
ఇరాన్ పై సుంకాలు విధిస్తే భారత్ పై ప్రభావం చూపిస్తుందా?
పర్షియన్ దేశంతో భారత్ చేసేది చాలా తక్కువ వాణిజ్యమే
ఇరాన్ లో జరుగుతున్న తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఆ దేశంతో వ్యాపారం చేసే ఏ దేశంపైనా అయినా 25 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించారు.
అంతర్జాతీయ పరిణామాలపై తాజాగా నిర్వహించిన కాపిటల్ బీట్ ఎపిసోడ్ లో అంతర్జాతీయ వ్యవహరాల నిపుణుడు సంజయ్ కపూర్, మాజీ దౌత్యవేత్త ప్రొఫెసర్ అఫ్తాబ్ కమల్ పాషా పాల్గొన్నారు.
ఇరాన్ లో జరుగుతున్న ప్రజా ఆందోళనలు హింసాత్మక స్థాయికి చేరుకున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 12 వేల మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. మరో 11 వేల మందిని అదుపులోకి తీసుకుని ప్రజా ఆందోళనలను ఇరాన్ తీవ్రంగా హింసాత్మకంగా అణచివేస్తోంది.
ఈ నేపథ్యంలో ట్రంప్ ఇలాంటి ప్రకటన చేశారు. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రపంచ దేశాలలో ముఖ్యంగా భారత్ పై ఎలాంటి ప్రభావం చూపబోతోంది ప్యానెలిస్టులు చర్చించారు.
టారిఫ్ ప్రకటన..
‘‘టారిఫ్ తక్షణమే అమల్లోకి వస్తుంది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ తో వ్యాపారం చేసే ఏ దేశమైనా, అమెరికాతో చేసే వ్యాపారంపైన 25 శాతం సుంకాలు చెల్లించాలి’’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్యానెలిస్ట్ లు ఇక్కడ వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించింది. ‘‘ఇరాన్ పై వైమానిక దాడులు మా ముందున్న వాటిల్లో ఒకటి’’ అన్నారు. ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడితో పాటు సైనిక ఒత్తిడి వంటి వ్యూహాలను సైతం అవలంభిస్తామని ప్రత్యక్ష సంకేతాలను ఇచ్చిందని అభిప్రాయపడ్డారు.
యూఎస్ సుంకాల వ్యూహం..
తమ దేశ ఆదాయాన్ని పెంచడం, తనతో వ్యాపారం చేసే వాణిజ్య భాగస్వాములపై ఒత్తిడి తీసుకురావడం లక్ష్యంగా యూఎస్ సుంకాల విధానం తీసుకువచ్చిందని ప్రొఫెసర్ పాషా అన్నారు. యూఎస్ ఆదాయం పెంచడానికి ట్రంప్ రూపొందించిన వ్యూహానికి ఇరాన్ పై తాజా ఆంక్షలు కొనసాగింపని పేర్కొన్నారు.
ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా అనేక దేశాలు సుంకాలు తగ్గించుకున్నాయని ఆయన ఉదాహారణలుగా జపాన్, దక్షిణ కొరియా, ఈయూ, ఇండోనేషియా, మలేషియాలను ఉదహరించారు. భారత్ తో జరపుతున్న చర్చలు నిలిపిపోయాయని పేర్కొన్నారు.
భారత్ పై ఇప్పటికే అదనంగా 25 శాతం సుంకాలను ఎదుర్కొంటోందని ఇరాన్ తో వ్యాపారం చేస్తే ఇదే విధంగా మరో 25 శాతం పడే అవకాశం ఉందని ప్రొఫెసర్ అన్నారు.
భారత్ - ఇరాన్ మధ్య..
ఇరాన్ తో భారత్ చాలా పరిమిత స్థాయిలో వాణిజ్యం నెరుపుతోందని పాషా అన్నారు. ‘‘మనం ఇరాన్ తో ప్రధాన వాణిజ్య భాగస్వామి కాదు’’ అన్నారు. ఇరు దేశాల మధ్య బాస్మతి బియ్యం, రసాయనాలు, టీ వంటి ఎగుమతులు జరుగుతున్నాయి. వీటి విలువ వన్ బిలియన్ డాలర్లకు కొంచెం అటూఇటూగా ఉన్నాయి.
అయితే ఈ వస్తువులను ఇరాన్ గల్ఫ్ లోని ఇతర దేశాల నుంచి సైతం పొందవచ్చని, ఈ చర్యవల్ల సుంకం నుంచి ఉపశమన చర్యలు ఉంటాయని చెప్పారు. టర్కీ, రష్యాలు ఇరాన్ తో జరిమానాలు ఎదుర్కొకుండా వ్యాపారం కొనసాగిస్తున్నాయని చెప్పారు. గతంలో సుంకాలను చైనా తీవ్రంగా ప్రతిఘటించిందని దీనివల్ల అమెరికా వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు.
ఇరాన్ పై ఒత్తిడి..
అమెరికా అధ్యక్షుడు తాజాగా ప్రకటించిన సుంకాలను ఇరాన్ తో పాటు దాని వాణిజ్య భాగస్వాములపై ఒత్తిడి పెంచేందుకు ప్రయోగించారని పాషా పేర్కొన్నారు. ‘‘ఇరాన్ పై మరింత ఒత్తిడి తీసుకురావడమే’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే దశాబ్ధాలుగా ఇరాన్ పై విధించిన ఆంక్షలు ఆ దేశ నాయకత్వాన్ని బలహీనపరచలేదని, పాలకులు మెత్తబడలేదని ఆయన అన్నారు. అనేక విధాలుగా ఆంక్షలు ఉన్నప్పటికీ ఇరాన్ తన సైనిక, సాంకేతిక సామర్థ్యాలను పెంచుకుందని, స్టార్ లింక్ వంటి ఉపగ్రహ ఆధారిత నెట్ సేవలను సమర్థవంతంగా నిలిపివేసిందని చెప్పారు.
తన నియంత్రణలోనే పాలన ఉందని మరోసారి చెప్పిందన్నారు. ఇరాన్ పై తాజాగా విధించిన సుంకాలు భారత్ పై ఎలాంటి ప్రభావం చూపవన్నారు.
సందిగ్థత..
ఇరాన్ తో సంబంధాలను న్యూఢిల్లీ అంతగా ఇష్టపడకపోవచ్చని సంజయ్ కపూర్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ మొదటి కాలంలో అమెరికా ఆంక్షల తరువాత ఇరాన్ నుంచి చమురు, గ్యాస్ దిగుమతులను తగ్గించిందని ఆయన గుర్తు చేశారు.
చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తూ.. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికన్ లాజిస్టిక్స్ అవసరాల కారణంగా ఇది గతంలో అమెరికా రాయితీలను పొందిందని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం ఇరాన్ పట్ల అంత ప్రేమ ఉందని నేను అనుకోను’’ అని కపూర్ అన్నారు.
పరిమిత ఆర్థిక ప్రభావం..
ఇరాన్ పై విధించిన సుంకం భారత్ పై చాలా పరిమితంగా పనిచేస్తుందని అన్నారు. ‘‘1.68 బిలియన్ల వాణిజ్యంపై 25 శాతం సుంకం చాలా మొత్తం’’ అని ఆయన అన్నారు.
అవసరమైతే పరిణామాన్ని సులభంగా సర్థుబాటు చేయవచ్చు. భారత్ కు వేరే సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. చైనా, పాకిస్తాన్ లతో అమెరికా సంబంధాలు క్రమంగా వేళ్లునుకుంటున్నాయని చెప్పారు.
వాషింగ్టన్ తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్ బలమైన ప్రయత్నాలు చేసిందని ఆయన గుర్తు చేశారు. భారత్ వీటి విషయంలో ఒత్తిడి ఎదుర్కొంటోందని చెప్పారు.
అమెరికా - భారత్ ఘర్షణలు
ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా- భారత్ సంబంధాలు క్షీణించాయని ప్రొఫెసర్ పాషా వివరించారు. ద్వైపాక్షిక వాణిజ్య విస్తరణకు సంబంధించిన అంచనాలను ఆయన ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య చర్చలు సఫలం కాలేదని చెప్పారు.
గత ఏడాది ఫిబ్రవరి నుంచి ట్రంప్ భారత్ పై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. వాణిజ్య ఒప్పందాలు, రష్యా చమురు దిగుమతులు, రక్షణ కొనుగోళ్లు, బ్రిక్స్ కూటమి లో భారత పాత్రపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత్- చైనా మధ్య సంబంధాలు క్రమంగా పెరగడంపై వాషింగ్టన్ అసహనంగా ఉందని, న్యూఢిల్లీపై అనుమానంగా వ్యవహరిస్తోందని చెప్పారు.
దౌత్యపరమైన ఒత్తిడి..
ట్రంప్- మోదీ మధ్య కమ్యూనికేషన్ అంతరం, అహం ప్రధాన సమస్యగా ఉందని ప్రొఫెసర్ పాషా పేర్కొన్నారు. అగ్రదేశాలైన యూఎస్, రష్యా, చైనా నుంచి నిరంతర ఒత్తిడులు భారత్ సామర్థ్యంపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు.
అమెరికా వాణిజ్య డిమాండ్లు అంగీకరిస్తే దేశీయ వ్యవసాయదారులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, దేశ ఆహర భద్రత ప్రమాదంలో పడుతుందని చెప్పారు.
అమెరికా సైనిక చర్య తీసుకుంటే 1979 నాటి పరిస్థితులు మరోసారి ఎదురవుతాయని కపూర్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇది గల్ఫ్ లో తీవ్ర అల్లకల్లోలం రేపడానికి కారణం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరాన్ పై సైనిక దాడి చేసే సత్తా అమెరికా, ఇజ్రాయెల్ కు ఉందని పాషా అన్నారు. అయితే గల్ఫ్ లోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసి ప్రతీకారం తీర్చుకోవచ్చని ఆయన చెప్పారు.
ఇది దేశంపై ప్రభావం చూపుతుందని అన్నారు. గల్ప్ లో దాదాపు 10 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. భారత్ కు వచ్చే ఆయిల్, గ్యాస్ ఇక్కడి నుంచే వస్తోందని చెప్పారు. యుద్ధం జరిగితే వీటిపై ప్రభావం పడుతుందని విశ్లేషించారు. సరఫరా గోలుసులకు అంతరాయం కలుగవచ్చని ప్రొఫెసర్ పాషా అన్నారు. ఇవి భారత్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రాంతీయ ఘర్షణలు తన ప్రయోజనాలను ప్రభావితం చేయదని భావించడం కంటే భారత్ చురుగ్గా, వాస్తవికంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఇరాన్, అమెరికా విధానం, ప్రాంతీయ భద్రత చుట్టూ జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ప్యానెలిస్టులు అభిప్రాయపడ్డారు.
Next Story

