
బ్రిటన్ లోకి చిన్న పడవల ద్వారా ప్రవేశిస్తున్న అక్రమ వలసదారులు
‘వన్ ఇన్.. వన్ అవుట్’’ ద్వారా అక్రమ వలసలు ఆగిపోతాయా?
బ్రిటన్- ఫ్రాన్స్ మధ్య కుదిరిన అక్రమ వలసల నిరోధక ఒప్పందం
సాజిదా మోమిన్
గత దశాబ్ధం నుంచి భారతీయులు పెద్ద సంఖ్యలో యూకేకి వలస వెళ్తున్నారు. ఈ వలసలు రెండు రకాలు ఒకటి చట్టబద్దమైనవి, రెండు అక్రమమైనవి. విద్యార్థి వీసాలు, పని కోసం అనుమతి తీసుకోవడం అవి గడువు ముగిసిన తరువాత కూడా అక్కడే ఉండటం వంటి చర్యలలో భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు.
ఈ సమస్యకు తోడు ఫ్రాన్స్ నుంచి నేరుగా ఇంగ్లీష్ ఛానల్ నుంచి చిన్న చిన్న పడవలను ఉపయోగించి కొందరు శరణార్థులు బ్రిటన్ లో అడుగుపెడుతున్నారు.
అక్రమ వలసదారులు ఉపయోగించే ప్రమాదకరమైన మార్గం..
పశ్చిమ దేశాలు ‘వన్ ఇన్, వన్ అవుట్’’ ఒప్పందం కింద తొలగించిన మొదటి వ్యక్తి భారతీయుడు. అయితే అధికారులు అతడి పేరును వెల్లడించలేదు. ఈ భారతీయ వ్యక్తి ఆగష్టులో ఇంగ్లీష్ ఛానల్ ను చిన్నపడవ సాయంతో దాటి ఫ్రాన్స్ నుంచి యూకేలో అడుగుపెట్టాడు.
ఈ పడవల్లో ఎక్కువ భాగం దిగే దక్షిణ తీరంలోని బోర్డర్ ఫోర్స్ అతడిని అదుపులోకి తీసుకుంది. తరువాత లండన్ లోని హీత్రో విమానాశ్రాయానికి సమీపంలోని ఇమ్మిగ్రేషన్ సెంటర్ కు తరలించారు. ఈ కేంద్రాలలో వందలమంది అక్రమ వలసదారులు నిర్భంధించబడ్డారు. వారిలో తిరిగి ఫ్రాన్స్ కు పంపడానికి అర్హత ఉన్నవారిని గుర్తించారు.
ఫ్రాన్స్ నుంచి ఇంగ్లీష్ ఛానల్ మీదుగా లండన్ లోకి ప్రవేశించడానికి వందల సంవత్సరాలుగా ఇదే మార్గం అందుబాటులో ఉంది. అయితే ఈ ప్రయాణంలో వేలాదిమంది మరణించారు.
బ్రిటన్ లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దాని ప్రధాన రాజకీయ చిక్కుముడి ఇదే. రెండోతరం భారతీయ వలసదారు అయిన రిషి సునక్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఐదు లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు. అందులో ఒకటి అక్రమ పడవలను ఆపడం.
మరో భారతీయ వలసదారుడి కుమార్తె ప్రీతీ పటేల్, హోంమంత్రిగా ఉన్న కాలంలో అక్రమ వలసదారులు ఏ దేశం నుంచి వచ్చిన వారైన సరే.. వారిని రువాండాకు పంపడానికి ప్రణాళిక రచించారు. తరువాత బాధ్యతలు స్వీకరించిన మరో భారతీయ వలసదారుడి కుమార్తె సుయెల్లా బ్రేవర్ మాన్ అయితే వలసదారుల విమానాలు రువాండకు బయలుదేరాలని కలలు కన్నారు.
అయితే ఈ ప్రణాళికలు కార్యరూపం దాల్చలేదు. దీనిఫలితంగా 2024 లో ఏకంగా 36 వేల మంది చిన్న పడవల్లో ఇంగ్లీష్ ఛానల్ ను దాటారు. ఫలితంగా కన్జర్వేటివ్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయింది. 14 సంవత్సరాల కన్జర్వేటివ్ పాలన తరువాత లేబర్ పార్టీకి విజయం దక్కింది. ఈ ప్రభుత్వానికి కూడా పడవలను ఆపే సమస్య వారసత్వంగా వచ్చింది.
అధికారంలోకి వచ్చిన మొదటి రోజే కొత్తగా ఎన్నికైనా ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్ రువాండ ప్రణాళికను అమానుషంగా పరిగణించి రద్దు చేశారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి మెరుగైన మార్గం ప్రజల అక్రమ రవాణా, చిన్న పడవల మార్గాన్ని ఉపయోగించే ముఠాలను అణిచివేయడమే అని ప్రకటించారు.
వన్ ఇన్, వన్ అవుట్ పథకం..
ఈ సంవత్సరం ఆగష్టు 6న ఫ్రాన్స్, యూకే ‘వన్ ఇన్.. వన్ అవుట్’ పథకంపై సంతకం చేశాయి. ఇది బ్రిటన్ ఆశ్రయం కోసం ఫ్రాన్స్ ద్వారా చిన్న పడవుల గుండా వచ్చే వారిని అడ్దుకుంటుంది.
ప్రతిగా ఫ్రాన్స్ ఆశ్రయం కోసం బలమైన వాదనతో అదే సంఖ్యలో వలసదారులను యూకేకి పంపుతుంది. కానీ ఇది చట్టపరంగా సురక్షితమైన, చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తుంది.
జూలై 2026 వరకూ కొనసాగే ఈ పథకంతో వలసదారులు ఈ ప్రమాదకరమైన ప్రయాణం చేయకుండా నిరోధించడానికి తీసుకొచ్చారు. ఈ ఒప్పందం ప్రకారం ఇంగ్లీష్ ఛానల్ దాటిన ఎవరినైనా యూకే వెంటనే అదుపులోకి తీసుకోవచ్చు. రెండు వారాల్లో ఆ వ్యక్తిని తిరిగి ఇవ్వడానికి ఫ్రెంచ్ అధికారులు అప్పగించవచ్చు.
భారతీయుల ఆశ్రయం పొందడానికి తక్కువ అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ పథకాన్ని పరీక్షించడానికి మొదటి వ్యక్తిగా ఒక భారతీయ వలసదారుడిని ఫ్రెంచ్ అధికారులు అభ్యర్థించారని తెలుస్తోంది. చిన్న పడవలపై ప్రయాణించే చాలామంది శరణార్ధులు ఎరిట్రియా, సూడాన్, సిరియా వంటి దేశాల గుండా వచ్చారు.
యుద్దం, కరువు, బానిసత్వం నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. బ్రిటిష్ కోర్టులు చట్టబద్దమైన శరణార్థులుగా పరిగణించి వారికి ఆశ్రయం మంజూరు చేస్తున్నాయి.
తనను అదుపులోకి తీసుకోవడంపై సదరు భారతీయుడు మండిపడి కోర్టులలో అప్పీల్ చేస్తానని బెదిరించాడు. కానీ అతడు భారత్ కు తిరిగి వెళ్తే అతడి ప్రాణాలకు ముప్పు లేకపోవడంతో అతడికి ఆశ్రయం ఇవ్వడానికి బ్రిటిష్ కోర్టులు అంగీకరించలేదు. దీనితో బ్రిటిష్ అధికారులు హీత్రో విమానాశ్రయం నుంచి ప్యారిస్ కు పంపారు.
ఆయన వచ్చిన తరువాత ఫ్రెంచ్ ప్రభుత్వం ఆయనకు భోజనం, వసతి కల్పించింది. తరువాత స్వచ్ఛందంగా భారత్ కు వెళ్లడానికి అవకాశం కల్పిస్తారు. అక్కడి ప్రభుత్వం విమానా చార్జీలు చెల్లించి, 2,500 యూరోలు( రూ. 2,58,731) ఆర్థిక సాయం అందిస్తుంది. దీనికి అంగీకరించకపోతే బలవంతంగా ఫ్రాన్స్ నుంచి బహిష్కరణకు గురవుతాడు.
మనదేశం నుంచి ఎలాంటి వలసలంటే..
మనదేశం నుంచి వలస వెళ్లే వారు మంచి జీవితం కోరుకునేవారు. అంత ఆర్థిక వలసదారులు మాత్రమే. ఏజెంట్లకు భారీ మొత్తంలో డబ్బు చెల్లించి, అప్పుల్లో కూరుకుపోయే బ్యాచ్. యూకేలో చేరి సంపాందించి, ఖర్చు చేసిన మొత్తాన్ని సంపాదించుకోవాలని ఆశిస్తారు. ఫ్రెంచ్ అధికారులు అందిస్తున్న రెండున్నర లక్షల రూపాయలు వీరికి చాలా తక్కువ.
అమెరికా అధ్యక్షుడు లండన్ లో పర్యటించిన రోజే భారతీయుడిని ఫ్రాన్స్ కు పంపారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో వలసలను ఎదుర్కోవడానికి స్టార్మర్ కు ఏ సలహ ఇస్తారని ట్రంప్ ను అడిగారు.
‘‘నేను దానిని ఆపివేస్తాను. మీరు సైన్యాన్ని పిలిచినా పర్వాలేదు. మీరు ఏం ఉపయోగిస్తున్నారనేదానికి పట్టింపు లేదు. ’’ అని ట్రంప్ బదులిచ్చారు. కానీ స్టార్మర్ ట్రంప్ సలహాను పట్టించుకోలేదు.
‘‘ఇది మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్న సమస్య. యూరప్ అంతటా సమస్యగా ఉన్నందున మేము ఇతర దేశాలతో అనేక సహకార ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాము’’ అని స్టార్మర్ సమాధానం ఇచ్చారు.
బలి పశువులు..
వలసదారుల ఆక్రమణలతో ఐరోపాలోని చాలా ప్రాంతాలలో రైట్ వింగ్ రాజకీయాలు ఊపందుకున్నాయి. వలసదారులు స్థానిక జనాభాను ఏకీకృతం చేసి ఎన్నికలో వారు గెలవడానికి బలి పశువుగా మారారు.
బ్రిటన్ లో వలసల వ్యతిరేకత, చట్టబద్దమైన లేదా చట్టవిరుద్దమైన ప్రధాన దృష్టిగా ఉన్న మితవాద సంస్కరణల పార్టీ ఆవిర్భవించింది. దీని నాయకుడు నిగెల్ ఫరాజ్. ప్రభుత్వ మొదటి కాలంలో ఆరు లక్షల మందిని బహిష్కరణ చేస్తానని హమీ ఇచ్చారు. దీని మేనేజర్ జేమ్స్ కాటన్ కోటిమందిని బలవంతంగా బహిష్కరించాలని సూచించారు.
‘‘వన్ ఇన్, వన్ అవుట్’’ పథకం కింద చిన్న పడవల క్రాసింగ్ ఆపగలిగితే, యూకే లోకి అక్రమంగా వలస వచ్చే వలసదారుల సంఖ్యను తగ్గించగలిగితే అది కచ్చితంగా రిఫార్మ్ కావాలనే రైట్ విగ్ పార్టీల ఉధృతిని తగ్గిస్తుంది. దానికి వచ్చే ఏడాది చాలా కీలకం.
Next Story