‘‘ట్రంప్- పుతిన్ మధ్య సమావేశం ఎందుకు అత్యంత కీలకమైనది’’
x
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్

‘‘ట్రంప్- పుతిన్ మధ్య సమావేశం ఎందుకు అత్యంత కీలకమైనది’’

పరిష్కారం చాలా శ్రమతో కూడుకున్నదన్నా జేఎన్ యూ ప్రొఫెసర్ స్వరణ్ సింగ్


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య అలస్కాలో సమావేశం జరిగింది. ఈ మీటింగ్ మంచి వాతావరణంలో జరిగినట్లు తెలిసింది. కానీ అంతా అనుకున్నట్లు ఉత్తమ ఫలితాలు మాత్రం సాధించలేకపోయింది.

ఉక్రెయిన్ ఇందులో పాల్గొనకపోవడం, కాల్పుల విరమణ అంశంపై ఎటూ తేలకపోవడంతో వివాదం ఓ కొలిక్కి వస్తుందా రాదా అనే ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి.

ఈ అంశానికి సంబంధించి జేఎన్ యూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ స్వరణ్ సింగ్ శిఖరాగ్ర సమావేశం నుంచి వచ్చిన సంకేతాలను వివరించే ప్రయత్నం చేశారు.


అలస్కాలో జరిగిన ట్రంప్- పుతిన్ శిఖరాగ్ర సమావేశం నుంచి మీరు గ్రహించిన ముఖ్య విషయాలు ఏంటీ?
ఆరు నుంచి ఏడు గంటల పాటు ఈ శిఖరాగ్ర సమావేశం జరిగినప్పటికీ ఎలాంటి ప్రకటన, ఫలితం లేకుండా ముగిశాయి. అలస్కాకు వచ్చిన పుతిన్ కు, ట్రంప్ రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. తన తో పాటు లియోజిన్ లో ప్రయాణించమని ఆహ్వానించారు. మంచి బాడీ లాంగ్వేజ్ ను ప్రదర్శించారు.
ఇటీవల కాలాల్లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్లు జారీ చేయడంతో పుతిన్ ఏ దేశానికి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. ఇప్పుడు అమెరికాలో ప్రయాణించడం వలన దానికి చెల్లుచీటి ఇచ్చినట్లు అయింది.
ఇరు దేశాధినేతల మధ్య మంచి వాతావరణంలో చర్చలు జరిగినప్పటికీ ఉక్రెయిన్ పై మాత్రం ఎలాంటి ఒప్పందం కుదిరినట్లు కనిపించడం లేదు. ట్రంప్ స్వయంగా ప్రారంభంలోనే ‘‘ఒప్పందం కుదిరే వరకూ ఒప్పందం లేదు’’ అని ప్రకటించారు.
అయినప్పటికీ ఇద్దరు నాయకులు చర్చలు కొనసాగించడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఇది మంచి పరిణామం. ట్రంప్ నిజాయితీతో చేసిన ప్రయత్నాలను పుతిన్ ప్రశంసించారు. తదుపరి చర్చల కోసం ఆయనను మాస్కోకు ఆహ్వానించారు. ఇది వరుసగా శిఖరాగ్ర సమావేశాలకు దారి తీసింది.
సీజ్ ఫైర్ ఒప్పందం వస్తుందనే అనుకున్నారు? కానీ అలాంటి ప్రకటన రాలేదు ఎందుకు?
ట్రంప్ ఈ చర్చలను అన్వేషణమైనవిగా ముందుగానే అభివర్ణించారు. ఇది ఒక చట్రాన్ని నిర్మించే ప్రయత్నాల్లో పడిన తొలి అడుగు. కాల్పుల విరమణ ప్రకటించనప్పటికీ భవిష్యత్ చర్చలకు తలుపులు తెరిచే ఉంచారు. అమెరికా అధ్యక్షుడు గతంలో జరిపిన శిఖరాగ్ర సమాశేశాల కంటే ఈ సమావేశం మొత్తం మీద మరింత సానుకూలంగా ఉంది.
అయినప్పటికీ రెండు వైపులా అంతరాలు తగ్గాయని అనుకోవద్దు అవి అలాగే ఉన్నాయి. నాటో విస్తరణ, ఉక్రెయిన్ కు సభ్యత్వం ఇవ్వడానికి ఈ వివాదానికి ప్రధాన కారణంగా పుతిన్ చెబుతున్నారు. ఇప్పుడూ అదే చెప్పారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి ఈ సమావేశానికి ఆహ్వానం లేకపోయినప్పటికీ కీవ్ శాంతిచర్చలకు సిద్దంగా ఉందని తెలియజేస్తూ ఒక వీడియో సందేశాన్ని విడుదలు చేశారు. కానీ ఇందులో రష్యాను మాత్రం నిందించారు.
ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకుండా ఎటువంటి ఒప్పందం కుదరకూడదని కూడా యూరోపియన్ నాయకులు కోరుకుంటున్నారు. ఇది భవిష్యత్ లో ట్రంప్ ను కూడా విస్తరించిన శిఖరాగ్ర సమావేశాలు ఏర్పాటు చేయడానికి ఒత్తిడి పెంచే అవకాశం కనిపిస్తుంది.
ఉక్రెయిన్, ఈయూ నాయకులతో శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తే ఈ ప్రక్రియను సులభం చేస్తుందా లేదా మరింత క్లిష్టతరంగా మారుస్తుందా?
ముందు వెళ్లే మార్గం అంత సులభంగా లేదు. ట్రంప్, జెలెన్ స్కీని చర్చలలోకి తీసుకురావాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. కానీ పుతిన్ అమెరికాతో ద్వైపాక్షిక చర్చలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
ట్రంప్ తో జరిగిన తన సమావేశంలో ఉక్రెయిన్, యూరప్ ను బలహీనపరిచినట్లు కాదని పుతిన్ ఇప్పటికే ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ ను ఎదుర్కోవడం కంటే అమెరికాతో చర్చలు జరపడం లాభిస్తుందని, పుతిన్ ద్వైపాక్షిక చర్చలకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
అయితే ఇవి తదుపరి చర్చలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. చర్చలు ద్వైపాక్షికంగా కొనసాగుతాయా? ఉక్రెయిన్, యూరోపియనన్ నాయకులను చేర్చడానికి విస్తరిస్తాయా అనేది ఫలితాన్ని నిర్ణయిస్తుంది.
భూభాగ మార్పిడి అతిపెద్ద సమస్య.. అది ఎలా పరిష్కరిస్తారు?
ఇది ఇప్పటికి అత్యంత సంక్లిష్టమైన సమస్య. సరిహద్దులను మార్చే అధికారం జాతీయ శాసనసభకు మాత్రమే ఉన్న ఉక్రెయిన్ రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ జెలెన్ స్కీ ఏ భూభాగాన్ని అప్పగించకూడదని భీష్మించుకు కూర్చున్నారు.
అదే సమయంలో రష్యా 2014 లొ విలీనం చేసుకున్న క్రిమియా, డోనెట్స్క్, లుహాన్స్క్ తో సహ డాన్ బాస్ లోని అతిపెద్ద ప్రాంతాలపై నియంత్రణ నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది.
మాస్కో వీటిలో కొన్నింటిని స్వతంత్య్ర రిపబ్లిక్ లు గా ప్రయత్నిస్తోంది. వాటిని వదులుకునే ఉద్దేశం దానికి కూడా లేదు. ట్రంప్ ప్రాదేశిక మార్పిడుల అంశం గురించి మాట్లాడాడు.
అయితే అది ఆచరణలో ఎలా ఉంటుందో ఇంకా బయటకు చెప్పలేదు. ఈయూ మిత్రదేశాలు అటువంటి ఆలోచనలను తోసిపుచ్చలేదు. కానీ ఉక్రెయిన్ నేరుగా పాల్గోనాలని డిమాండ్ చేస్తున్నాయి.
జార్జియా, మోల్దోవా వంటి దేశాలతో రష్యా యుద్ధం చేసి వాటి భూభాగాలను తన ఆధీనంలోకి తీసుకుంది. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ పరిష్కారం అనేది శ్రమతో కూడుకున్నది అవుతుంది. దీనికి సుదీర్ఘకాలం సమయం పట్టే అవకాశం ఉంది.
ఇద్దరు నాయకులు మీడియా సమావేశాలకు దూరంగా ఉన్నారు? ఎందుకు?
మీడియా నుంచి ప్రశ్నలను స్వీకరించకూడదని ఇద్దరు ఉద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ప్రారంభంలోనే దాన్ని ముగించే వ్యాఖ్యలను ఇద్దరు నాయకులు నివారించాలని అనుకున్నారు. అదే సమయంలో చర్చలు అత్యంత సున్నితమైన దశలో ఉన్నాయని ఇది సూచిస్తుంది.
ఉద్రిక్తతలను తగ్గించే బదులు, రెండు వైపులా తమ బేరసారాల స్థానాలను బలోపేతం చేసుకోవడానికి భూమిపై దాడులను తీవ్రతరం చేసే అవకాశం కూడా ఉంది. మూడున్నర సంవత్సరాల యుద్ధం తరువాత రష్యా- ఉక్రెయిన్ రెండు అలసిపోయినట్లు కనిపిస్తున్నాయి.
రెండు దేశాలు మాత్రం వెనక్కి తగ్గడానికి మాత్రం సిద్ధంగా లేవు. అలస్కా శిఖరాగ్ర సమావేశం చర్చలకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసింది. కానీ అది ఉద్రిక్తత తగ్గే సంకేతాలను మాత్రం అందించలేదు.
Read More
Next Story