LIVE పహల్గామ్ ఉగ్రవాదులపై రూ.20 లక్షల రివార్డ్ (LIVE)
x

పహల్గామ్ ఉగ్రవాదులపై రూ.20 లక్షల రివార్డ్ (LIVE)

పహల్గామ్ ఉగ్రవాదుల ఫొటోలను విడుదల చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు


జమ్మూకశ్మీర్ పహల్గామ్‌లో ఏప్రిల్ 22న భారత పర్యాటకులను అత్యంత అమానవీయంగా హతమార్చిన ఉగ్రవాదుల ఫొటోలను జమ్మూకశ్మీర్ పోలీసులు విడుదల చేశారు. వారిపై రూ.20 లక్షల రివార్డ్‌ను కూడా ప్రకటించారు. ఉగ్రవాదులను పట్టుకోవడం కోసం రాష్ట్రమంతా జల్లెడపడుతున్నారు. ఇదిలా ఉంటే భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ పాక్ కవ్వింపు చర్యలను మానుకోవడం లేదు. సోమవారం రాత్రి సమయంలో కూడా డ్రోన్లతో పలు ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దాడులు చేసింది. వాటిని భారత్ తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి ఎయిర్‌లైన్ సంస్థలు పలు విమానాలను రద్దు చేశాయి. శ్రీనగర్, జమ్మూ, అమృత్‌సర్, ఛండీగఢ్ సహా మరిన్ని సరిహద్దు నగరాలకు వెళ్లే విమానాలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ప్రయాణికుల రక్షణను, ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించాయి.

సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత మోదీ చేసిన తొలి ప్రసంగం ఇదే కావడం విశేషం. ఈ ప్రసంగంలో ఆయన పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అణుబాంబుల బెదిరింపులకు భారత్ భయపడదని స్పష్టం చేశారు. ‘‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకొచ్చిన కొత్త పాలసీనే ‘ఆపరేషన్ సిందూర్’. పాకిస్థాన్‌పై మేము మా కార్యకలాపాలను మాత్రమే ఆపేశాం. భవిష్యత్తు అనేది వారి తీసుకున్నే నిర్ణయాలు, వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది’’ అని మోదీ పేర్కొన్నారు. అంతేకాకుండా పాకిస్థాన్ పాలకులకు కూడా కొన్ని సూచనలు చేశారు.

‘‘ఇన్నాళ్లూ ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులే ఆ పాకిస్థాన్‌ను దెబ్బతీస్తారు. దానిని నుంచి పాకిస్థాన్ బతికి బట్టకట్టాలంటే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాన్ని, ఉగ్రవాదులను భారత్ వేరుగా చూడదు’’ అని ఉగ్రవాదంపై భారత వైఖరిని మోదీ పునరుద్ఘాటించారు. ఇదే క్రమంలో ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని భారత త్రివిధ దళాధిపతులు వెల్లడించారు.

Live Updates

  • 13 May 2025 12:58 PM IST

    సైన్యం కృషి, ప్రధాని మోదీ సామర్థ్యం పట్ల దేశం గర్విస్తోంది: కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ (లాలన్) సింగ్

  • 13 May 2025 12:31 PM IST

    భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు ట్రంప్ క్రెడిట్ తీసుకోవడంపై అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తామని మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. ఇది గోప్యంగా ఉంచాల్సిన అంశమని, అందుకే అందులో డిస్కస్ చేస్తామని చెప్పారు.

  • 13 May 2025 12:29 PM IST

    పంచకులాలో పార్టీ తిరంగ యాత్రకు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ నాయకత్వం వహిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన తర్వాత సాయుధ దళాల గౌరవార్థం తిరంగ యాత్ర నిర్వహిస్తున్నారు.

  • 13 May 2025 12:29 PM IST

    జమ్మూ-కాశ్మీర్‌లోని షోపియన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 3 మంది ఉగ్రవాదులు మృతి చెందారు.

  • 13 May 2025 12:28 PM IST

    పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ, జవాన్లతో సంభాషించారు.

  • 13 May 2025 12:18 PM IST

    మోదీ ప్రసంగంపై ప్రియాంక్ ఖర్గే చురకలు

    జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రసంగం ప్రసంగంలా కాకుండా మోనోలాగ్‌ను తలపించిందన్నారు. "పాకిస్తాన్ గురించి ప్రతి ప్రపంచ నాయకుడితో మాట్లాడటానికి ప్రధానమంత్రి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆయన తన దేశస్థులను మరియు ఇతర రాజకీయ పార్టీలను కూడా ఉద్దేశించి ప్రసంగించాలి. ఇది పక్షం రోజులకు పైగా జరిగింది, మరియు ప్రధానమంత్రి తన తోటి దేశస్థులతో సంభాషణకు బదులుగా ఏకపాత్రాభినయం ఎంచుకుంటాడు. దేశప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఏదైనా నిర్ణయాత్మక నిర్ణయం కోసం ప్రభుత్వాన్ని సిద్ధం చేస్తామని కాంగ్రెస్ స్పష్టంగా ఉంది....మేము అఖిలపక్ష సమావేశం మరియు పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని కోరాము...డోనాల్డ్ ట్రంప్ తన మధ్యవర్తిత్వం కాల్పుల విరమణకు దారితీసిందని చెప్పారు. ఇది ద్వైపాక్షిక సమస్యలో జోక్యం చేసుకోవడం తప్ప మరొకటి కాదు..."

  • 13 May 2025 12:16 PM IST

    రేపు ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది.

  • 13 May 2025 12:15 PM IST

    జమ్మూ-కాశ్మీర్‌లోని షోపియన్‌లో ఎదురుకాల్పులు

    జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో మంగళవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని షుక్రూ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిర్దిష్ట సమాచారం ఆధారంగా, భద్రతా దళాలు అక్కడ కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఉగ్రవాదులు దళాలపై కాల్పులు జరిపిన తర్వాత సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని, వారు ప్రతీకారం తీర్చుకున్నారని వారు తెలిపారు. కాల్పులు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు ఇరువైపులా ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు లేవని అధికారులు తెలిపారు.

  • 13 May 2025 12:14 PM IST

    డిఫెన్స్ సెక్రటరీ, సీడీఎస్, నేవీ చీఫ్, ఆర్మీ చీఫ్‌తో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశం నిర్వహించారు. అందులో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన డీజీఎంఓల సమావేశంపై కూడా చర్చించినట్లు సమాచారం.

Read More
Next Story