నేడే తెలంగాణ ఫలితాలు... లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి
x

నేడే తెలంగాణ ఫలితాలు... లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి

తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల మధ్య లోక్‌సభ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగింది. ఎన్నికల ఫలితాల్లో మూడు పార్టీలూ తమదే పైచేయి ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.


తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల మధ్య లోక్ సభ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగింది. పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తమదంటే తమదే పైచేయి ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కాంగ్రెస్.. లోక్ సభలో 13 స్థానాలు కైవసం చేసుకుంటామంటుంటే, అబ్ కీ బార్ చార్ సౌ పార్ అంటున్న బీజేపీ రాష్ట్రంలో డబుల్ డిజిట్ సాధిస్తామంటోంది. ఇక హ్యాట్రిక్ కొడతామని బోర్లాపడ్డ బీఆర్ఎస్.. లోక్ సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుని పరువు నిలబెట్టుకోవాలని ఆశగా ఉంది. పార్టీలే కాదు, అత్యంత హైప్ తో సాగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. నేటి (మంగళవారం) తో ఆ ఉత్కంఠకు తెర పడనుంది. మరి కొన్ని గంటల్లో తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల ఫలితాలు వెలువడనున్నాయి. పార్లమెంటు అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న ఫలితాల అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ది ఫెడరల్ వెబ్సైట్ లైవ్ ఫాలో అవండి.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 34 చోట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. 4వ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్‌ జరిగింది. మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో లెక్కింపునకు 1,855 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24 రౌండ్లలో, అత్యల్పంగా మూడుచోట్ల 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుపుతున్నారు.

ఇక ఈరోజే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ నుంచి గణేష్ నారాయణన్, బీజేపీ నుంచి వంశి తిలక్, బీఆర్ఎస్ నుంచి నివేదిత బరిలో ఉన్నారు.

Live Updates

  • 4 Jun 2024 8:51 AM IST

    ఆధిక్యంలో ఈటల రాజేందర్

    మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి ఎల్ బి నగర్ అసెంబ్లీ సెగ్మెట్ లో మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 6,330 ఓట్ల తో ఆధిక్యం

    బీజేపీ :-8811

    కాంగ్రెస్ :2581

    బిఆర్ఎస్ :1418

  • 4 Jun 2024 8:50 AM IST

    బోణీ కొట్టని బీఆర్‌ఎస్

    తెలంగాణ లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌లో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేదు. దీంతో అసలు పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే అన్నట్లు కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠ భరితంగా సాగుతోంది.

  • 4 Jun 2024 8:49 AM IST

    ఆరుకు చేరిన బీజేపీ ఆధిక్యం

    తెలంగాణలోని 17  పార్లమెంటు స్థానాల్లో బీజేపీ.. ఆరు స్థానాల్లో ఆధిపత్యం కనబరుస్తోంది. మరోవైపు నాలుగు స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది.

  • 4 Jun 2024 8:39 AM IST

    దూసుకెళ్తున్న బీజేపీ


    తెలంగాణ లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ దూకుడు కనబరుస్తోంది. కౌంటింగ్ ప్రారంభంలోనే నాలుగు స్థానాల్లో బీజేపీ ఆధిక్యం సాధించింది. మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్ స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఖమ్మం స్థానంలోనే ఆధిక్యంలోనే ఉంది.

Read More
Next Story