‘‘ఈసారి కోల్ కత మీద దాడి చేస్తారంటా’’
x

‘‘ఈసారి కోల్ కత మీద దాడి చేస్తారంటా’’

మరోసారి నోటి దూల చూపించిన పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్


Click the Play button to hear this message in audio format

భారత్ చేతిలో ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్న పాకిస్తాన్ కు బుద్ది రావట్లేదు. తాజాగా మరోసారి కుక్క తోక లాంటి తన బుద్ధిని బయటపెట్టుకుంది. భవిష్యత్ లో భారత్ కనుక పాకిస్తాన్ పై దాడి చేస్తే దాని ప్రతిగా తాము 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కోల్ కతపై దాడి చేస్తామని పాకిస్తాన్ రక్షణ మంత్రి తాటాకు చప్పుల్లు చేశారు.

సియాల్‌కోట్‌లో శనివారం (ఏప్రిల్ 4) ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈసారి భారత్ ఏదైనా "ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్" చేయడానికి ప్రయత్నిస్తే, పాకిస్తాన్ "దాన్ని కోల్‌కతా వరకు తీసుకెళ్తుంది" అని ఖవాజా ఆసిఫ్ అన్నారు. ఆయన తాజా హెచ్చరికపై భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గత మే నెలలో ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్, పాకిస్తాన్‌ల మధ్య నాలుగు రోజులు సైనిక ఘర్షణలు జరిగాయి. ఆ సందర్భంగా మాత్రమే ఆసిఫ్ మాట్లాడారు.
పహల్గామ్ ఘటనను భారతే ప్లాన్ చేసిందని, ఇందుకోసం తన సొంత మనుషులు లేదా నిర్భంధంలో ఉన్న పాక్ జాతీయులను ఉపయోగించిందని ఎప్పటిలాగే వితండ వాదనలు చేశారు. "వారు ఉగ్రవాదులు, ఫలానా పనులు చేశారు" అని చెప్పి ఒక ఫాల్స్-ఫ్లాగ్ ఆపరేషన్‌ను రూపొందించినట్లు నివేదికలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, తన వాదనకు మద్దతుగా ఆయన ఎలాంటి ఆధారాలు అందించలేదు.

మూడు రోజుల్లో రెండో హెచ్చరిక..

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్ నాథ్ సింగ్.. పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా అపూర్వ చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ ప్రకటన వచ్చిన మూడు రోజుల తరువాత ఖాజా ఆసిఫ్ మాట్లాడారు. ఆసిఫ్ ఇలాంటి ప్రకటనలు చేయడం ఇది రెండోసారి.
గురువారం (ఏప్రిల్ 2) నాడు, ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ నుండి ఎలాంటి "దుస్సాహసానికైనా" భారత పక్షం నుంచి "అపూర్వమైన మరియు నిర్ణయాత్మక" ప్రతిచర్య ఉంటుందని ఆయన చెప్పిన తర్వాత, ఆసిఫ్ ప్రతిస్పందిస్తూ, ఎలాంటి దాడికైనా పాకిస్తాన్ ప్రతిస్పందన "వేగంగా, ప్రణాళికాబద్ధంగా నిర్ణయాత్మకంగా" ఉంటుందని అన్నారు.
"ఎలాంటి సందేహానికి తావులేదు. పాకిస్తాన్ శాంతికి, ప్రాంతీయ స్థిరత్వానికి కట్టుబడి ఉంది, కానీ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలనే దాని సంకల్పం సంపూర్ణమైనది. దాని సంసిద్ధత పూర్తిస్థాయిలో ఉంది. దాని ప్రతిస్పందన వేగవంతంగా, ప్రణాళికాబద్ధంగా నిర్ణయాత్మకంగా ఉంటుంది" అని ఆయన అన్నారు.

పహల్గామ్ కు ఏడాది..

పహల్గామ్ లో పర్యటిస్తున్న టూరిస్టులలో హిందువులను మాత్రమే గుర్తించి, భార్యల ముందు భర్తలను పాకిస్తాన్ కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన ఏప్రిల్ 22న తేదీన చోటు చేసుకుంది. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాక్ లోని 11 ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది.
తరువాత భారత్ పైకి పాకిస్తాన్ దాడులకు ప్రయత్నించి విఫలమైంది. చివరి రోజు భారత్ ఏకంగా పాక్ లోని అన్ని వైమానిక స్థావరాలను నేలమట్టం చేయడంతో అది కాళ్లబేరానికి వచ్చింది. మరో వైపు ట్రంప్ కూడా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు తాను మధ్యవర్తిత్వం చేసినట్లు ప్రకటించాడు.
ఈ ఘటన తరువాత పాకిస్తాన్- అమెరికా చాలా దగ్గరయ్యాయి. ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ రెండుసార్లు ట్రంప్ తో భేటీ అయ్యారు. అలాగే అమెరికా నుంచి భారత్ కు అణు బెదిరింపులు చేశారు. గత నెలలో, భారతదేశంలో పాకిస్తాన్ మాజీ రాయబారి అయిన అబ్దుల్ బాసిత్, ఒకవేళ అమెరికా, పాకిస్తాన్‌పై దాడి జరిగితే, ఇస్లామాబాద్, ఢిల్లీ, ముంబై వంటి నగరాలను లక్ష్యంగా చేసుకోవచ్చని హెచ్చరించారు.
Read More
Next Story