షేక్ హసీనాకు భారత్ లో ఆశ్రయమిస్తే... ఆ ఇస్తే ఏమవుతుంది?
x

షేక్ హసీనాకు భారత్ లో ఆశ్రయమిస్తే... ఆ ఇస్తే ఏమవుతుంది?

భారత ఉపఖండం లేదా ఇప్పుడు అంతా పిలుసున్న దక్షిణాసియాలో న్యూఢిల్లీదే పెద్దన్న పాత్ర. మిగిలిన దేశాలన్నీ కూడా ఇక్కడ కిక్కురుమనకుండా ఉంటాయి. అయితే కొన్ని రోజులుగా..


బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇప్పటికి భారత్ లోనే ఆశ్రయం పొందుతున్నారు. తను శరణు కోరిన బ్రిటన్, మిగిలిన అరబ్, యూరప్ దేశాల నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాకపోవడంతో ఇంకా న్యూఢిల్లీలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు హసీనా అధికారికంగా భారత్ లోనే శరణార్థిగా ఉండాలని భావిస్తే ఇది దౌత్యపరమైన హట్ టాపిక్ గా మారే అవకాశం కనిపిస్తోంది.

దేశంలో విద్యార్థుల నేతృత్వంలోని ఉద్యమం హసీనా సర్కార్ ను షేక్ చేసింది. మరో వైపు దేశ ఆర్మీ కూడా కేవలం 15 నిమిషాల్లోనే రాజీనామా చేయాలని ఆదేశించింది. దీనితో ఆమె తప్పనిసరిగా దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. హసీనా మొదట ఈశాన్య భారత రాష్ట్రంలో కొంతకాలం ఆగిపోతారని మొదట్లో నివేదికలు వచ్చాయి.
రోజంతా బంగ్లా గగనతలం పై నిఘా వేసిన భారత వాయుసేనకు, ఓ హెలికాప్టర్ కనిపించగానే దానికి రాఫెల్ యుద్ధ విమానాల రక్షణ కల్పిస్తూ ఉత్తర ప్రదేశ్ లోని హిండన్ వైమానిక ఎయిర్ బేస్ వరకు తీసుకు వచ్చాయి. ఈ లోహ విహంగంలో ఉన్నది హసీనా అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
తరువాత యునైటెడ్ కింగ్ డమ్ కు శరణార్థిగా అప్లికేషన్ పెట్టుకున్నారు. అయితే స్టార్మర్ ప్రభుత్వం తమ దేశ వలస చట్టాలు అందుకు అంగీకరించవని సమాధానమిచ్చారు. మిగిలిన యూరప్ దేశాలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం కనిపిస్తోంది. ఇక బంగ్లా మాజీ అధినేత్రికి భారత్ తప్ప మరో అవకాశం కనిపించట్లేదు.
హసీనాకు భారత్‌తో సంబంధాలు
అయితే ఒక యూరోపియన్ దేశం మాత్రం హసీనాకు ఆశ్రయం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ అది కూడా ఇంకా ఊహాగానాల దశలోనే ఉంది. ఎందుకంటే హసీనా ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఆశ్రయం పొందుతోంది. పైగా శాంతియుత దేశం, అన్ని లెక్కల ప్రకారం బంగ్లా మాజీ అధినేత్రకు భద్రతకు హమీ ఇవ్వగలదు. కాబట్టి ఇలాంటి తరుణంలో ఈ యూరోపియన్ దేశం ఆమెను తీసుకోవడానికి తొందరపాటుతో వ్యవహరించాల్సిన అవసరం లేదు.
హసీనా, మన దేశంలో ఆశ్రయం పొందేందుకు అన్ని విధాల అర్హత ఉంది. న్యూ ఢిల్లీకి ఆమె పాలన ఎంత దగ్గరగా ఉందో చూస్తే, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమెను ఉండేందుకు అనుమతించడం కష్టతరమైన నిర్ణయం కాదు. 2009లో హసీనా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో భారత్‌కు కొన్ని అవకాశాలు కన్పించాయి.
దక్షిణాసియా పొరుగున ఉన్న ఇతర దేశాలన్నీ న్యూ ఢిల్లీ దగ్గర కిక్కురుమనకుండా ఉంటాయి. ఈ తరహా ఆధిపత్యంతోనే బంగ్లాకు మనదేశం అండగా నిలబడగలదు. నిజానికి భారత్ కంటే చైనాతో బంగ్లాకు ఎక్కువ వాణిజ్య బంధాలు ఉన్నాయి. అయినప్పటికీ రాజకీయ నాయకత్వం మాత్రం న్యూఢిల్లీతోనే ఎక్కువ సంబంధాలు నెలకొల్పుకున్నాయి.
తాజాగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తీస్తా నదీ పునరుద్దరణ ప్రాజెక్ట్ ప్రారంభించడానికి చైనా ప్రాథమిక సర్వేను పూర్తి చేసిన తర్వాత కూడా భారత్ కు ఈ ప్రాజెక్ట్ సంతకం చేస్తుందని ప్రకటించింది. బీజింగ్ ను కాదని మరీ ఈ ప్రాజెక్ట్ భారత్ చేపట్టడానికి హసీనా ఈ నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి, కొన్ని రోజుల క్రితం, హసీనా బీజింగ్ పర్యటనలో తన షెడ్యూల్ ను కుదించుకుంది. బీజింగ్ అగ్ర నాయకత్వం తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం, తమకు ఇస్తానని వాగ్దానం చేసిన $5 బిలియన్లకు బదులుగా కేవలం $100 మిలియన్లు మాత్రమే రుణం ఇవ్వడానికి చైనా అంగీకరించడం ఇది చైనాతో ఆమెకున్న సంబంధాలలో అన్నీ సరిగ్గా లేవని సూచిస్తున్నాయి.
మోదీ ప్రభుత్వానికి సవాల్
అయితే ఇప్పుడు అదంతా గతం. పరిస్థితి ఒక్కసారిగా 180 డిగ్రీలు మారిపోయింది. హసీనా అధికారంలో లేదు, ఆమె వ్యక్తిగత భద్రత ప్రశ్నార్థకమైంది. దౌత్యపరంగా, హసీనా భారతదేశంలో ఉండటం మోదీ పాలనకు సవాలుగా మారవచ్చు. ఆమె గత కొన్ని సంవత్సరాలుగా, యునైటెడ్ స్టేట్స్, ఇటీవల, చైనాకు కోపం తెప్పించగలిగింది. బంగ్లాదేశ్ లో చైనా ఆధిపత్యం కూడా యూఎస్ ఉలిక్కి పడేలా చేసింది. కొన్ని రోజులుగా ఆ దేశంలో మానవ హక్కులకు భంగం కలుగుతున్నాయని, పారదర్శకంగా ఎన్నికలు జరగట్లేదని ఆరోపణలు గుప్పించడం ప్రారంభించింది.
ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే హసీనా వీసాలను రద్దు చేయడం జో బైడెన్ ప్రభుత్వం చేసిన మొదటి పని. లండన్‌లోని UK ప్రభుత్వం హసీనాకు వసతి కల్పించలేకపోవడానికి కొన్ని విధానపరమైన, సాంకేతిక కారణాలతో ముందుకు తెచ్చింది. ఇది ఊహించినట్లుగా, బైడెన్ పరిపాలనతో కలిసి పనిచేసింది.
దౌత్యపరమైన ప్రతిష్టంభన
ఢాకాలో కొత్త మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమీప భవిష్యత్తులో దౌత్యపరమైన ప్రతిష్టంభన తలెత్తే అవకాశం ఉంది. నోబెల్ గ్రహీత, హసీనా ప్రత్యర్థి ముహమ్మద్ యూనస్ అధికార పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నందున, నిరసనకారులకు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి (BNP) అనుబంధంగా ఉండే సంస్థలు దేశంలో అవామీ లీగ్ ను టార్గెట్ చేస్తూ కేసుల పరంపర కొనసాగించవచ్చు.
హసీనాపై కొన్ని నేరారోపణలు సైతం వస్తాయి. ఆమె కచ్చితంగా బంగ్లాదేశ్ కి అప్పగించాలని భారత్ ను కోరవచ్చు. ఇప్పటికే 2013 నుంచి రెండు దేశాల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం అమలులో ఉంది. ఆమెను వెనక్కి పంపాలని భారత ప్రభుత్వంపై ఒత్తిడి వస్తుంది.
యునైటెడ్ స్టేట్స్ హసీనాతో శత్రుత్వం, యూనస్‌తో స్నేహపూర్వకంగా ఉండటంతో, అతని నేతృత్వంలోని ఢాకాలోని ప్రభుత్వం జోక్యం కోసం వాషింగ్టన్‌ను ఆశ్రయించవచ్చు. హసీనాను రక్షించడానికి మోదీ ప్రభుత్వం అమెరికాను విరోధించాల్సిన అవసరం ఉంది.
ఢాకాపై ఆగ్రహం వ్యక్తం చేయడం భారత్‌కు సాధ్యం కాదా?
ఆశ్రయం, భద్రత కోసం భారతదేశానికి వచ్చిన జాతీయ స్థాయి ఉన్న బహిష్కృత విదేశీ నాయకురాలు హసీనా రెండవది. (హసీనా 1975- 1981 మధ్య భారతదేశంలో నివసించారు, ఆమె తండ్రి, బంగ్లాదేశ్ ఐకాన్ అయిన షేక్ ముజిబుర్ రెహమాన్, ఆమె కుటుంబంలోని 18 మంది ఢాకాలో హత్యకు గురయ్యారు. ఆ సమయంలో హసీనా ఇంకా రాజకీయాల్లోకి రాలేదు)
అంతకుముందు, 1950లలో, అప్పటి జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం, మావో త్సే తుంగ్ చైనాతో సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ, టిబెటన్ నాయకుడు దలైలామా, అతని అనుచరులకు భారతదేశంలో ఆశ్రయం కల్పించింది. ప్రవాస టిబెటన్ ప్రభుత్వం ఇప్పుడు కూడా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల నుంచి పనిచేస్తోంది.
అయితే 1950ల నాటి పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. హసీనాను అప్పగించాలన్న ఢాకా అభ్యర్థనను భారత్ అంగీకరించకపోతే, అది ఇద్దరి మధ్య ఘర్షణను పెంచుతుంది. ఇది బంగ్లాదేశ్‌తో భారత వాణిజ్యంపై తక్షణ ప్రభావం చూపుతుంది. ఈశాన్య భారత రాష్ట్రాలలో రెండూ సుదీర్ఘమైన సరిహద్దును పంచుకున్నందున భద్రతపై ప్రభావం చూపుతుంది.
దీన్ని మరింత దిగజార్చడానికి, ఢాకాలోని ప్రభుత్వం భారతదేశాన్ని విడిచిపెట్టి, పెట్టుబడులు వాణిజ్యం కోసం చైనాను ఆశ్రయించవచ్చు. బంగ్లాదేశ్ లో ఇప్పటికి పాకిస్తాన్ కు భారీ నెట్ వర్క్, ఆధిపత్యం ఉందన్న సంగతి మనం మరువరాదు. ఇవన్నీ భారతదేశానికి రాజకీయ, భద్రతా తలనొప్పులకు దారితీస్తాయి.
భారత్ గందరగోళం
భారత ప్రభుత్వం తప్పనిసరిగా హసీనాకు అండగా నిలవాలి. అది ఒత్తిడికి గురైతే, అది నమ్మకమైన మిత్రదేశంగా భారత్ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాని స్థితిని పలుచన చేస్తుంది. వేడిని చల్లార్చడానికి మరొక దేశంతో ఆశ్రయం ఒప్పందానికి చర్చలు జరపమని మోదీ ప్రభుత్వం హసీనాపై నిశ్శబ్దంగా ఒత్తిడి చేయవచ్చు.
హసీనాకు ఆశ్రయం ఇవ్వడంలో దౌత్యపరమైన పతనం అనూహ్యమైనది. NATO తన 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాస్కో పర్యటన ద్వారా బైడెన్ పరిపాలనను భారత ప్రభుత్వం ఇప్పటికే చికాకు పెట్టినట్లు కనిపిస్తోంది.
భారతదేశానికి ప్రతికూలంగా, ప్రపంచ ప్రత్యర్థులైన US, చైనాలు బంగ్లాదేశ్‌లో తమ స్వంత ప్రయోజనాలను కలిగి ఉన్నాయి, అవి ఢిల్లీతో పరస్పర ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. US, మిత్రదేశంగా ఉన్నప్పటికీ, హసీనాకు శత్రుత్వం కలిగి ఉంది. BNPకి దగ్గరగా ఉంది యూఎస్.. అయితే ఇది భారతదేశానికి వ్యతిరేకం అనే రికార్డును కలిగి ఉంది. బంగ్లాదేశ్‌పై ఆధిపత్యం చెలాయించే లక్ష్యంతో చైనా భారత్‌తో పోటీకి దిగింది.
ఈ నేపథ్యంలో, హసీనా ఢిల్లీలో లేకపోయినా, బంగ్లాదేశ్‌లో కొత్త బిఎన్‌పి అనుకూల ప్రభుత్వం మోదీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌ తొలగించిన ప్రధాని భారత్‌లోనే కొనసాగితే, ఢాకాలో రాబోయే ప్రభుత్వం న్యూఢిల్లీకి వ్యతిరేకంగా తిరగడానికి బలమైన కారణం లభిస్తుంది. ఇదే సమయంలో ఢాకాలో ఏదైన తిరుగుబాటు జరిగితే కొత్త ఇబ్బందులకు తెరతీస్తుంది. దాని నుంచి తప్పించుకునే అవకాశం లేదు.
Read More
Next Story