
బీహార్‌లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలో (నవంబర్ 6, 11 తేదీల్లో) పోలింగ్ - రెండు దశల్లో నమోదయిన పోలింగ్ శాతం 67.13.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు మొదలైంది. బీహార్ నుంచి వచ్చిన ముందస్తు నివేదికల ప్రకారం .. NDA ఆధిక్యంలో ఉంది. కానీ ప్రతిపక్ష కూటమి కూడా వేగంగా ఆధిక్యంలోకి దూసుకుపోతోంది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తం 243 స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరిగింది. ఓటింగ్ శాతం 67.13గా రికార్డుయ్యింది.
Live Updates
- 14 Nov 2025 10:26 AM IST
ECI ట్రెండ్స్ ప్రకారం..పోలింగ్ సరళిని చూస్తే.. JD(U) అతిపెద్ద సింగిల్ పార్టీగా అవతరించింది. ఇప్పటి దాకా లీడ్‌లో ఉన్న పార్టీల వివరాలు పరిశీలిస్తే..
BJP: 50
JD(U): 58
LJP (RV); 15
HAM-ఎస్: 4
RJD: 30
Congress: 10
CPI-ML: 2
AIMIM : 1
VIP: 1
CPM: 1
- 14 Nov 2025 10:19 AM IST
మోకామాలో అనంత్ సింగ్ (JD-U) ఇప్పటికీ ఆధిక్యంలో ఉండగా.. BJP మంగళ్ పాండే (BJP) సివాన్‌లో వెనుకబడి పోయారు. బీహార్ మంత్రి, బీజేపీ నాయకుడు నితిన్ నబిన్ 1/31 రౌండ్ ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నారు. అయితే ఆ పార్టీకి చెందిన రేణు దేవి మొదటి రౌండ్ తర్వాత బెట్టియాలో ముందంజలో ఉన్నారు.
- 14 Nov 2025 10:09 AM IST
బీహార్ లో ని 243 సీట్ లలో 160 సీట్ ల లోలో బీజేపీ ఆధిక్యం లో వుంది. మహుయా నుండి తేజ్ ప్రతాప్ యాదవ్ వెనుకంజ లో వున్నారు. ఆర్జేడీ తేజస్వి యాదవ్ రాగోపూర్ నుండి ఆధిక్యం లో వున్నారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి లఖిసరాయ్ నుండి ఆధిక్యం లో వున్నారు. బీజేపీ కి సామ్రాట్ చౌధరి చెందిన తారపూర్ నుండి ఆధిక్యం లో వున్నారు. బిజెపి కి సంబందించిన మైథిలి ఠాకూర్ అలీనగర్ నుండి ఆధిక్యం లో వున్నారు.
- 14 Nov 2025 9:57 AM IST
బీహార్ లో మ్యాజిక్ సంఖ్య దాటిన ఎన్డీఏ 122 నియోజక వర్గాల లో ఆధిక్యం లో వుంది. కాంగ్రెస్ కేవలం 20 స్థానాలలో మాత్రమే ఆధిక్యం లో వుంది. 80 స్థానాలలో ఆధిక్యంలో వుంది. ఒక స్థానం లో జన్ సూరాజ్ పార్టీ ముందు వరసలో వుంది. బిజెపి కి సంబందించిన మైథిలి ఠాకూర్ అలీనగర్ నుండి ఆధిక్యం లో వున్నారు. మహుయా నుండి తేజ్ ప్రతాప్ యాదవ్ ఆధిక్యం లో వున్నారు.
- 14 Nov 2025 9:47 AM IST
తారాపూర్‌లో సామ్రాట్ చౌదరీలేడ్స్, అలీనగర్‌లో మైథిలి ఠాకూర్ ఆధిక్యంలో ఉన్నారు. ఇమామ్‌గంజ్‌లో హిందుస్తాన్ అవామ్ మోర్చా నాయకురాలు దీపా కుమారి ప్రారంభం నుంచి ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. రఘోపూర్‌లో తేజస్వి కూడా లీడ్‌లో కొనసాగుతున్నారు. ECI ప్రకారం.. బీహార్‌లో 28 స్థానాల్లో NDA ఆధిక్యంలో ఉంది. మహాఘటబంధన్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
- 14 Nov 2025 9:33 AM IST
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదటి 30 నిమిషాల తర్వాత మోకామాలో అనంత్ సింగ్ (JD(U) ఆధిక్యంలో ఉన్నారు. మహువాలో తేజ్ ప్రతాప్ (RJD) వెనుకబడ్డారు. ఇక రాఘోపూర్‌లో తేజశ్వి (RJD) ఆధిక్యంలో ఉన్నారు.
- 14 Nov 2025 9:09 AM IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి రౌండ్ కౌంటింగ్ లో బీజేపీ ఆధిక్యం లో వుంది. కౌంటింగ్ 10 రౌండ్ లలో జరుగుతుంది. 243 అసెంబ్లీ నియోజక వర్గాలు వున్న బీహార్ లో 179 నియోజక వర్గాల లో పోస్టల్ బ్యాలట్ ప్రాధమిక కౌంటింగ్ లో ఎన్డీఏ 117 సీట్ లలో ఆధిక్యం లో వుంది. మహాగట్‌బంధన్ 60 సీట్ లలో ఆధిక్యం లో వుంది. జన్ సూరాజ్ పార్టీ 2 సీట్ ల లో ఆధిక్యం లో వుంది. బీహార్ కౌంటింగ్ 10 రౌండ్ లలో జరగుతుంది. ముఖ్యమైన అభ్యర్థులలో రాఘవపూర్ నుండి తేజస్వి ఆధిక్యం లో వున్నారు. బిజెపి కి సంబందించిన మైథిలి ఠాకూర్ అలీనగర్ నుండి ఆధిక్యం లో వున్నారు. మహుయా నుండి తేజ్ ప్రతాప్ యాదవ్ ఆధిక్యం లో వున్నారు. జేడీయు కు చెందిన అనంత్ సింగ్ మోకామ్ నుండి ఆధిక్యం లో వున్నారు. సివాన్ నుండి బీజేపీ కి చెందిన మంగల్ పాండే ఆధిక్యం లో వున్నారు.

