సొరంగం ఏదైనా.. ఆయన రావాల్సిందే!
x
ARNOLD DIX

సొరంగం ఏదైనా.. ఆయన రావాల్సిందే!

సిల్‌క్యారా టన్నెల్ దగ్గర సహాయక బృందాలతో పాటు తరచూ కనిపించిన వ్యక్తి ఆర్నాల్డ్ డిక్స్. రెస్క్యూ ఆపరేషన్ సాగుతున్న తీరుపై ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందించారు.



ఉత్తరాఖండ్, సిల్క్యారా టన్నెల్.. కడుతుండగా కుప్పకూలింది. 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. వాళ్లందర్నీ ఎలా తేవాలో అర్థం కాక అందరూ తలలు పట్టుకున్నారు. అప్పుడొచ్చాడో పెద్దాయన. ప్రతి ఆపరేషన్ కి ఓ నిపుణుడున్నట్టే ఈయన టన్నెలింగ్ స్పెషలిస్ట్.

సిల్‌క్యారా టన్నెల్‌లో కార్మికులు చిక్కుకున్న దగ్గరి నుంచి సహాయక బృందాలు నిద్రాహారాలు మాని అలుపెరగకుండా శ్రమించాయి. NDRF, SDRF, ITBF బృందాలతో పాటు పలు సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వారందరితో కలిసి పనిచేశారు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు ఆర్నాల్డ్ డిక్స్. ఆయనది ఆస్ట్రేలియా. కార్మికులను క్షేమంగా బయటకు తీసుకురాగలమని మొదటి నుంచీ నమ్మిన ఆయన...అద్భుతాన్ని చూస్తారు అని తరచూ వ్యాఖ్యానించేవారు. అనుకున్నట్టుగానే 41 మంది కార్మికులు టన్నెల్ నుంచి క్షేమంగా బయటికొచ్చారు. డిక్స్‌తో పాటు అంతర్జాతీయ మైక్రో టన్నింగ్ నిపుణులు క్రిస్‌ కూపర్ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించారు.

ఎవరీ ఆర్నాల్డ్ డిక్స్...

సిల్‌క్యారా టన్నెల్ దగ్గర సహాయక బృందాలతో పాటు తరచూ కనిపించిన వ్యక్తి ఆర్నాల్డ్ డిక్స్. రెస్క్యూ ఆపరేషన్ సాగుతున్న తీరుపై ఎప్పటికప్పుడు ఆయన అప్‌డేట్స్ అందించారు. కార్మికులను క్షేమంగా బయటకు తీసుకురాగలమని నమ్మిన ఆయన..ఆ నమ్మకంతోనే సహాయక బృందాలతో కలిసి పనిచేశారు. ఆర్నాల్డ్ డిక్స్ అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు. ప్రొఫెసర్. అంతర్జాతీయ టన్నెలింగ్ సంఘం అధ్యక్షుడు. కార్మికులు November నెల 12న దీపావళి రోజు టన్నెల్‌లో చిక్కుకుపోయారు. ఆ రోజే సహాయక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముందుగా కార్మికులకు ఆహారం అందించడంపై దృష్టిపెట్టిన రెస్క్యూ టీమ్ తర్వాత రక్షించే కార్యక్రమాలు మొదలుపెట్టింది. అగర్ యంత్రాలతో డ్రిల్లింగ్ ప్రారంభించింది. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైన వారం తర్వాత టన్నెల్ దగ్గరకు వచ్చారు ఆర్నాల్డ్ డిక్స్. మొదట టన్నెల్‌ లోపలికి వెళ్లి పరిశీలించారు. సహాయక చర్యలపై ఓ అంచనాకొచ్చారు. అప్పటికి అగర్ యంత్రంతో సమాంతర డ్రిల్లింగ్ సాగుతోంది. రెస్క్యూ టీమ్‌కు సూచనలు, సలహాలు ఇస్తూ పర్యవేక్షించారు.

అగర్ మిషన్ స్పీడ్ అందుకున్నా ఆగిందిలా

25 టన్నుల అగర్‌ యంత్రంతో రెస్క్యూ ఆపరేషన్ వేగంగా సాగింది. ఈ నెల 23న కార్మికులు బయటికి వస్తారని విస్తృతంగా ప్రచారం సాగింది. కార్మికులు రెస్క్యూ టీమ్‌కు పక్క ఇంట్లోనే ఉన్నంత దగ్గరగా ఉన్నారని ఆర్నాల్డ్ డిక్స్ తెలిపారు. కానీ అగర్ యంత్రానికి భారీ ఇనుప రాడ్లు తగిలి పదే పదే ఆటంకాలు ఏర్పడడంతో రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమయింది. అగర్ యంత్రం పూర్తిగా పాడయిన తర్వాత మాన్యువల్ డ్రిల్లింగ్ చేపట్టాలని నిర్ణయించినప్పుడు..అందరికీ ఈ ఆపరేషన్ ఎన్ని రోజులు కొనసాగుతుందోనన్న సందేహం నెలకొంది. ఆర్నాల్డ్ డిక్స్ కూడా క్రిస్మస్ లోపు తీసుకొస్తామని నమ్మకంగా చెప్పారు. అయితే సమాంతర డ్రిల్లింగ్‌లో అగర్ యంత్రానికి ఎదురైన చిక్కులు ర్యాట్ హోల్ మైనర్లకు ఎదురుకాలేదు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తయింది.

17వ రోజు ఉదయానికి ఏమైందంటే...

రెస్క్యూ ఆపరేషన్ 17వరోజు ఉదయానికి..కార్మికులను సురక్షితంగా బయటకు తేవడంపై ఆర్నాల్డ్ డిక్స్‌కు పూర్తి అవగాహన వచ్చింది. టన్నెల్ దగ్గర ఉన్న ఆలయం ముందు పూజారితో కలిసి డిక్స్ పూజలు నిర్వహించారు. తానిందకు ముందు ఇలా చెప్పలేదని...రెస్క్యూ ఆపరేషన్..విజయవంతంగా పూర్తి కావొచ్చిందని డిక్స్ తెలిపారు. అసాధారణ విషయాన్ని చూడడానికి సిద్ధంగా ఉండాలని కోరారు.

బయటకి తేవడం మహాద్భఉతం

కార్మికులను టన్నెల్ నుంచి తీసుకురావడం మహాద్భుతమని డిక్స్ అంటున్నారు. ముందు నుంచీ డిక్స్ ఇదే మాట చెబుతూ వచ్చారు. కార్మికులకు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటకు తీసుకురావడం అసాధారమైన విషయమని అన్నారు. భారత్‌లో అద్భుతమైన ఇంజినీర్లు ఉన్నారని...బృందంగా అందరం కలిసి కష్టపడ్డామని డిక్స్ తెలిపారు. విజయవంతమైన మిషన్‌లో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు. మరోసారి టన్నెల్ దగ్గర ఆలయాన్ని సందర్శించి పూజలు జరిపారు. అతిపెద్ద టన్నెల్ రెస్కూ ఆపరేషన్‌లో భాగమైన తమ జాతీయుణ్ని ఆస్ట్రేలియా ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు.

భూగర్భ టన్నెలింగ్‌లో డిక్స్ నిపుణులుగా గుర్తింపు పొందారు. నిర్మాణ ప్రమాదాలు, సెక్యూరిటీ చర్యలు, సాంకేతిక సమస్యల పరిష్కారంలో డిక్స్‌కు ఎంతో అనుభవం ఉంది. సొరంగాల్లో ఫైర్ సేఫ్టీని పెంపొందించడంలో డిక్స్ అనేక విజయాలు సాధించారు.

ఆర్నాల్డ్ డిక్స్ తో పాటు మరెందరో...

ఆర్నాల్డ్ డిక్స్‌తో పాటు అంతర్జాతీయ మైక్రో టన్నింగ్ నిపుణులు క్రిస్ కూపర్ ఈ ఆపరేషన్‌లో పాలు పంచుకున్నారు. భారీ అగర్ యంత్రంతో డ్రిల్లింగ్ సాధ్యం కాకపోవడంతో ప్రత్యామ్నాయ పద్ధతులపై సలహాలు, సూచనలు అందించారు. ఎట్టకేలకు విజయం సాధించారు. సొరంగంలో చిక్కుకుపోయిన 41 మందిని బయటకు తెచ్చారు.

Read More
Next Story