
సియాల్ కోట్, లాహోర్ లపై ప్రతిదాడికి దిగిన భారత్
త్రివిధ దళాధిపతులో భేటీ అయిన రాజ్ నాథ్, ప్రధానితో భేటి అయిన ధోవల్
ఆపరేషన్ సింధూర్ తరువాత ఉక్రోశంలో పాకిస్తాన్ దుస్సాహానికి దిగింది. ఈ రోజు పొద్దున్న15 నగరాలపై దాడులకు పాల్పడి చేతులు కాల్చుకున్న పాక్, రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో డ్రోన్లు, క్షిపణులతో భారత్ పైకి దాడికి దిగింది. ముఖ్యంగా జమ్మూలోని ఏడు ప్రాంతాలపై క్షిపణులు ప్రయోగించింది. ఆత్మాహుతి డ్రోన్లను పంపగా వాటిని సైన్యం న్యూట్రల్ చేసింది.
పాక్ చేస్తున్న ఈ ప్రతిదాడులతో భారత్ కూడా ఎదురుదాడికి దిగింది. పాకిస్తాన్ పంజాబ్ రాజధాని లాహోర్ సహ, సియాల్ కోట్ లపై క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో ప్రతిదాడులకు దిగింది.
మోగిన సైరన్లు..
పాకిస్తాన్ క్షిపణులు ప్రయోగించగానే జమ్మూ నగరం మొత్త సైరన్ల మోత మోగింది. ఈ ప్రాంతం మొత్తం పెద్ద పెద్ద శబ్ధాలు వినిపించాయి. దీనితో ప్రభుత్వం వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. జమ్మూకాశ్మీర్ అంతటా ఇంటర్ నెట్ ను నిలిపివేశారు. అలాగే ఫోన్ కాల్స్ కూడా వెళ్లడం లేదని తెలిసింది.
స్థానికులు తీసిన వీడియోల ప్రకారం.. రాత్రి ఆకాశంలో స్పష్టంగా లైట్లు కనిపిస్తున్నాయి. ఇవి భారత సాయుధ దళాల వైమానిక రక్షణ వ్యవస్థ ద్వారా క్షిపణులు, డ్రోన్లు అడ్డగిస్తున్నట్లు కనిపిస్తోంది.
భారత దళాలు కనీసం నాలుగు క్షిపణులు కూల్చివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఉద్రిక్తత పరిస్థితులపై త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ అయ్యారు. తరువాత భారత ప్రధాని మోదీతో అజిత్ ధోవల్ భేటీ అయ్యారు.
ఐపీఎల్ మ్యాచ్ నిలిపివేత
భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ ను నిలిపివేశారు. జమ్మూ ఎయిర్ పోర్ట్ పై పాకిస్తాన్ క్షిపణుల, డ్రోన్లతో దాడులు చేస్తున్న నేపథ్యంలో ఉత్తర భారతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
ధర్మశాల వేదికగా జరుగుతున్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేశారు. ప్రస్తుతం మంచునగరంలో అంధకారం అలుముకుంది.
పంజాబ్ జట్టు పది ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 122 పరుగులు చేసిన సమయంలో లైట్లు నిలిపివేశారు. మొదట ప్లడ్ లైట్లలో లోపం కారణంగా మ్యాచ్ ఆగిపోయిందని అనుకున్నారు. కానీ తరువాత స్టేడియంలోకి వచ్చిన భద్రతా సిబ్బంది ప్రేక్షకులను ఖాళీ చేయించారు.
ప్రభ్ సిమ్రాన్ సింగ్, 28 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. మరో ఒపెనర్ ప్రియాంశ్ ఆర్య 34 బంతుల్లో 70 పరుగులు చేసి టీ నటరాజన్ చేతికి చిక్కాడు. కాసేపటికే మ్యాచ్ నిలిచిపోయింది.
భారత్ పై దాడి
పాకిస్తాన్ దుస్సాహానికి దిగింది. భారత్ లోని పఠాన్ కోట్, జైసల్మేర్ లోని వాయుసేన స్థావరాలే లక్ష్యంగా దాడికి దిగింది. అయితే వీటిని ఎస్- 400 రక్షణ వ్యవస్థ దిగ్విజయం అడ్డుకుని కూల్చివేసింది. అలాగే జమ్మూలోని తొమ్మిది ప్రాంతాలపై ఆత్మాహుతి డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు దిగింది.
Live Updates
- 8 May 2025 11:39 PM IST
కరాచీ లక్ష్యంగా భారత్ దాడులు..
కరాచీ పోర్టుపై కొనసాగుతున్న భారత్ ప్రతీకార దాడి.. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి మిస్సైల్స్ డ్రోన్లను ప్రయోగించింది భారత ఆర్మీ. జమ్ములో పాకిస్తాన్ డ్రోన్ దాడులకు ధీటుగా సమాధానం ఇస్తున్న భారత సైన్యం..
- 8 May 2025 11:37 PM IST
ఇండియా, పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో పెరిగిన సైబర్ సెక్యూరిటీ ప్రమాదం. కీలక సూచనలు చేస్తున్న అధికారులు. ఎటువంటి వీడియో, మెసేజ్ లింక్‌లను ఓపెన్ చేయొద్దంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.
- 8 May 2025 11:33 PM IST
యుద్ధం పాక్ ఎంపికే: సెహ్వాగ్
భారత్, పాకిస్థాన్ మధ్య మొదలైన యుద్ధంపై భారత క్రికెటర్ సెహ్వాగ్ స్పందించారు. ‘‘యుద్ధాన్ని పాకిస్థానే ఎంపిక చేసుకుందన్నారు. సైలెంట్‌గా ఉండే అవకాశం ఉన్నా పాకిస్థాన్ హింసను ఎంచుకుంది. ఉగ్రవాదులను కాపాడుకోవడం కోసం పాకిస్థాన్.. పరిస్థితులను ఉద్రిక్తం చేసుకుంది. భారత బలగాలు సరైన తీరులో బదులిస్తాయి. భారత్ ఇచ్చే బదులును పాకిస్థాన్ ఎప్పటికీ మర్చిపోలేదు’’ అని సెహ్వాగ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
War has been chosen by Pakistan when they had an opportunity to keep quiet.
— Virrender Sehwag (@virendersehwag) May 8, 2025
They have escalated to save it’s terrorist assets, speaks so much about them.
Our forces will reply in the most appropriate manner, a manner Pakistan will never forget. - 8 May 2025 11:31 PM IST
భారతదేశంలోని పలు నగరాలను లక్ష్యం చేసుకొని.. పాకిస్తాన్ చేస్తున్న అన్ని మిస్సైల్స్ ను విజయవంతంగా కూల్చేస్తున్న ఇండియన్ ఆర్మీ..
- 8 May 2025 11:23 PM IST
భారత్‌లో పలు విమానాశ్రయాలను మూసివేత
భారత్ - పాక్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో పలు విమానాశ్రయాలను మూసివేశారు. మూసివేసిన ఎయిర్‌పోర్టులివే.. 1. శ్రీనగర్ 2. జమ్మూ 3. లేహ్ 4. చండీగఢ్ 5. అమృత్‌సర్ 6. లూధియానా 7. పాటియాలా 8. బథిండా 9. హల్వారా 10. పఠాన్కోట్ 11.
భుంటర్ 12. శిమ్లా 13. గగ్గల్ 14. ధర్మశాల 15. కిషన్‌గఢ్ 16. జైసల్మేర్ 17. జోధ్‌పూర్ 18. బికానీర్ 19. ముండ్రా 20. జామ్‌నగర్ 21. రాజ్‌కోట్ 22. పోర్‌బందర్ 23. కండ్లా 24. కేశోడ్ 25. భుజ్ 26. గ్వాలియర్ 27. హిందన్. ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
- 8 May 2025 11:22 PM IST
మే 9, 10 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లోని అన్ని కళాశాలలు, యూనిర్శిటీలను క్లోజ్ చేసి ఉంచుతున్నట్లు ప్రకటించిన అధికారులు.
- 8 May 2025 11:21 PM IST
రంగంలోకి దిగిన ఐఎన్ఎస్ విక్రాంత్.. కరాచీ పోర్ట్ ధ్వంసం.. సార్గోధా, ఫైసలాబాద్‌లలో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను బాంబులతో పేల్చిన ఇండియన్ ఆర్మీ..
- 8 May 2025 11:15 PM IST
పాక్ జెట్ ఫ్లైట్ కూల్చివేత..
కొద్దిసేపటి క్రితం పాక్ జేఎఫ్ -17 ను కూల్చివేసిన భారత ఆర్మీ - జై సల్మేర్‌లో పాక్ పైలట్ అదుపులోకి తీసుకున్న సైనిక బలగాలు..