వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్.. భారత్ vs యూఎస్ఏ
x

వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్.. భారత్ vs యూఎస్ఏ

ముంబైలో భారత్–యూఎస్ఏ తొలి మ్యాచ్. గాయాలతో భారత్ ఇబ్బంది. యూఎస్ఏలో ప్రమాదకర ఆటగాళ్లపై ఫోకస్.


టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ ప్రయాణం ఈరోజు మొదలవుతోంది. ముంబై వేదికగా యూఎస్ఏతో తొలి గ్రూప్ మ్యాచ్ జరగనుంది. ఇదే టోర్నీలో టీమ్ ఇండియాకు ఇదే మొదటి పరీక్ష. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగుతోంది. టైటిల్ డిఫెన్స్ లక్ష్యంగా తొలి అడుగు పడుతోంది. మరోవైపు యూఎస్ఏ జట్టు కూడా సవాల్‌కు సిద్ధమైంది.

వరల్డ్ కప్‌కు ముందు భారత్‌ను గాయాలు తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మ్‌అప్ మ్యాచ్‌లో సమస్య తలెత్తింది. వెంటనే జట్టులో మార్పు చేశారు. హర్షిత్ స్థానంలో మొహమ్మద్ సిరాజ్‌కు అవకాశం ఇచ్చారు.

ఇదే సమయంలో వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి కోలుకుంటున్నారు. తొలి మ్యాచ్‌కు ఆయన అందుబాటులో ఉండే అవకాశం తక్కువగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం మ్యాచ్ సమయానికి వెలువడనుంది.

బ్యాటింగ్‌లో ఓపెనింగ్ కాంబినేషన్ దాదాపు ఖరారైంది. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ మంచి టచ్‌లో ఉన్నారు. ఇన్నింగ్స్‌ను వీరే ప్రారంభించే సూచనలు ఉన్నాయి. బౌలింగ్‌లో స్పిన్ కాంబినేషన్‌పై ఆసక్తి నెలకొంది. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇద్దరికీ ఒకేసారి అవకాశం దక్కుతుందా అన్నది ఉత్కంఠగా మారింది. ఇదే సమయంలో పిల్లకుంక టీమ్ అనుకుంటున్న యూఎస్ఏ జట్టులో కూడా భారత్‌ను తిప్పలు పెట్టే ఆటగాళ్లంటూ ముగ్గురి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.

యూఎస్ఏ జట్టు వార్మ్‌అప్ మ్యాచ్‌ల్లో వరుసగా ఓటములు ఎదుర్కొంది. భారత్-ఏ చేతిలోనూ, న్యూజిలాండ్ చేతిలోనూ పరాజయం పాలైంది. అయినా యూఎస్ఏ జట్టులో మ్యాచ్ గమనాన్ని మార్చగల ఆటగాళ్లు ఉన్నారు. గ్రూప్-ఏలో భారత్‌కు సవాల్‌గా మారే ముగ్గురిపై ఇప్పుడు దృష్టి కేంద్రీకృతమైంది.

సౌరభ్ నేత్రావాల్కర్

యూఎస్ఏ టీ20 జట్టులో కీలక బౌలర్ సౌరభ్ నేత్రావాల్కర్. అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు ఉంది. 41 మ్యాచ్‌ల్లో 40 వికెట్లు సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వార్మ్‌అప్ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు. కొత్త బంతితో ఖచ్చితమైన లైన్, లెంగ్త్ అతడి బలం. ముంబై దేశీయ క్రికెట్ అనుభవం వాంఖడేలో ఉపయోగపడే అవకాశం ఉంది.

ఆండ్రీస్ గౌస్: మిడిల్ ఓవర్లలో వేగం

వికెట్‌కీపర్ బ్యాటర్ ఆండ్రీస్ గౌస్ కూడా యూఎస్ఏ టీమ్‌లో చాలా కీలకం. భారత్-ఏతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 31 బంతుల్లో 44 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో వేగంగా పరుగులు సాధించే సామర్థ్యం భారత్‌కు ఇబ్బందిగా మారవచ్చు.

సైతేజ ముఖ్కమల్లా

భారత్‌కు ప్రమాదంగా మారే మరో ఆటగాడు యూఎస్ఏ యువ ఓపెనర్ సైతేజ ముఖ్కమల్లా. న్యూజిలాండ్‌తో జరిగిన వార్మ్‌అప్ మ్యాచ్‌లో 31 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. తక్కువ మ్యాచ్‌ల్లోనే మంచి సగటు, స్ట్రైక్‌రేట్ సాధించాడు. దూకుడుగా ఆడే శైలి అతడిని ప్రమాదకర బ్యాటర్‌గా మారుస్తోంది. ఆరంభంలో వికెట్లు పడితే మ్యాచ్ దిశను మార్చే సామర్థ్యం అతడిలో ఉంది.

Live Updates

  • 7 Feb 2026 7:29 PM IST

    వాంఖడేలో బౌండ్రీల వరద

    వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్ఏతో జరుగుతున్న పోరులో భారత బ్యాటర్లు బౌండ్రీల వరద పారిస్తున్నారు. అభిషేక్ శర్మ ఔట్‌తో క్రీజ్‌లోకి వచ్చిన తిలక్ వర్మ.. తొలుత డిఫెన్స్ మోడ్‌లో ఆడాడు. కానీ వెంటనే హిట్టింగ్ స్టార్ట్ చేశాడు. ఒకవైపు ఇషాన్ కిషన్, మరోవైపు తిలక్ వర్మ కలిసి దాదాపు ప్రతి బంతిని బౌండ్రీగా మలుస్తున్నారు.  అలీఖాన్ వేసిన రెండో ఓవర్లో మొత్తం ౧౧ పరుగులు వచ్చాయి. 


    ప్రస్తుతం కిషన్ 15 బంతులకు 20 పరుగులు చేయగా, తిలక్ వర్మ 15 బంతులకు 25 పరుగులు చేశాడు.

  • 7 Feb 2026 7:10 PM IST

    అభిషేక్ శర్మ ఔట్

    మ్యాచ్ మొదలైన రెండో ఓవర్‌లోనే అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. అలీఖాన్ వేసిన బాల్‌ను సిక్సర్ కొట్టడానికి చేసిన ప్రయత్నం క్యాచ్‌గా మారింది. సంజయ్ క్యాచ్ పట్టడంతో అభిషేక్ సున్నా పరుగులకు పెవిలిచన్ చేరాడు.

  • 7 Feb 2026 7:08 PM IST

    మ్యాచ్ ప్రారంభం: కిషన్–అభిషేక్ ఓపెనింగ్

    మ్యాచ్‌కు ఉత్కంఠభరితమైన ఆరంభం లభించింది. తొలి బంతితో ఆట మొదలైనట్లు తాజా అప్‌డేట్‌గా వెల్లడైంది.

    ఇషాన్ కిషన్ స్ట్రైక్‌లో నిలవగా, మరో ఎండ్‌లో అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉన్నాడు. USA తరఫున భారత మూలాలున్న ఎడమచేతి పేసర్ సౌరభ్ నేత్రవాల్కర్ కొత్త బంతితో బౌలింగ్ ప్రారంభించాడు.

    ఆయన తొలి డెలివరీని షార్ట్ ఆఫ్ లెంగ్త్‌లో వేశాడు. బంతి కిషన్ నుంచి బయటకు స్వింగ్ అయినట్లు కనిపించింది. ఎడమచేతి బ్యాటర్ ఆ బంతిని బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు.

    ఈ విధంగా తొలి ఓవర్ ప్రారంభమై మ్యాచ్ క్రమంగా ముందుకు సాగింది. ప్రేక్షకులు తదుపరి పరిణామాలపై దృష్టి సారిస్తున్నారు.

Read More
Next Story