
పశ్చిమాసియాలో ఇరాన్ ఎందుకు ఒంటరి అయ్యింది?
సున్నీ- షియా విభజనలోనే ఇది కలిసి ఉందన్న ‘ది ఫెడరల్ కన్సల్టింగ్ ఎడిటర్’ కేఎస్ దక్షిణామూర్తి
అమెరికా, ఇజ్రాయెల్ నుంచి పశ్చిమాసియా దేశమైన ఇరాన్ పై క్రమక్రమంగా ఒత్తిడి పెరుగుతోంది. ఇదే సమయంలో అంతర్గత సంక్షోభాన్ని టెహ్రాన్ ఎదుర్కొంటోంది. గల్ఫ్ అంతటా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాంతీయ సమన్వయం, భారత విదేశాంగ విధానంపై ఆ ప్రభావాలు కూడా చర్చకు వస్తున్నాయి. సంక్షోభం మూలాలు, ట్రంప్ వైఖరి, ఇరాన్ పరిణామాలపై ‘ది ఫెడరల్’ కన్సల్టింగ్ ఎడిటర్ కేఎస్ దక్షిణామూర్తితో మాట్లాడింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
ఇరాన్ విప్లవం 1979 తరువాత వాషింగ్టన్- టెహ్రన్ మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఇది దశాబ్ధాలా అగాధం. అయితే ఇటీవల సంవత్సరాల్లో వివాదం తీవ్రరూపం దాల్చింది.
ఇజ్రాయెల్ ను అక్కడ బహిరంగంగా వ్యతిరేకించేది ఇరాన్ మాత్రమే. 2005 లో ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న అహ్మదీ నెజాద్ కాలంలో ఇజ్రాయెల్ ఉనికినే ఆయన ప్రశ్నించారు. ఇజ్రాయెల్- అమెరికా సంబంధాలు బలమైనవి, లోతైనవి. ఇజ్రాయెల్ కు వ్యూహాత్మకంగా ముప్పుగా అనిపిప్తే అది అమెరికా వైపు చూస్తుంది. ఇదే అమెరికా విధానాన్ని రూపొందించడానికి కారణమైంది.
2003 లో అమెరికా ఇరాక్ పై దాడి చేసిన తరువాత వివాదం తీవ్రమైంది. ఆ జోక్యం పశ్చిమాసియాలో అమెరికా ఎక్కడైనా దాడి చేయగలదనే సంకేతాలు ఇచ్చింది. ఇది గ్రహించిన ఇరాన్ అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లింది.
అధికారికంగా ఇరాన్ మాత్రం తాను శాంతియుత ప్రయోజనాల కోసమే అణు కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెబుతోంది. కానీ అమెరికా- ఇజ్రాయెల్ మాత్రం దీనిని నమ్మకుండా దానిపై ఆంక్షలు విధిస్తున్నాయి.
జార్జ్ డబ్ల్యూ బుష్ కాలం నుంచి ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడులు ప్రారంభం అయ్యాయి. ఇరాన్ వీటిని ప్రతిఘటిస్తోంది. ఇజ్రాయెల్ అధికారికంగా తన వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని ప్రకటించకపోయినా..తన వద్ద మాత్రం అణ్వాయుధాలు ఉన్నాయనే ప్రవర్తన కనపరుస్తోంది. ఇరాన్ మాత్రం తన రక్షణకు అణు ఆయుధాలు అవసరంగా భావిస్తోంది.
అణు ఒప్పందం ఈ పరిస్థితిని ఎలా మార్చింది? తరువాత అది ఎందుకు రద్దు అయింది?
బరాక్ ఒబామా అధ్యక్షుడయ్యాక ఈ ఉద్రిక్తత కొంత శాంతించింది. ఒబామా సామరస్యపూర్వకంగా విధానాలను అనుసరించాడు. దీని ఫలితంగా ఇరాన్ యురేనియం శుద్దిని తగ్గించడానికి, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తనిఖీలకు అనుమతి ఇచ్చింది.
తద్వారా వీటి మధ్య అణు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై యూరోపియన్ దేశాలు కూడా సంతకం చేశాయి. అయితే ఇది ఇజ్రాయెల్ కు మింగుడు పడలేదు. చారిత్రాత్మకంగా ఈ ప్రాంతీయ శక్తి అణ్వాయుధాలు తయారు చేయకుండా అది చర్యలు తీసుకుంది.
ఇజ్రాయెల్ గతంలో ఇరాక్, సహ ఇతర దేశాలలోని అణు కేంద్రాలపై దాడులకు దిగింది. ఇరాన్ ఒప్పందం అమలులోకి రావడంతో అది ముందస్తు చర్యలు తీసుకోకుండా అడ్డుకట్ట వేసినట్లు అయింది.
ట్రంప్ అధికారంలోకి రాగానే పరిస్థితి మొత్తం మారిపోయింది. అమెరికాలోని ఇజ్రాయెల్ లాబీ నుంచి వచ్చిన ఒత్తిడుల ఫలితంగా ట్రంప్ దూకుడుగా వ్యవహరించారు.
ఆయన వచ్చిరాగానే ఇరాన్ తో కుదిరిన అణు ఒప్పందం నుంచి వైదొలిగారు. 2020 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఇది కాస్త తగ్గినా, రెండోసారి అధికారంలోకి రాగానే అదే ఒత్తిడి కొనసాగిస్తున్నారు. గాజాపై యుద్ధం తరువాత పరిస్థితి దిగజారింది.
తాను నిర్మించిన త్రిబుల్ హెచ్(హెజ్ బుల్లా, హూతీ, హమాస్) నిర్వీర్యం కావడంతో ఇజ్రాయెల్ దూకుడుగా దాడి చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం ఇరాన్ ఒంటరిగా మిగిలిపోయింది.
ఇటీవల సైనిక సమీకరణాలు పరిస్థితిని ఎలా మార్చాయి?
ఆరు నెలల క్రితం ఇజ్రాయెల్, ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి దిగింది. ఇరాన్ ప్రతిగా దానిపైకి బాలిస్టిక్ మిస్సైల్లు ప్రయోగించి ప్రతీకారం తీర్చుకుంది. ఇజ్రాయెల్ ఒంటరిగా ఇరాన్ ను ఎదురించలేదని అర్థమైనప్పుడు అమెరికా నేరుగా జోక్యం చేసుకుంది.
అమెరికా తన సైనిక సామర్థ్యాలతో ఫోర్డో తో సహ ఇతర కీలక ఇరాన్ న్యూక్లియర్ ఆస్తులపై దాడులకు దిగింది. ఇరాన్ లోని ఇప్పుడు బలహీనమైన క్షణాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాయి.
వారికి పని పూర్తి చేయడం అంటే పాలకుడి మార్పు. అయతుల్లా నేతృత్వంలోని ఇస్లామిక్ పాలన తొలగించి, ఉదారవాద, అమెరికా అనుకూల నేతను తీసుకొచ్చి భర్తీ చేయడం దాని లక్ష్యం. ట్రంప్ ఇప్పుడు ఒత్తిడి పెట్టడానికి కారణం ఇదే.
ఇరాన్ అంతర్గత ఘర్షణలు ఎంత తీవ్రంగా ఉన్నాయి?
ఇరాన్ లో విస్తృతంగా కొనసాగుతున్న నిరసనలు తీవ్ర అణచివేతను ఎదుర్కొంటున్నాయి. ఇస్లామిక్ పాలన అనేది ఒక నాయకుడిని తొలగించడంతో కూలిపోయేది కాదు. ఇది బహుళ అంచెల వ్యవస్థ.
ట్రంప్ అయితే సులభంగా పరిపాలన మార్పు చేయవచ్చిని కోరుకుంటున్నారు. ఇజ్రాయెల్ నిఘాతో పాటు నిరసనకారులతో కలిసి పనిచేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు.
ఈ రౌండ్ నిరసనలు మునుపటి వాటికంటే తీవ్రంగా ఉన్నాయి. ఇన్నాళ్లు పాలనకు మద్దతుగా ఉన్న చిన్న, మధ్య తరహ వ్యాపారులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు.
ద్రవ్యోల్భణం, ఆర్థిక సంక్షోభం, ఆంక్షల కారణంగా ఈ వర్గం ఇప్పుడు నిరసనలు తెలుపుతోంది. వారి కోపం, ఆందోళన పరిగణలోకి తీసుకోవాల్సిందే. రోజువారీ వ్యాపారాలు దెబ్బతినడం వారి జీవనోపాధిపై ప్రభావం చూపింది. ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వ పరిస్థితి ఏమంత బాగాలేదు.
ఈ నిరసనల్లో అమెరికా, ఇజ్రాయెల్ జోక్యం ప్రతికూల ఫలితాలను ఇస్తోంది. ఇరాన్ లో అమెరికా వ్యతిరేక, ఇజ్రాయెల్ వ్యతిరేకత చాలా లోతుగా ఉంది. ఈ నిరసనల్లోకి వారు ప్రవేశం జరిగాడని తెలియగానే అవి చట్టబద్దతను కోల్పోయాయి. ఇది ఇంతకుముందు జరిగింది. తరువాత జరుగుతుంది. కాబట్టి సంక్షోభం తీవ్రంగా ఉన్నప్పటికీ ఇస్లామిక్ రిపబ్లిక్ ఇంకా పతనావస్థకు చేరుకోలేదు.
పశ్చిమాసియాలో ఇరాన్ ఎందుకు ఒంటరి అయ్యింది?
దీని మూలాలు షియా- సున్నీ విభజనలో ఉన్నాయి. ఇరాన్ షియా మెజారిటీ దేశం. దాని పక్కన సున్నీ మెజారిటీ దేశమైన సౌదీ అరేబియా ఉంది. ఇది రాచరికం. రాచరికాన్ని కూలదోసి ఇరాన్ లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పాటు చేశారు.
ఇది సౌదీ అరేబియాను కలవర పెట్టింది. బహ్రెయిన్, సిరియా, లెబనాన్ వంటి దేశాలలో ఇది ప్రభావం చూపించింది. అరబ్ దేశాల కంటే భిన్నమైన గుర్తింపు ఉన్న ఇరాన్ సహజంగానే వాటికి దూరమైంది. కాలక్రమేణా ఇజ్రాయెల్- సౌదీ స్నేహితులయ్యారు.
ఇరాన్ అణ్వస్త్రాలు తమకు పెద్ద ముప్పుగా ఇవి భావిస్తున్నాయి. ప్రాంతీయ శత్రుత్వాలు సున్నీ దేశాలను ఇరాన్ నుంచి దూరం చేశాయి.
2016 దిగ్భంధనం తరువాత ఇరాన్ మద్దతుతో లబ్ధి పొందిన ఖతార్ లో ప్రధాన అమెరికా స్థావరం ఉంది. ఇది ఇరాన్ కు కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరాన్ క్షిపణులు ప్రయోగించినప్పుడు దాని సమీపంలోనే పడ్డాయి. నేడు పశ్చిమాసియాలోని ఏ శక్తి కూడా ఇరాన్ బహిరంగంగా మద్దతు ఇవ్వడం లేదు. దీనివల్ల అది ఒంటరిగా కనిపిస్తోంది.
ఇరాన్ తో ఇండియా అధికార సమతుల్యత పాటించడం కష్టమా?
ఇరాన్ తో నెరుపుతున్న చాలా సంబంధాల నుంచి భారత్ కొంతవరకూ వెనక్కి తగ్గింది. పదిహేను సంవత్సరాల క్రితం వరకూ ఇవి బలంగా ఉండేవి. ఇరాన్ నుంచి పాకిస్తాన్ ద్వారా భారత్ కు చమురు పైప్ లైన్ ప్రతిపాదన కూడా వచ్చింది.
ఇది మూడు దేశాలకు ప్రయోజనకారి. అయితే అమెరికా ఆంక్షలు విధించడంతో భారత్ ఈ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గింది. ఈ సంఘటన అమెరికా ప్రభావాన్ని నిరోధించడంలో భారత్ పాత్ర పరిమితంగా ఉందని తెలియజేసింది.
తరువాత ఇరాన్ నుంచి చమురు దిగుమతులు భారత్ గణనీయంగా తగ్గించింది. వీటికి తోడు 25 శాతం ఇరాన్ సుంకం కూడా విధించడంతో కొత్త ఒత్తిడి వచ్చి చేరింది. వ్యూహాత్మంగా భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్ట్ సైతం అడ్డంకులు ఎదుర్కొంటోంది.
రాజకీయంగా భారత్- ఇరాన్ మధ్య ఘర్షణలు చాలా అరుదుగా జరిగాయి. కాశ్మీర్ గురించి అప్పుడప్పుడు చేసిన వ్యాఖ్యల తప్ప. ప్రజల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయి. చాలామంది భారతీయులు ఇరాన్ లో చదువుకుంటున్నారు. అక్కడ పనిచేస్తున్నారు.
కానీ ఆర్థికంగా, వ్యూహాత్మకంగా భారత్ పరిమితంగా ప్రభావం చూపుతోంది. ఉద్రిక్తతలు సైనిక ఘర్షణలకు దారితీస్తే అక్కడి నుంచి తరలింపులు అవసరం అవుతాయి. ఇరాన్ కు మద్దతుగా నిలుస్తున్న చైనా లాగా భారత్, అమెరికా ఒత్తిడిని ధిక్కరించలేకపోతున్నది.
Next Story

