
ఎకనామిక్ సర్వే సంకేతాలు: 7 శాతం వృద్ధిపై ఆశలు
ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ 2026. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. అంచనాలు, సవాళ్లు ..
ఫిబ్రవరి 1… ఆదివారం… దేశ ఆర్థిక దిశను నిర్ణయించే కీలక ఘట్టం. యూనియన్ బడ్జెట్ 2026తో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త చరిత్రకు సిద్ధమయ్యారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాకుండా, ఆదివారం రోజున బడ్జెట్ చదివే తొలి ఆర్థిక మంత్రిగా ఆమె నిలవనున్నారు. ఇదే తాజా అప్‌డేట్‌గా రాజకీయ, ఆర్థిక వర్గాల్లో ఆసక్తి పెరిగింది.
బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయం కాలక్రమంలో మారింది. 1999 వరకు సాయంత్రం ఐదు గంటలకు బడ్జెట్ చదివే పద్ధతి ఉండేది. అదే ఏడాది యశ్వంత్ సిన్హా ఉదయం పదకొండు గంటలకు మార్చారు. ఆ విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. 2017లో అరుణ్ జైట్లీ బడ్జెట్ తేదీని ఫిబ్రవరి చివరి నుంచి ఫిబ్రవరి 1కి ముందుకు తీసుకొచ్చారు. నిర్మలా సీతారామన్ ఇప్పటికే 2020, 2025లో శనివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టగా, ఈసారి ఆదివారం మరో మైలురాయి చేరనుంది.
యూనియన్ బడ్జెట్ 2026 కేంద్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయ అంచనాలను వెల్లడించనుంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యానికి ఇది కీలక పునాదిగా భావిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతున్నప్పటికీ, ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి, భౌగోళిక రాజకీయ పరిణామాలు సవాళ్లుగా మారాయి.
ఆర్థిక లోటును జీడీపీలో 4.5 శాతం కంటే దిగువకు తీసుకెళ్లాలన్న లక్ష్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత బడ్జెట్లలో మౌలిక వసతులపై ఖర్చు పెరగగా, అదే ఊపు కొనసాగుతుందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
బడ్జెట్‌కు ముందు పరిశ్రమ వర్గాలు తమ అంచనాలు వెల్లడించాయి. మౌలిక వసతులు, తయారీ రంగంపై పెట్టుబడులు కొనసాగించాలని సూచించాయి. టెక్నాలజీ రంగం, స్టార్టప్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ హైడ్రోజన్ అంశాల్లో స్పష్టత కోరుతున్నాయి.
ఎకనామిక్ సర్వే అంచనాల ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.8 నుంచి 7.2 శాతం మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు సాధారణంగా కొనసాగనున్నాయి. పన్నుల విధానం, రంగాల వారీ కేటాయింపులపై ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తున్నారు.
మొత్తంగా చూస్తే, యూనియన్ బడ్జెట్ 2026 దేశ ఆర్థిక ప్రయాణంలో మరో కీలక మలుపుగా నిలవనుంది.
Live Updates
- 1 Feb 2026 12:36 PM IST
భారత్ డేటా సెంటర్లకు చేయూత
* భారతదేశంలోని డేటా సెంటర్లకు, క్లౌడ్ సర్వీస్ బంపరాఫర్
* భారత్ డేటా సెంటర్లు ఉపయోగించే విదేశీ క్లౌడ్ కంపెనీలకు పన్ను లేదు
* 2047 సంవత్సరం వరకు పన్ను మినహాయింపు
* భారత్ డేటా సెంటర్లు ఉపయోగించే విదేశీ క్లౌడ్ కంపెనీలకు ట్యాక్స్ ఫ్రీ
- 1 Feb 2026 12:33 PM IST
యూనియన్ బడ్జెట్ 2026లో పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఊరట ప్రకటించింది. సవరించిన ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువును పెంచాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు.
బడ్జెట్ ప్రకారం, ఇప్పటివరకు డిసెంబర్ 31 వరకు ఉన్న రివైజ్డ్ ఐటీఆర్ గడువును మార్చి 31 వరకు పొడిగించనున్నట్లు తెలిపారు. అయితే దీనికి స్వల్ప ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అదేవిధంగా విదేశాల్లో విద్య, వైద్య ఖర్చుల కోసం లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద వర్తించే టీసీఎస్ రేటును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఇంకా చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం 2027 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూల్ ఆధారిత ఆటోమేటెడ్ ప్రక్రియను ప్రవేశపెట్టాలని కూడా ఆర్థిక మంత్రి సూచించారు.
ఈ మార్పులతో పన్ను ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని భావిస్తున్నారు.
- 1 Feb 2026 12:33 PM IST
సివిల్, డిఫెన్స్ విమాన రంగానికి డ్యూటీ మినహాయింపు
యూనియన్ బడ్జెట్ 2026లో విమానయాన రంగానికి కేంద్ర ప్రభుత్వం కీలక ఊతం ప్రకటించింది. సివిల్, రక్షణ విమాన తయారీ రంగాల్లో వృద్ధి, స్వావలంబన పెంచేందుకు కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులు ప్రతిపాదించినట్లు సమాచారం.
బడ్జెట్ ప్రకారం, సివిలియన్ ట్రైనింగ్ విమానాలు సహా ఇతర విమానాల తయారీలో ఉపయోగించే భాగాలు, కాంపోనెంట్స్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
అదేవిధంగా రక్షణ విభాగాల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ పనుల్లో ఉపయోగించే విమాన భాగాల తయారీకి అవసరమైన ముడి పదార్థాల దిగుమతులపై కూడా డ్యూటీ మినహాయింపు వర్తించనున్నట్లు వెల్లడించారు.
ఈ చర్యలతో దేశంలో విమానయాన రంగం మరింత బలోపేతం కావడంతో పాటు స్వదేశీ తయారీకి ప్రోత్సాహం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
- 1 Feb 2026 12:32 PM IST
సీతారామన్ బడ్జెట్ తర్వాత మార్కెట్లు కుప్పకూలాయి; సెన్సె దిగువన 1,000 పాయింట్లు పతనమైంది, నిఫ్టీ 25 వేలకు పడిపోయింది.
- 1 Feb 2026 12:31 PM IST
సీతారామన్ ఐదేళ్ల కాలానికి సిటీ ఎకనామిక్ రీజియన్స్ (CERs) కోసం రూ. 5,000 కోట్లను కేటాయించారు.
- 1 Feb 2026 12:27 PM IST
టెక్సటైల్ రంగానికి చేయూత
కేంద్ర బడ్జెట్ 2026-27 దేశంలో కొత్తగా మూడు కెమికల్ రీసెర్చ్ పార్కులను ఏర్పాటు చేయనుంది. సెమీకండక్టర్ మిషన్ కోసం రూ. 40 వేల కోట్లు కేటాయించారు. జౌళి రంగానికి కూడా కేంద్ర బడ్జెట్ లో చేయూత అందించారు. మెగా టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణం, సెమీ కండక్టర్ మిషన్ 2.0 ప్రారంభం, కొత్త మెగా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు, ఖాదీ, హ్యండ్లూమ్, హస్తకళల ప్రోత్సాహకానికి పథకం, అత్యంత నాణ్యత కలిగిన క్రీడా వస్తువుల తయారీకి పథకం వంటివి ఈ బడ్జెట్ లో భాగంగా ఉన్నాయి.
- 1 Feb 2026 12:25 PM IST
వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకునే పన్ను విధించదగిన అన్ని వస్తువులపై సుంకం రేటును 20% నుండి 10%కి తగ్గించాలని సీతారామన్ ప్రతిపాదించారు.
- 1 Feb 2026 12:22 PM IST
ఐటీ రంగానికి భారీ బూస్ట్
భారతదేశ కేంద్ర బడ్జెట్ ఐటీ రంగానికి భారీ బూస్ట్ ఇచ్చింది. సాఫ్ట్‌వేర్ డెవెలప్‌మెంట్ సేవలు, ఐటీ సేవలు, నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఆర్ అండ్ డీ సేవల్లో భారత్ గ్లోబల్ లీడర్‌గా నిలిచిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
- ఈ రంగాలన్నీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కిందకు తీసుకురానున్నట్లు చెప్పారు.
- అన్ని రకాల ఐటీ సేవలకు 15.5 సేఫ్ హార్బర్ మార్చిన్‌ను అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
- సేఫ్ హార్బర్ అవేలబిలిటీని రూ.300 కోట్ల నుంచి రూ.2వేల కోట్లకు పెంచడం జరిగింది.
- అదే విధంగా ఐటీ సేవల్లో సేఫ్ హార్బర్ అప్రూవల్స్ ఇకపై ఆలోమేటెడ్ పద్దతిలో జరుగుతాయి. ఇందుకు నిబంధనల సిస్టం ఉంటుంది. తద్వారా టాక్స్ అధికారుల పరిశాలనను తొలగించడం జరుగుతుందని వెల్లడించారు.
- 1 Feb 2026 12:15 PM IST
ఐటీఆర్ సవరణకు గడువు పొడిగింపు
యూనియన్ బడ్జెట్ 2026లో పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఊరట ప్రకటించింది. ఆదాయపు పన్ను రిటర్న్‌ల సవరణ, ఫైలింగ్ గడువుల విషయంలో మరింత సమయం ఇవ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు.
బడ్జెట్ ప్రకారం, రిటర్న్‌లను సవరించుకునే గడువును ప్రస్తుతం ఉన్న డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగించనున్నట్లు తెలిపారు. అయితే దీనికి స్వల్ప ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అదేవిధంగా పన్ను రిటర్న్‌ల దాఖలు గడువును విడతలుగా నిర్ణయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఐటీఆర్-1, ఐటీఆర్-2 దాఖలు చేసే వ్యక్తులు జూలై 31 వరకు రిటర్న్ ఫైల్ చేయడం కొనసాగిస్తారని తెలిపారు.
ఆడిట్ అవసరం లేని వ్యాపార కేసులు లేదా ట్రస్ట్‌లకు ఆగస్టు 31 వరకు సమయం ఇవ్వాలని బడ్జెట్‌లో సూచించారు.
ఈ మార్పులతో పన్ను రిటర్న్‌ల ప్రక్రియలో తొందర తగ్గి, పన్ను చెల్లింపుదారులకు మరింత సౌలభ్యం కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
- 1 Feb 2026 12:15 PM IST
చిన్న విదేశీ ఆస్తుల వెల్లడిపై కేసుల మినహాయింపు
యూనియన్ బడ్జెట్ 2026లో చిన్న విలువైన విదేశీ ఆస్తుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఊరట ప్రకటించింది. విదేశాల్లో ఉన్న చిన్న చరాస్తులను వెల్లడించడంలో విఫలమైన వ్యక్తులకు కేసుల నుంచి రక్షణ కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
బడ్జెట్ ప్రకారం, స్థిరాస్తులు కాని విదేశీ ఆస్తుల మొత్తం విలువ రూ.20 లక్షల కంటే తక్కువగా ఉంటే, వాటిని ప్రకటించని వారికి ప్రాసిక్యూషన్ నుంచి ఇమ్యూనిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఈ మినహాయింపు అక్టోబర్ 1, 2024 నుంచి గత తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ నిర్ణయం వల్ల చిన్న విలువ గల విదేశీ ఆస్తులు కలిగిన వారికి అనుసరణ సులభతరం అవుతుందని భావిస్తున్నారు.

