
రష్యా నుంచి అమెరికా చమురు వైపు భారత్ మొగ్గుతుందా?
మెల్లగా పెరుగుతున్న వాషింగ్టన్ చమురు ఎగుమతులు, అదే మొత్తంలో తగ్గుతున్న రష్యా చమురు
ప్రసన్న మొహంతి
చమురు దిగుమతుల కోసం భారత్, అమెరికా వైపు మొగ్గుచూపుతుందా? రష్యాకు దూరంగా జరుగుతుందా? కొన్ని గణాంకాలు చూస్తే అలానే అనిపిస్తోంది. అంతర్జాతీయంగా ముడిచమురు దిగుమతులను స్వతంత్య్రంగా విశ్లేషించే కెప్లర్ ప్రకారం.. కొన్ని రోజులుగా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు క్రమంగా పెరుగుతోంది.
సెప్టెంబర్ లో యూఎస్ నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు 4.5 శాతంగా ఉండగా, అక్టోబర్ నాటికి ఇది 10. 7 శాతంగా పెరిగింది. ఇదే సమయంలో రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు 34.1 శాతం నుంచి 33.6 శాతానికి తగ్గింది.
ఈ ఏడాది మొత్తం డేటా తీసుకుంటే యూఎస్ నుంచి తీసుకునే ముడి చమురు 4.5 శాతం నుంచి 6.2 శాతానికి పెరిగింది. రష్యా నుంచి తీసుకునే ముడి చమురు 38.3 శాతం నుంచి 36. 1 శాతానికి తగ్గింది.
మార్పుకు కారణమేంటీ?
కెప్లర్ డేటా ప్రకారం.. అక్టోబర్ 2020 ( రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముందు) అక్టోబర్ 2025 వరకు రష్యా, అమెరికా నుంచి ముడి చమురు డేటా ఈ క్రింది విధంగా ఉంది.
కొన్ని అంతర్జాతీయ పరిణామాలు ఈ మార్పుకు కారణమయ్యాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ తనతో మాట్లాడారని, రష్యా నుంచి ముడి చమురు కొనబోమని హమీ ఇచ్చారని ట్రంప్ పలుమార్లు ప్రకటించారు. అయితే ఇది ఒక్కసారిగా జరగదు. కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వెళ్తారు.
అయితే అంతకుముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్టోబర్ 16 న చేసిన ప్రకటనను భారత ప్రభుత్వం తిరస్కరించింది. అలాగే జెలెన్స్ స్కీ తో జరిగిన సమావేశం కాలేదని పేర్కొంది.
అక్టోబర్ 28 న కేంద్ర పెట్రోలియం సహజవనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా తగినంత చమురు లభ్యత ఉందని, అయితే ఎక్కడైన సమస్య ఎదురైతే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నామని చెప్పారు.
ఆయన రష్యా లోని అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థలైన రాస్ నెఫ్ట్, లుక్ ఆయిల్ పై అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య కూటమి విధించిన ఆంక్షలను ప్రస్తావించలేదు. ఈ రెండు సంస్థలు రష్యా ముడి చమురులో 49.2 శాతం ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రస్తుతం భారత్ దాదాపుగా 40 దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది.
ఉక్రెయిన్ పై యుద్ధానికి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తూ స్పాన్సర్ చేస్తుందంటూ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరోపిస్తున్నారు. ఢిల్లీ వెంటనే మాస్కో నుంచి చమురు దిగుమతులు ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కారణంతోనే భారత్ పై 25 శాతం పెనాల్టీ టారిఫ్ విధించారు.
అయితే అమెరికా ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. భారత్ కంటే చైనా అధిక మొత్తంలో చమురు కొనుగోలు చేస్తుందని, అమెరికా కూడా యురేనియం వ్యాపారం పెద్ద మొత్తంలో చేస్తున్నట్లు గణాంకాలు బయట పెట్టింది.
సమాచార హక్కు చట్టం ద్వారా ‘ది ఫెడరల్’ సేకరించిన సమాచారం ప్రకారం.. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్పీసీఎల్) రష్యా నుంచి ముడి చమురుదిగుమతులను క్రమంగా తగ్గిస్తోంది. ఈ ఏడాది ఆగష్టు లో రష్యా నుంచి దిగుమతులు సున్నాకి చేరుకుంది. జూలైలో ఈ మొత్తం 2,02,000 మెట్రిక్ టన్నులుగా ఉంది.
ఆంక్షలకు సంబంధం లేదు..
ప్రస్తుతం రష్యా నుంచి దిగుమతులు తగ్గించడానికి, అమెరికా నుంచి పెరగడానికి ఆంక్షలు కారణం కాదు. ఈ విషాయాన్ని కెప్లర్ డేటా తెలియజేస్తోంది. ఎందుకుంటే షిప్పింగ్ సమయం అనేది 45 నుంచి 55 రోజుల సమయం పడుతుంది.
భారత్- యూఎస్ మధ్య 2030 నాటికి వాణిజ్యం 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని ఇరుదేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ‘‘మిషన్ 500’’ కింద తమ వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని ట్రంప్- మోదీ మధ్య జరిగిన సమావేశం తరువాత వైట్ హౌజ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఈ మిషన్ 500 లో కీలకమైన అంశం ఏంటంటే.. ‘‘ఇంధన వాణిజ్యాన్ని పెంచడం’’ అంటే ముడి చమురుతో పాటు సహజ వాయువు ఈథేన్, పెట్రో ఉత్పత్తులు, హైడ్రో కార్బన్ రంగంలో వాణిజ్యాన్ని పెంచుకోవాలని ఇరు దేశాలు అవగాహానకు వచ్చాయి. భారత్ వైవిధ్యీకరణ, ఇంధన భద్రతను కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇస్తోంది.
వ్యూహాత్మకం కాదు.. వాణిజ్యపరమైనది మాత్రమే..
కెప్లర్ పరిశోధకుడు, విశ్లేషకుడు సుమిత్ రిటోలియా ప్రకారం.. ఇది భారత రిఫైనర్ల వాణిజ్యపరమైన చర్య అని, వ్యూహాత్మకమైనది కాదని అన్నారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయని చెప్పారు. ఒకటి భారత్ కు అనుకూలమైన ధరల తగ్గదల, కాగా రెండో చైనా, అమెరికా నుంచి దిగుమతులు తగ్గించడమని అభిప్రాయపడ్డారు.
భారత్, అమెరికా నుంచి ముడి చమురు కొనుగోలు చేయకపోవడానికి ప్రధాన కారణం ధరతో పాటు రవాణా చేయడానికి అధిక ఖర్చు, సమయం పడుతుందని చెప్పారు.
అక్టోబర్ 29 నాటి ధరల ప్రకారం అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు బ్యారెల్ ధర 61.3 డాలర్లుగా ఉంది. ఇదే సమయంలో టెక్సాస్ లోని అమెరికా చమురు కేంద్రాలలో 64.6 డాలర్లుగా ఉంది. కానీ రష్యా దగ్గర మాత్రం 58.9 డాలర్లు మాత్రమే.
కానీ రిటోలియా, ఇతర ట్రెడ్ ఇన్ సైడర్ల సమాచారం ప్రకారం.. మార్కెట్ ధర అనేది ప్రధాన ఒప్పందాల చమురు ఒప్పందాలు జరిగే స్థాయి కాదు. ఇందులోని ఏదైన సమాచారం చాలా రహస్యంగా ఉంటుంది. కాబట్టి మార్కెట్ ధర అనేది ప్రామాణికం కాదు.
గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్(జీటీఆర్) వ్యవస్థాపకుడు, వాణిజ్య నిఫుణుడు అజయ్ శ్రీ వాస్తవ ప్రకారం.. యూఎస్ నుంచి భారత్ ముడి చమురు దిగుమతులు పెంచుకోవడం ఒక వ్యూహాత్మక చర్యగా అభివర్ణించారు.
రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు ఉందని, దీనిని పూడ్చుకోవడానికి సుంకాల ద్వారా వైట్ హౌజ్ ప్రయత్నిస్తోందని చెప్పారు. 2024 నాటి గణాంకాల ప్రకారం.. వస్తువుల వాణిజ్యంలో 45. 8 బిలియన్ డాలర్లు ఉండగా, వాణిజ్యంలో 45.7 బిలియన్లుగా ఉంది. అందుకే భారత్ లోకి తన వ్యవసాయ ఉత్పత్తులను పంపింగ్ చేయడానికి అమెరికా ప్రయత్నిస్తోంది.
అమెరికా చమురు దిగుమతులపై భారత్ లో ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. భారత్ తన చమురు అవసరాలలో 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయా మార్కెట్లకు ధరలకు అమెరికా నుంచి చమురు కొనుగోలు చేసుకోవడానికి ఎవరూ అభ్యంతరం చెప్పరని అన్నారు.
ఇంతకుముందు ఒకసారి భారత ప్రధాని ఓ సభలో మాట్లాడుతూ.. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ లోకి అనుమతి ఇవ్వదని చెప్పారు.
రష్యా నుంచి వైదొలగడానికి అమెరికా సాయం..
అక్టోబర్ ప్రారంభంలో రోస్ నెఫ్ట్, లుకోయిల్ పై ఆంక్షలు విధించడం ద్వారా భారత్, రష్యా నుంచి ముడి చమురు నుంచి వైదొలగడాన్ని అమెరికా సులభతరం చేసింది. రష్యాతో భారత్ దశాబ్ధాల అనుబంధం ద్వారా రాయితీతో ముడి చమురు కొనుగోలు చేయడానికి వీలు కల్పించింది.
రష్యా- ఉక్రెయిన్ యుద్దం ప్రారంభానికి ముందు భారత్ చాలా తక్కువ మొత్తంలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేది. అక్టోబర్ 2020 ఫిబ్రవరి 2022 మధ్య మొత్తం చమురు దిగుమతుల్లో సగటున 0.9 శాతం గా ఉంది. ఇదే సమయంలో ముడి చమురు దిగుమతి సగటున 9.4 శాతంగా ఉంది.
యుద్ధం తరువాత రష్యా నుంచి ముడి చమురును లభించిన గణనీయమైన తగ్గింపు ధరనే భారత్ తగ్గించుకుంది. ఆ సమయంలో ప్రపంచ ధరలు పెరుగుతున్నప్పుడూ స్థిరీకరించడానికి ఇది సహయపడిందని అమెరికా, యూరోపియన్ యూనియన్ అప్పట్లో వాదించాయి.
రష్యా నుంచి భారత్ చమురును దిగుమతి చేయడానికి అమెరికానే కారణమని భారత్ లో అమెరికా రాయబారీగా పనిచేసిన ఎరిక్ గార్సెట్టీ 2024 మే నెలలో వెల్లడించారు. భారత చమురు శుద్ది కర్మాగారాలలో ఈయూ ప్రధాన లబ్ధిదారుగా ఉంది.
2023 లో భారత్, ఈయూకు ప్రధానంగా అతిపెద్ద చమురు సరఫరాదారుడిగా మారింది. రష్యా మొత్తం ముడి చమురులో 49.2 శాతం రోస్ నెఫ్ట్, లూకోయిల్ ఉత్పత్తి చేస్తాయి. ఇప్పుడు వీటి నుంచి చమురును దిగుమతి చేసుకోవడానికి ఏ భారతీయ చమురు శుద్ది కర్మాగారం దిగుమతి చేసుకోలేదు.
మిగిలిన 50 శాతం రష్యన్ ముడి చమురు వాణిజ్యానికి సిద్దంగా ఉంది. తగ్గింపు ధరలను పరిగణలోకి తీసుకుంటే రష్యాతో వ్యాపారం చేయడాన్ని కొనసాగించవచ్చు.
Next Story

