తెలంగాణలో మొదలైన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోరు
తెలంగాణలో నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నికలో రాజకీయ పార్టీలు హోరాహోరీ పోరుకు సిద్ధమవుతున్నాయి. ఈరోజు అక్కడ పోలింగ్ మొదలైంది..
తెలంగాణలో నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలో రాజకీయ పార్టీలు హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి. ఈరోజు ఈ ఉపఎన్నిక పోలింగ్ జరుగుతోంది. కీలకమైన ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 5న వెల్లడి కానున్నాయి. మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, ప్రధాన పోటీ మాత్రం అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్యే ఉంది. రాష్ట్ర అసెంబ్లీకి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్‌ఎస్ నుంచి ఎన్నికైన నేపథ్యంలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నికలో ముఖ్య అభ్యర్థులు BRS నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. గతంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఏర్పాటు చేసిన 605 పోలింగ్ కేంద్రాల్లోనే ఈసారి కూడా పోలింగ్ జరగనుంది. ఆదివారం ఎన్నికల సామగ్రి పంపిణీ, సిబ్బందిని ఎన్నికల కేంద్రాలకు పంపించటం వంటి కార్యక్రమాలు పూర్తి చేశారు. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో 12 కొత్త జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో 4,61,806 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,87,007 మంది పురుషులు, 1,74,794 మంది మహిళలు, ఐదుగురు థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.
Live Updates
- 27 May 2024 5:05 PM IST
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముగిసిన పోలింగ్. నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. మొత్తం 600 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్. మూడు జిల్లాల పరిధిలో 4లక్షల 61వేల 806 మంది గ్రాడ్యుయేట్ ఓట్లర్లు.
- 27 May 2024 3:17 PM IST
వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ 2 గంటల వరకు 49.53%
- 27 May 2024 11:48 AM IST
నల్గొండ- ఖమ్మం- వరంగల్ జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక...
ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్...
వచ్చే నెల 5న కౌంటింగ్...
ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు...
పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు 38 మంది...
మొత్తం 600 పోలింగ్ కేంద్రాలు సిద్ధం...
మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 4, 63, 839...
పురుషులు 2, 88, 189...
స్త్రీలు 1, 75, 645...
ట్రాన్స్ జెండర్ ఓట్లు 5...
- 27 May 2024 11:26 AM IST
ఓటేసిన తీన్మార్ మల్లన్న
అంతా మంచే జరగాలని తల్లిదండ్రి ఆశీర్వాదం తీసుకొని కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ ముల్లమ్మ) ఆయన సతీమణి మమత.. ఓటు వేయడానికి బయలుదేరారు. ఓటు వేసి అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
అంతా మంచే జరగాలని తల్లిదండ్రి ఆశీర్వాదం తీసుకొని కాంగ్రెస్ అభ్యర్థి @IamwithMallanna ఆయన సతీమణి మమత.. ఓటు వేయడానికి బయలుదేరారు. ఓటు వేసి అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.#MLCElection #Teenmarmallanna pic.twitter.com/5sF3YVzgIc
— Subbu (@Subbu15465936) May 27, 2024 - 27 May 2024 11:19 AM IST
ఓటు వేసిన రాకేష్ దంపతులు
ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- 27 May 2024 11:01 AM IST
బారులు తీరిన ఓటర్లు
ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బార్లు తీరి ఉన్నారు. ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు సాగనుంది.
- 27 May 2024 10:55 AM IST
తొలి ఓటు వేసిన జగదీష్ రెడ్డి
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.. సూర్యాపేటలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌లో తొలి ఓటు వేశారు. సూర్యాపేట జూనియర్ కాలేజీలోని 457వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.