
డీలిమిటేషన్ ఆధారంగా లోక్‌సభ స్థానాలు పెంచొద్దు: రేవంత్
ఈ సమావేశానికి హాజరుకావాలని డీఎంకే.. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్. ఈ సమావేశానికి దూరంగా ఉండాలని టీఎంసీ నిశ్చయించుకుంది.
కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలు ఏకతాటిపైకి వచ్చాయి. దీనిని ఖండిస్తూ చెన్నై వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జాయింట్ యాక్షన్ కమిటీ(JAC) సమావేశం నిర్వహించారు. ఇందులో కర్ణాటక, కేరళ, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లోని పార్టీల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. పినరయి విజయన్, రేవంత్ రెడ్డి, కేటీఆర్, భగ్వంత్ మాన్, శిరోమని అకాళిదల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బల్విందర్ సింగ్ , ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కేరళ జనరల్ సెక్రటరీ జీఎంఏ సలామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలని డీఎంకే ఏడు రాష్ట్రాలను సంప్రదించింది. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్. కాగా ఈ సమావేశానికి దూరంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ నిశ్చయించుకుంది.
ఈ సందర్భంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. మార్చి 5న డీఎంకే నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్‌ను ఒక మైలురాయిగా అభివర్ణించారు. ఈ సమావేవంలో తమ మధ్య ఉన్న బేధాలను పక్కనబెట్టి 58 పార్టీలు పాల్గొన్నాయి. సమావేశానికి రావాలన్న పార్టీల ఏకాభిప్రాయం.. ప్రజాస్వామ్యం, న్యాయం పట్ల తమిళనాడుకు ఉన్న అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని స్టాలిన్ పేర్కొన్నారు.
Live Updates
- 22 March 2025 1:34 PM IST
డీలిమిటేషన్‌ను వాయిదా వేయండి: స్టాలిన్
డీలిమిటేషన్ ప్రక్రియను ౩౦ ఏళ్ల పాటు వాయిదా వేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కోరారు. డీలిమిటేషన్ సమస్యను పరిస్కరించడానికి రాజకీయ, న్యాయ నిపుణులతో ఒక కమిటీ వేయాలని ప్రతిపాదించారు. రాష్ట్ర పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని కాపాడటం, నియోజకవర్గ పునర్విభజనకు న్యాయమైన విధానాన్ని నిర్ధారించడమే ఈ సమావేశ లక్ష్యమని పేర్కొన్నారు.
- 22 March 2025 1:16 PM IST
కుటుంబ నియంత్రణ, ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు అద్భుతంగా పనిచేశాయి. కానీ ఉత్తరాదిలోని పలు పెద్దపెద్ద రాష్ట్రాలు కూడా ఫెయిల్ అయ్యాయి: రేవంత్
- 22 March 2025 1:12 PM IST
"జనాభాను నియంత్రించడానికి, స్థిరీకరించడానికి చాలా బాగా పనిచేసిన రాష్ట్రాల్లోని ప్రజల ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం, హక్కులను నిర్ధారించడానికి ఇది ఒక ముఖ్యమైన సమావేశం. జనాభా నియంత్రణ అనేది మన దేశ అభివృద్ధికి ఒక ముఖ్యమైన జాతీయ అజెండా. ఇది (జనాభా నియంత్రణ) సానుకూల జాతీయ అజెండాకు, బలమైన భారతదేశాన్ని నిర్మించడానికి మా సహకారం అయినప్పటికీ, జనాభా గణాంకాల ఆధారంగా మాత్రమే డీలిమిటేషన్ చేయడం జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా జనాభా పెరుగుదల రేటును తగ్గించడానికి కృషి చేసిన రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది. మన దేశంలోని అత్యున్నత ప్రాతినిధ్య సంస్థలో సీట్ల సంఖ్యను నిర్ణయించడానికి జనాభా మాత్రమే ప్రమాణం కాకూడదనేది మా వైఖరి. మన ప్రజాస్వామ్యానికి చాలా దూరపు ప్రభావాలను కలిగి ఉన్న ఈ చాలా ముఖ్యమైన అంశంపై ఏవైనా సందేహాలను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలతో వివరణాత్మక చర్చను చేపట్టాలని నేను సూచిస్తున్నాను..." అని ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు.
- 22 March 2025 1:08 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెన్నై ప్రకటన
“నేడు దేశం పెద్ద సవాలు ఎదుర్కొంటున్నది. బిజెపి జనాభా నియంత్రణ జరిమానా విధానాన్ని అమలు చేస్తోంది. ఇపుడు కేంద్రం అమలుచేయాలనుకుంటున్నఈ డీలిమిటేషన్‌ను విధానాన్ని మేము తిరస్కరిస్తున్నాం. ఎందుకంటే ఇది రాజకీయంగా మమ్మల్నిమరుగుజ్జుల్ని చేస్తుంది. జనాభాను నియంత్రించి మంచి పనిచేసినందుకు మమ్మల్ని శిక్షిస్తారా? మనమంతా ఒకటే దేశం అనే దాన్ని గౌరవిస్తాం. అయితే ఈ అన్యాయమైన డీలిమిటేషన్ వ్యతిరేకిస్తాం. దానిని అమలు చేయకుండా బిజెపిని ఆపాలి"
- 22 March 2025 1:07 PM IST
రాష్ట్ర హక్కులను వదులుకోం: డీకే శివకుమార్
‘‘భారతదేశ సమాఖ్య సూత్రాలను కాపాడటానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీసుకున్న చొరవ ప్రశంసనీయం. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ఇతర రాష్ట్రాలపై రాజకీయ దాడే. ఇది ప్రారంభం మాత్రమే! మా చర్యలు విజయం దిశగా ముందుకెళ్తాయి. మేము రాష్ట్ర హక్కులను వదులుకోం. ఇది ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య వివాదం కాదు. ఇది సమాఖ్యవాదం భవిష్యత్తుకు సంబంధించినది’’ అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.