ఉగ్రవాదుల అంత్యక్రియలకు నాయకత్వం వహించిన హఫీజ్ అబ్దుల్ రవూఫ్ ఎవరూ?
x
ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ సైన్యం

ఉగ్రవాదుల అంత్యక్రియలకు నాయకత్వం వహించిన హఫీజ్ అబ్దుల్ రవూఫ్ ఎవరూ?

అంతర్జాతీయ ఉగ్రవాదిని సాధారణ పౌరుడిగా చిత్రించిన పాక్ సైన్యం


మురిడ్కేలోనే లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయంపై భారత్ దాడులు చేసింది. ఇందులో పలువురు ఉగ్రవాద నాయకులు మరణించారు. వీరి అంత్యక్రియల సందర్బంగా ప్రార్థనలకు నాయకత్వం వహించిన మతాధికారి హఫీజ్ అబ్ధుల్ రవూఫ్ గురించి కీలక సమాచారం బయటకు వచ్చింది. దీనితో మరోసారి పాకిస్తాన్ కుట్రలు బయటపడ్డాయి.

పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) అహ్మద్ షరీఫ్ చౌదరి ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో మురిడ్కేలోని లష్కర్ ఏ తోయిబా ప్రధాన కార్యాలయంలో చనిపోయిన ఉగ్రవాదుల ప్రార్థనలకు నాయకత్వం వహించిన వ్యక్తి సాధారణ పౌరుడని నమ్మించే ప్రయత్నం చేశారు.
ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడని షరీఫ్ చెప్పారు. అతను లాహోర్ లో నివాసం ఉంటున్నాడని, ఐడెంటీ కార్డు 35202-5400413-9 గా చెప్పారు. రవూఫ్ పుట్టిన తేదీని మార్చి 25, 1973 గా వివరించారు.
అంతేకాకుండా రవూఫ్ మర్కాజీ ముస్లిం లీగ్(పీఎంఎల్) అధికారిగా సంక్షేమం, అభివృద్ది కార్యకలాపాల కోసం నిధులు సేకరించే వేల్ఫేర్ వింగ్ ఇంచార్జ్ గా కూడా పేర్కొన్నాడు. కానీ ఈ వివరాలన్నీ తప్పుని తరువాత తేలింది.
రవూఫ్ కు సంబంధించిన వివరాలు యూఎస్ ట్రేజరీ డిపార్ట్ మెంట్ కు చెందిన ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ డేటాబేస్ లో ఉన్న వివరాలతో సరిపోలాయి. ఇది ఉగ్రవాదుల జాబితాను నిర్వహిస్తుంది. జాతి వ్యతిరేకులు, నిరోధించబడిన వ్యక్తుల సమాచారం ప్రకారం.. అతను లష్కరే ఏ తయ్యాబా నియమించిన ఉగ్రవాది అని ప్రకటించింది.
హఫీజ్ అబ్దుల్ రవూఫ్ ఎవరూ?
రవూఫ్ 1999 నుంచి ఎల్ఈటీలో క్రియాశీలకంగా ఉంటున్నాడు. రవూఫ్, హఫీజ్ కు సన్నిహితుడు, తరుచుగా అతని దగ్గరగా కనిపిస్తాడు. ఎల్ఈటీలో సమగ్ర నాయకుడు, సభ్యుడు
అమెరికా ట్రెజరీ విభాగం ప్రకారం రవూఫ్ ‘ఫలా ఇ ఇన్సానియత్ ఫౌండేషన్’ కు అధిపతి కూడా. ఎల్ ఈటీ సహాయ కార్యకలాపాలను మారుపేర్లతో నిర్వహిస్తున్నాడు. అమెరికా ఆంక్షల డేటాబేస్ పాకిస్తాన్ లోని రవూఫ్ ఉనికి మొత్తం ఉంది. అనేక పేర్లతో రవూఫ్ ఉపయోగించిన అనేక చిరునామాలను అక్కడ ఉన్నాయి. వాటిలో లాహోర్ లోని మూడు ప్రదేశాలు, ఖానేవాల్ జిల్లాలోని ఒకటి ఉన్నాయి.
ఓఎఫ్ఏసీ డేటాబేస్ రవూఫ్ జాతీయ ఐడీ నంబర్ ఎన్ఐసీ 277-93-113495, అక్టోబర్ 29,2008న జారీ చేయబడిన పాకిస్తానీ పాస్ పోర్టు సీఎం 1074131,2013 లో గడువు ముగిసింది. మరోక పాస్ పోర్టు బుక్ లెట్:ఏ7523531 కూడా పాకిస్తాన్ జారీ చేసింది.
2003 లో పాకిస్తాన్ సొంత ప్రభుత్వం అధికారికంగా అతని పై నిషేధం విధించింది. అయినప్పటికీ రవూఫ్ ఎల్ఈటీ, దాని అనుబంధ సంస్థల పనిని బహిరంగం సమర్థించే పనిలో చురుకుగా ఉన్నాడు.
పాకిస్తాన్ వార్తా సంస్థల కు, ఎల్ఈటీ అధికారిక వెబ్ సైట్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలను పరిశీలిస్తే సంక్షేమ కార్యకలాపాల ముసుగులో నిధుల సేకరణ, విపత్తు సహాయాన్ని నిర్వహించే బాధ్యత ఉన్నట్లు పేర్కొన్నాయి.
అయితే అమెరికా ప్రకారం.. ఈ కార్యకలాపాలు ఎల్ఈటీ ఉగ్రవాద కార్యకలాపాలకు కవర్ అందించడానికి, అంతర్జాతీయ పరిశీలను తప్పించుకోవడానికి ఈ వ్యూహం పన్నారు.
అంత్యక్రియల్లో కీలక సిబ్బంది..
ఉగ్రవాదుల అంత్యక్రియలకు రవూఫ్ నాయకత్వం వహించిన ఫొటోలను భారత్ అధికారిక ప్రెస్ మీట్ లో వెల్లడించింది. ఇందులో పాకిస్తాన్ సైన్యానికి, ఉగ్రవాదులతో ఉన్న సంబంధం బయటపడిందని వ్యాఖ్యానించింది. రవూఫ్ తో పాటు సైన్యానికి చెందిన కీలక అధికారులను గుర్తించడానికి వారి పేర్లను గుర్తించి విడుదల చేయడానికి వీలు కల్పించింది.
వీరిలో లాహోర్ ఫోర్త్ కార్ప్స్ కమాండర్ లెప్టినెంట్ జనరల్ ఫయాజ్ హుస్సేన్ షా, లాహోర్ 11వ పదాతిదళ విభాగానికి చెందిన మేజర్ జనరల్ రావు ఇమ్రాన్ స్తాజ్, ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉస్మాన్ అన్వర్, బ్రిగేడియర్ మహ్మద్ ఫుర్కాన్ షబ్బీర్ వంటి ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు.
ప్రభుత్వ మద్దతు..
అంతర్జాతీయంగా ఉగ్రవాదులుగా పేర్కొనబడిన వారి మధ్య సంబంధాలను తక్కువ చేసి చూపించడం లేదా తిరస్కరించడం, రవూఫ్ ను సాధారణ పౌరుడిగా చూపించడం పాకిస్తాన్ ఆడుతున్న నాటకాలకు తాజా ఉదాహారణ. లాహోర్ లో ఉగ్రవాదుల అంత్యక్రియల ఫొటోలను పరిశీలిస్తే అనేక మంది ఆర్మీ ఉన్నతాధికారులు కూడా రవూఫ్ వెనక ఉన్నారు.
ఉగ్రవాదుల మృతదేహాలను పాక్ జాతీయ జెండాలో చుట్టబడిన శవపేటికలో సైనిక ప్రొటోకాల్ ప్రకారం తీసుకెళ్లారు. ఇది ఉగ్రవాదులకు ఆదేశం ఇస్తున్న మద్దతను సూచిస్తుంది.
యూనిఫాంలో ఉన్న సీనియర్ ఆర్మీ, పోలీసు అధికారులు హజరవడం, పాకిస్తాన్ పంజాబ్ ముఖ్యమంత్రి షహబాజ్ షరీఫ్ అన్న కూతురు మరియం నవాజ్ పుష్ఫగుచ్ఛం సమర్పించడం కూడా ఉగ్రవాదులకు, వారి సంస్థలకు ప్రభుత్వం ఇస్తున్న మద్దతును తెలియజేస్తుంది.
Read More
Next Story