
చల్లారని భారత్, పాక్ ఉద్రిక్తలు.. అలెర్ట్‌గా ఉన్న భద్రతా బలగాలు..(LIVE)
పాక్ చేస్తున్న డ్రోన్, మిస్సైల్ దాడులను ఎక్కడిక్కడ పడగొడుతోంది భారత్.
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్ని ఉద్రిక్తలు ఇంకా చల్లారలేదు. ఏ క్షణాన ఎటునుంచి, ఎలాంటి దాడులు జరుగుతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. కాగా పాక్ ఎలాంటి దాడి చేసిన ఎదుర్కోవడానికి భారత్ సన్నద్ధం అవుతోంది. ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరిస్తోంది. పలు ప్రాంతాల్లో హఅలెర్ట్ ప్రకటించింది. భద్రతను భారీగా పెంచింది. అన్ని విధాల భద్రతా సంస్థలను రంగంలోకి దించింది. సరిహద్దుల్లో దెబ్బకు దెబ్బ కొడుతూ బదులిస్తోంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలు అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాయి. ఎక్కడిక్కడ మార్గదర్శకాలను విడుదల చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఏమాత్రం అలసత్వానికి అవకాశం ఉండకూడదని అధికారులను సూచిస్తున్నాయి. కేంద్రంలో కేబినెట్ అంతా కూడా ఉన్నతాధికారులకు వరుస సమావేశాలు నిర్వహిస్తూ.. పరిస్థితులను తెలుసుకుంటున్నాయి. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సన్నద్ధం అవుతోంది భారత్. ఈ క్రమంలోనే చేపట్టిన ఆపరేషన్ సిందూర్ 2.0పై భద్రతా బలగాలు బ్రీఫింగ్ కూడా ఇచ్చాయి.
ఈ క్రమంలోనే దేశరాజధాని ఢిల్లీలో కొత్త సైరన్లను అమర్చనున్నట్లు అధికారులు చెప్పారు. ‘‘సైరన్లను అమర్చుతున్నాం. ఎత్తైన భవనాలపై ఏర్పాటు చేసి, వీటి పనితీరును పరిశీలిస్తున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని ప్రదేశాల్లో ఏర్పాటు చేయనున్నాం. 11 జిల్లాల పరిధిలో ఇప్పటివరకు 10 సైరన్లు ఏర్పాటు చేశాం. కొన్ని సైరన్ శబ్దాలు రెండు కి.మీలు, కొన్ని నాలుగు, మరికొన్ని 16 కి.మీ పరిధి వరకు వినిపిస్తాయి’’ అని రెవెన్యూ అధికారులు వెల్లడించారు.
మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో చొరబాటుకు ప్రయత్నాలు కూడా ముమ్మరంగానే జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం దాదాపు పలువురు భారత్‌లోకి చొరబడే ప్రయత్నం చేశారు. కాగా వారిని భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. ఈ కాల్పుల్లో దాదాపు ఏడుగురు చొరబాటు దారులు మరణించారు. ఈ అంశంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్ని వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే త్రిదళాదిపతులు సహా పలువురు ఉన్నతాధికారులతో ప్రత్యేక రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఇందులో సరిహద్దుతో పరిస్థఇతులతో పాటు, భారత్ దగ్గర ఉన్న ఆయుద్ధ సంప్పత్తిపై కూడా చర్చించినట్లు సమాచారం.
పాక్ దాడులు నిర్వీర్యం
ఈ ఉద్రిక్తల నేపథ్యంలో పాకిస్థాన్ భారీగా డ్రోన్‌లను ప్రయోగించింది. కాగా వాటన్నింటిని భారత డిఫెన్స్ ఫోర్సెస్ నిర్వీర్యం చేశఆయి. పాక్ చేస్తున్న డ్రోన్, మిస్సైల్ దాడులను ఎక్కడిక్కడ పడగొడుతోంది భారత్. దాంతో పాటుగానే పాక్ టార్గెట్ చేసుకునే అవకాశం ఉందన్న అన్ని కీలక ప్రాంతాల్లోనూ భారీ భద్రతను ఏర్పాటు చేసింది.
Live Updates
- 9 May 2025 5:58 PM IST
అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించాలన్న పాక్ ప్రయత్నిం విఫలమవడం ఖాయం: MEA
పాకిస్తాన్ తన దాడులను తిరస్కరించడాన్ని MEA "తన సొంత చర్యలను తిరస్కరించడానికి మరియు అంతర్జాతీయ సమాజాన్ని మోసం చేయడానికి చేసిన తీరని ప్రయత్నం" అని అభివర్ణించింది, అది ఎప్పటికీ విజయం సాధించదు. "అదనంగా, మేము మా స్వంత నగరాలపై దాడి చేస్తాము అనేది ఒక రకమైన అస్తవ్యస్తమైన ఫాంటసీ, ఇది పాకిస్తాన్ రాష్ట్రం మాత్రమే ఊహించగల విషయం" అని విదేశాంగ కార్యదర్శి అన్నారు.