
సియాల్ కోట్, లాహోర్ లపై ప్రతిదాడికి దిగిన భారత్
త్రివిధ దళాధిపతులో భేటీ అయిన రాజ్ నాథ్, ప్రధానితో భేటి అయిన ధోవల్
ఆపరేషన్ సింధూర్ తరువాత ఉక్రోశంలో పాకిస్తాన్ దుస్సాహానికి దిగింది. ఈ రోజు పొద్దున్న15 నగరాలపై దాడులకు పాల్పడి చేతులు కాల్చుకున్న పాక్, రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో డ్రోన్లు, క్షిపణులతో భారత్ పైకి దాడికి దిగింది. ముఖ్యంగా జమ్మూలోని ఏడు ప్రాంతాలపై క్షిపణులు ప్రయోగించింది. ఆత్మాహుతి డ్రోన్లను పంపగా వాటిని సైన్యం న్యూట్రల్ చేసింది.
పాక్ చేస్తున్న ఈ ప్రతిదాడులతో భారత్ కూడా ఎదురుదాడికి దిగింది. పాకిస్తాన్ పంజాబ్ రాజధాని లాహోర్ సహ, సియాల్ కోట్ లపై క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో ప్రతిదాడులకు దిగింది.
మోగిన సైరన్లు..
పాకిస్తాన్ క్షిపణులు ప్రయోగించగానే జమ్మూ నగరం మొత్త సైరన్ల మోత మోగింది. ఈ ప్రాంతం మొత్తం పెద్ద పెద్ద శబ్ధాలు వినిపించాయి. దీనితో ప్రభుత్వం వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. జమ్మూకాశ్మీర్ అంతటా ఇంటర్ నెట్ ను నిలిపివేశారు. అలాగే ఫోన్ కాల్స్ కూడా వెళ్లడం లేదని తెలిసింది.
స్థానికులు తీసిన వీడియోల ప్రకారం.. రాత్రి ఆకాశంలో స్పష్టంగా లైట్లు కనిపిస్తున్నాయి. ఇవి భారత సాయుధ దళాల వైమానిక రక్షణ వ్యవస్థ ద్వారా క్షిపణులు, డ్రోన్లు అడ్డగిస్తున్నట్లు కనిపిస్తోంది.
భారత దళాలు కనీసం నాలుగు క్షిపణులు కూల్చివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఉద్రిక్తత పరిస్థితులపై త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ అయ్యారు. తరువాత భారత ప్రధాని మోదీతో అజిత్ ధోవల్ భేటీ అయ్యారు.
ఐపీఎల్ మ్యాచ్ నిలిపివేత
భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ ను నిలిపివేశారు. జమ్మూ ఎయిర్ పోర్ట్ పై పాకిస్తాన్ క్షిపణుల, డ్రోన్లతో దాడులు చేస్తున్న నేపథ్యంలో ఉత్తర భారతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
ధర్మశాల వేదికగా జరుగుతున్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేశారు. ప్రస్తుతం మంచునగరంలో అంధకారం అలుముకుంది.
పంజాబ్ జట్టు పది ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 122 పరుగులు చేసిన సమయంలో లైట్లు నిలిపివేశారు. మొదట ప్లడ్ లైట్లలో లోపం కారణంగా మ్యాచ్ ఆగిపోయిందని అనుకున్నారు. కానీ తరువాత స్టేడియంలోకి వచ్చిన భద్రతా సిబ్బంది ప్రేక్షకులను ఖాళీ చేయించారు.
ప్రభ్ సిమ్రాన్ సింగ్, 28 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. మరో ఒపెనర్ ప్రియాంశ్ ఆర్య 34 బంతుల్లో 70 పరుగులు చేసి టీ నటరాజన్ చేతికి చిక్కాడు. కాసేపటికే మ్యాచ్ నిలిచిపోయింది.
భారత్ పై దాడి
పాకిస్తాన్ దుస్సాహానికి దిగింది. భారత్ లోని పఠాన్ కోట్, జైసల్మేర్ లోని వాయుసేన స్థావరాలే లక్ష్యంగా దాడికి దిగింది. అయితే వీటిని ఎస్- 400 రక్షణ వ్యవస్థ దిగ్విజయం అడ్డుకుని కూల్చివేసింది. అలాగే జమ్మూలోని తొమ్మిది ప్రాంతాలపై ఆత్మాహుతి డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు దిగింది.
Live Updates
- 9 May 2025 11:37 AM IST
యుద్దం సమయంలో ఇంధన కొనుగోళ్ల విషయంలో భయాందోళనలు వద్దంటూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. తమ అన్ని ఔట్‌లెట్స్‌లో ఎల్‌పీజీ, ఫ్యూయల్ అందుబాటులో ఉందని చెప్పింది. ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండటం మంచిదని సూచించింది.
#IndianOil has ample fuel stocks across the country and our supply lines are operating smoothly.
— Indian Oil Corp Ltd (@IndianOilcl) May 9, 2025
There is no need for panic buying—fuel and LPG is readily available at all our outlets.
Help us serve you better by staying calm and avoiding unnecessary rush. This will keep our… - 9 May 2025 11:28 AM IST
పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లిస్తుంది: జమ్మూకశ్మీర్ కాంగ్రెస్
భారత్‌పై పాకిస్థాన్ చేసిన దాడులను జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. జమ్మూకశ్మీర్‌ను టార్గెట్‌గా చేసిన దాడులకు పాకిస్థాన్ తగిన మూల్యం చేల్లిస్తుందని వ్యాఖ్యానించింది. ‘పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలను జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది’’ అని తెలిపింది.
- 9 May 2025 11:24 AM IST
భారత సైన్యానికి మద్దతుగా తమిళనాడు ర్యాలీ
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థుతులు నెలకొన్న క్రమంలో ఇండియా సైన్యానికి మద్దతుగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. "భారత సైన్యానికి మద్దతుగా రేపు చెన్నైలో ముఖ్యమంత్రి నాయకత్వంలో ర్యాలీ జరుగుతుంది. పాకిస్తాన్ దురాక్రమణ మరియు ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి ఐక్యత మరియు మద్దతును వ్యక్తపరచడానికి ఇది ఒక క్షణం. సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ ర్యాలీ, భారత సైన్యం యొక్క శౌర్యం మరియు త్యాగాలను గౌరవించడం మరియు జాతీయ ఐక్యతను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ర్యాలీలో పాల్గొనాలని ముఖ్యమంత్రి తమిళనాడు ప్రజలకు పిలుపునిచ్చారు" అని ఎంకే స్టాలిన్ వెల్లడించారు.
- 9 May 2025 11:19 AM IST
పాకిస్థాన్‌తో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాల్లో ఉన్న కేరళ ప్రజల కోసం ఆ రాష్ట్రం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా అక్కడ ఉన్నవారి యోగక్షేమాలను తెలుసుకోనుంది. వారిని వీలైనంత త్వరగా సొంత రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
- 9 May 2025 11:17 AM IST
జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.. ఉరిని సందర్శిస్తున్నారు. అక్కడి సైనికులను కలిసి వారి పరిస్థితులను, స్థానిక వాతావరణాన్ని సమీక్షించనున్నారు.
- 9 May 2025 6:38 AM IST
యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఏమన్నారంటే..
భారత్ - పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను అగ్రరాజ్యం గమనిస్తోంది. అయితే ఆ వివాదంలో అమెరికా జోక్యం చేసుకోదని, అది అమెరికాకు సంబంధించినది కాదు అన్నారు అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్. దౌత్యం ద్వారా ఉద్రిక్తతను తగ్గించుకోవాలన్నారు. ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్ మాట్లాడారు. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను ఏదైనా సాయం చేయగలిగితే చేస్తానని చెప్పారు.
'యుద్ధం'పై అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. "వారు చాలా కాలంగా పోరాడుతున్నారు. దశాబ్దాలుగా. ఇద్దరితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. యుద్ధం ఆగిపోవాలని నేను కోరుకుంటున్నాను. అని పేర్కొన్నారు.
- 9 May 2025 12:48 AM IST
పశ్చిమ సరిహద్దు వెంబడి ఉన్న ప్రదేశాలపై దాడి చేయడానికి పాకిస్తాన్ చేసిన విఫల ప్రయత్నాల దృష్ట్యా ఇండియా గేట్ చుట్టూ భద్రతను పెంచారు.
- 9 May 2025 12:46 AM IST
భారత్‌పై దాడి చేసే దమ్ము పాక్‌కు లేదు: షిండే
ఆపరేషన్ సింధూర్‌పై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "పాకిస్తాన్‌కు భారతదేశంపై దాడి చేసే ధైర్యం లేదు. భారతదేశం మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దానికి గుణపాఠం నేర్పించారు. ఈ సమయంలో అది భారతదేశానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే, మన సాయుధ దళాలు పాకిస్తాన్‌ను తుడిచిపెడతాయి మరియు పాకిస్తాన్ మ్యాప్‌లో కనిపించదు... ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. పాకిస్తాన్ చాలా తెలివిగా ఉండటానికి ప్రయత్నిస్తే, దానికి తగిన సమాధానం వస్తుంది. మన సాయుధ సైనికులు ఏ పౌరులపైనా దాడి చేయలేదు. వారు ఈ ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే నాశనం చేశారు మరియు వారికి గుణపాఠం నేర్పించారు" అని అన్నారు.
- 9 May 2025 12:33 AM IST
భారత్‌పై దాడి చేసే దమ్ము పాక్‌కు లేదు: షిండే
ఆపరేషన్ సింధూర్‌పై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "పాకిస్తాన్‌కు భారతదేశంపై దాడి చేసే ధైర్యం లేదు. భారతదేశం మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దానికి గుణపాఠం నేర్పించారు. ఈ సమయంలో అది భారతదేశానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే, మన సాయుధ దళాలు పాకిస్తాన్‌ను తుడిచిపెడతాయి మరియు పాకిస్తాన్ మ్యాప్‌లో కనిపించదు... ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. పాకిస్తాన్ చాలా తెలివిగా ఉండటానికి ప్రయత్నిస్తే, దానికి తగిన సమాధానం వస్తుంది. మన సాయుధ సైనికులు ఏ పౌరులపైనా దాడి చేయలేదు. వారు ఈ ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే నాశనం చేశారు మరియు వారికి గుణపాఠం నేర్పించారు" అని అన్నారు.