LIVE ఆపరేషన్ ‘సిందూర్’ షురూ.. LIVE
x

ఆపరేషన్ ‘సిందూర్’ షురూ.. LIVE

పాకిస్థాన్, పీఓకే ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద శిభిరాలపై భారత భద్రతా బలగాలు మెరుపు దాడులు చేశాయి.


భారత భద్రతా బలగాలు ఈరోజు తెల్లవారుజామున ఆపరేషన్ ‘సంధూర్’ చేపట్టాయి. పహల్గామ్ దాడికి ప్రతీకార చర్యలు స్టార్ట్ చేసింది భారత్. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్, పీఓకే ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద శిభిరాలపై భారత భద్రతా బలగాలు మెరుపు దాడులు చేశాయి. ‘పాకిస్థాన్ మిలటరీ స్థావరాలను ఒక్కదాన్ని కూడా టార్గెట్ చేయలేదు. అన్నీ ఉగ్రవాద స్థావరాలపైనే దాడులు చేశాం’ అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. భారత్ దాడి చేసిన స్థావరాలు లష్కరే-ఇ-తోయిబా, జైష్-ఇ-మొహమ్మద్, హిజ్‌బుల్ ముజాయిద్దీన్ సహా పలు ఏజెన్సీలకు చెందినవని సమాచారం.

పూంచ్ మరియు రాజౌరిలోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఉన్న గ్రామాలపై పాకిస్తాన్ సైన్యం భారీ మోర్టార్ షెల్లింగ్‌కు దిగింది. పూంచ్‌లోని కృష్ణ ఘాటి, షాపూర్ మరియు మంకోట్, రాజౌరి జిల్లాలోని లామ్, మంజాకోట్ మరియు గంబీర్ బ్రాహ్మణాల నుండి షెల్లింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. "పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాల ప్రదేశాలపై కేంద్రీకృత దాడులు జరిగాయి. ఇవి సరిహద్దు ఉగ్రవాద ప్రణాళిక మూలాలను లక్ష్యంగా చేసుకున్నాయి" అని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు సోషల్ మీడియా ఎక్స్ (X) లో తెలిపారు.

పాకిస్తాన్ సైన్యం పూంచ్, రాజౌరిలోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఉన్న గ్రామాల వెంబడి పెద్దఎత్తున ఆయుధాలతో మోహరించి ఉన్నట్టు సమాచారం. రాజౌరి జిల్లాలోని పూంచ్‌లోని కృష్ణ ఘాటి, షాపూర్, మంకోట్, లామ్, మంజాకోట్, గంబీర్ బ్రాహ్మణ నుండి బాంబు దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు.

భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే అన్ని విమాన రవాణా సర్వీసులను నిలిపివేశారు. కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ మంగళవారం (మే 6, 2025) పౌర రక్షణ యంత్రాంగాలను బలోపేతం చేయడానికి సన్నాహాలను సమీక్షించారు. వీటిలో వైమానిక దాడి హెచ్చరిక సైరన్‌లపై మాక్ డ్రిల్‌లు నిర్వహించడం, "శత్రు దాడి" జరిగినప్పుడు తమను తాము రక్షించుకోవడానికి పౌరులకు శిక్షణ ఇవ్వడం, బంకర్‌లు, కందకాలను శుభ్రపరచడం వంటివి ఉన్నాయి.

ఇంతలో, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను చర్చించింది. ఇక్కడ రాయబారులు ఉద్రిక్తతలను తగ్గించడానికి పిలుపునిచ్చారు.

Live Updates

  • 7 May 2025 9:02 AM IST

    ఈరోజు ఢిల్లీ ప్రధాని మోదీ.. కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. అందులో పాక్ రెస్పాన్స్‌కు ఎలా ప్రతిస్పందించాలి అన్న అంశాలతో పాటు ‘ఆపరేషన్న సింధూర్’ నెక్స్ట్ టార్గెట్‌పై కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Read More
Next Story