ ఒప్పందమా? ముందు ముందు తెలుస్తుంది.
Next Story