ఛాంపియన్ ట్రోఫీ-2025 ఫైనల్స్
x

ఛాంపియన్ ట్రోఫీ-2025 ఫైనల్స్

ఛాంపియన్ ట్రోఫీ-2025 సిరీస్ అంతా కూడా బ్రెత్ టేకింగ్‌గా సాగింది. భారీభారీ స్కోర్లు, వాటిని ఛేదించడానికి ప్రత్యర్థి జట్లు పర్వఫుల్ పర్ఫార్మెన్స్‌తో సిరీస్ అంతూ ఇంట్రస్టింగ్‌గా సాగింది.


ఛాంపియన్ ట్రోఫీ-2025 సిరీస్ అంతా కూడా బ్రెత్ టేకింగ్‌గా సాగింది. భారీభారీ స్కోర్లు, వాటిని ఛేదించడానికి ప్రత్యర్థి జట్లు పర్వఫుల్ పర్ఫార్మెన్స్‌తో సిరీస్ అంతూ ఇంట్రస్టింగ్‌గా సాగింది. ఇందులో టీమిండియా మొదటి నుంచి ప్రత్యర్థులపై విరుచుకుపడింది. టీమిండియా ప్లేయర్స్ అంతా ప్రత్యర్థులకు సింహస్వప్నంలా మారారు. ప్రత్యర్థులు అందించిన లక్ష్యాన్ని ఛేదించడమే కాకుండా.. ప్రత్యర్థి బ్యాటర్లను పెవిలియన్ చేర్చడంలో కూడా టీమిండియా ప్లేయర్స్ అద్భుతంగారాణించారు. ఇప్పుడు ఈ సిరీస్ ఫైనల్స్‌కు వచ్చేసింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి.

Live Updates

  • 9 March 2025 3:57 PM IST

    కివీస్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు.

    గత మూడు ఓవర్లలో బౌండరీ లేకపోయినా సింగిల్స్, డబుల్స్‌తో 12 పరుగులు చేశారు.

  • 9 March 2025 3:54 PM IST

    18 ఓవర్లలో న్యూజిల్యాండ్ 95/3

  • 9 March 2025 3:52 PM IST

    15 ఓవర్లలో న్యూజిలాండ్ స్కోరు 83/3


    న్యూజిలాండ్ లాస్ట్ రెండు ఓవర్లలో 6పరుగులు రాబట్టింది. అక్షర్ పటేల్ వేసిన 14 ఓవర్‌లో డారిల్ మిచెల్ బౌండరీ బాదాడు.

    కుల్‌దీప్ యాదవ్ వేసిన 15 ఓవర్‌లో రెండు సింగిల్స్ వచ్చాయి. 15 ఓవర్లకు స్కోరు 83/3. మిచెల్ (9), లేథమ్ (2) క్రీజులో ఉన్నారు.

  • 9 March 2025 3:45 PM IST

    IND vs NZ: కుల్‌దీప్‌ రిటర్న్‌ క్యాచ్‌.. కేన్‌ విలియమ్సన్‌ ఔట్


    కుల్‌దీప్‌ యాదవ్‌ ఖాతాలో మరో వికెట్

    రిటర్న్‌ క్యాచ్‌తో కేన్‌ విలియమ్సన్‌ (11)ను పెవిలియన్‌కు చేర్చిన కుల్‌దీప్‌

    75 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయిన న్యూజిలాండ్

    క్రీజ్‌లోకి వచ్చిన టామ్ లేథమ్‌

  • 9 March 2025 3:45 PM IST

    IND vs NZ: కుల్‌దీప్‌ సూపర్ బౌలింగ్‌.. రచిన్ క్లీన్‌బౌల్డ్


    బౌలింగ్‌కు వచ్చిన తొలి బంతికే రచిన్‌ (37)ను ఔట్ చేసిన కుల్‌దీప్‌

    సూపర్‌ డెలివరీ (10.1వ ఓవర్‌)తో రచిన్‌ రవీంద్రను క్లీన్‌బౌల్డ్ చేసిన భారత బౌలర్‌

    దీంతో 69 పరుగుల వద్ద రెండో వికెట్‌ డౌన్

    బ్యాటింగ్‌కు వచ్చిన డారిల్ మిచెల్

  • 9 March 2025 3:45 PM IST

    IND vs NZ: వరుణ్‌ చక్రవర్తికి తొలి వికెట్‌.. విల్‌ యంగ్‌ ఔట్


    న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ (15) ఔట్

    57 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయిన కివీస్‌

    వరుణ్‌చక్రవర్తి బౌలింగ్‌ (7.5వ ఓవర్‌)లో ఎల్బీ అయిన యంగ్

    డీఆర్‌ఎస్‌ తీసుకోకుండానే పెవిలియన్‌ బాట పట్టిన కివీస్‌ ఓపెనర్

    అనంతరం బ్యాటింగ్‌కు కేన్‌ విలియమ్సన్ (1*)

    క్రీజ్‌లో కేన్‌తోపాటు రచిన్ (34*)

    ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 58/1

    ఇదే ఓవర్‌లో రచిన్‌ ఇచ్చిన క్యాచ్‌ను చేజార్చిన శ్రేయస్

    మళ్లీ మైదానంలోకి దిగిన షమీ

  • 9 March 2025 3:44 PM IST

    IND vs NZ: చేజారిన క్యాచ్‌.. షమీ వేలికి గాయం


    రచిన్‌ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను చేజార్చిన షమీ

    ఎడమ చేతి చిటికెన వేలి చివరన బంతి తాకడంతో రక్తం కారింది

    వెంటనే వైద్యసిబ్బంది వచ్చి బ్యాండేజ్‌ వేశారు

    అనంతరం బౌలింగ్‌ను కొనసాగించిన షమీ

    ఓవర్‌ను పూర్తి చేసి డగౌట్‌కు వెళ్లిన షమీ

    ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 7 ఓవర్లకు 51/0

    క్రీజ్‌లో రచిన్‌ (29*), విల్ యంగ్ (15*)

    వరుణ్‌ చక్రవర్తిని బౌలింగ్‌కు తీసుకొచ్చిన కెప్టెన్ రోహిత్

Read More
Next Story