
అసెంబ్లీ ఎన్నికల లైవ్.. కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో ప్రారంభమైన పోలింగ్
కేరళలో హంగ్ తప్పదంటున్న బీజేపీ, అస్సాంలో తమ ప్రభుత్వమే అంటున్న హిమాంత
కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభం అయింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. రెండు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతానికి ఒకే విడతలో ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహిస్తోంది. ఈ నెల చివరి వారంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మే 4 న ఫలితాలు వెల్లడిస్తారు.
గత రెండు పర్యాయాలుగా అస్సాంలో అధికారంలో ఉన్న బీజేపీ వరుసగా మూడోసారి గద్దె నెక్కాలని ఆశిస్తోంది. ఇక్కడ మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 63 స్థానాలు సాధించిన పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మిత్రపక్షాల సాయంతో బీజేపీ సులువుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ముందస్తు సర్వేలు తెలియజేస్తున్నాయి.
140 నియోజకవర్గాలు ఉన్న కేరళలో గత రెండు పర్యాయాలుగా కమ్యూనిస్టుల నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఈ సారి ఎలాగైన అధికారం దక్కించుకోవాలని గట్టిగా పోరాడింది. మరోవైపు బీజేపీ కూడా ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ మద్దతుతో ఎన్ రంగస్వామి నేతృత్వంలో ప్రభుత్వం ఉంది. వీటితో పాటు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, నాగాలాండ్ రాష్ట్రాలలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కర్ణాటకలోని దావణగెరె సౌత్ తో పాటు బాగల్కోట్, అలాగే మహారాష్ట్రలో అజిత్ పవార్ మరణంతో బారామతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. గోవాలోని పొండా ఉప ఎన్నికను బాంబే హైకోర్టు రద్దు చేసింది.
Live Updates
- 9 April 2026 10:42 AM IST
కేరళలో ఉ. 10 గంటలకు ఓటింగ్ 20 శాతం దాటింది. అస్సాంలో 18 శాతం పోలింగ్ రికార్డ్ అయింది.
- 9 April 2026 10:25 AM IST
ఓటేసిన కేరళ ముఖ్యమంత్రి
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కన్నూరు లోని అమల అప్పర్ ప్రైమరీ స్కూల్ లో ఓటు వేశారు.
- 9 April 2026 10:23 AM IST
అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో గెలవాలని ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ శక్తిపీఠం అయిన ‘కామాఖ్య’ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
Next Story


