‘బజ్ బాల్’ హైప్ కు నిజంగా విలువుందా?
ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు బజ్ బాల్ . అయితే దానికి నిజంగా అంత ప్రాధాన్యం ఉందా? దానిలోపాలు ఏం లేవా? ఆనలిస్టులు ఏం చెప్తున్నారు.
క్రికెట్, భారత దేశంలో అతిపెద్ద మతం. టెస్ట్, వన్డే, టీ20 గేమ్ ఏదైన ప్రేక్షకులు స్టేడియాలకు పొటెత్తుతారు. కానీ టెస్ట్ క్రికెట్ లో మజా ఉండట్లేదని, దానికి ఆదరణ తీసుకురావడానికి ఇంగ్లీష్ క్రికెట్ టీమ్ ఓ కొత్త వ్యూహాన్ని తీసుకొచ్చింది. దానికో పేరు కూడా పెట్టింది. అదే ‘బజ్ బాల్’. గత ఏడాది ఇంగ్లండ్ తన సొంతగడ్డ మీద ఆస్ట్రేలియాను ఓడించి దీనికి మంచి ఆదరణ దక్కేలా చేయడంలో వారు సఫలం అయ్యారు. అదే వ్యూహాన్ని భారత్ పై ప్రయోగించాలని చూశారు. కానీ ఫలితం ఎలా ఉందంటే..
ప్రస్తుత సిరీస్ పరిశీలిస్తే భారత్ బ్యాటింగ్ చేసిన నాలుగు సార్లు 400 పై చిలుకు పరుగులు సాధించింది. అందులో ఒకసారి 396 పరుగులు సాధించింది. మూడో టెస్ట్ లో ఏకంగా 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ను ఓడించింది. కానీ ఇంగ్లండ్ ఒకసారి మాత్రమే 400 లకు పైగా పరుగులు సాధించింది. రెండు సార్లు త్వరగా ఆలౌట్ అయింది. ఇది బజ్ బాల్ క్రికెట్ అంటే ఎలా ఉంటుంది.
‘బజ్ బాల్’ అనే పేరు ఎలా వచ్చింది
కొంతమంది రచయితలు దీనిని ఎక్కువగా వాడుతున్నారు. అయితే దీనిని సృష్టించింది మాత్రం ఇఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో ఎడిటర్, ఇంగ్లండ్ కు చెందిన ఆండ్రూ మిల్లర్. మెక్ కల్లమ్ వచ్చిన తరువాత దీనిని ఎక్కువగా వాడుకలోకి తీసుకొచ్చారు. తరువాత కొంతమంది రచయితలు తామెక్కడ వెనకబడి పోతావేమో అని బజ్ బాల్ అనే పేరును వాడడం మొదలుపెట్టారు.
ఇంగ్లండ్ కోచ్ గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ బాధ్యతలు చేపట్టాక దీనిని అమలు చేయడం ప్రారంభించాడు. ఇంగ్లండ్ కెప్టెన్ గా బెన్ స్టోక్స్ వచ్చాక అతనితో మాట్లాడి వ్యూహాన్ని ఖరారు చేశారు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. వీరిద్దరు న్యూజిలాండ్ కు చెందిన వారు కావడం గమనార్హం. తనకు టెస్ట్ ల్లో కొత్త విధానం ఉండాలని స్టోక్స్ కూడా అనుకోవడంతో ఇది ఇంగ్లండ్ లో అమలయింది.
బజ్ బాల్ ప్రకారం టెస్ట్ క్రికెట్ లో దూకుడుగా ఉండడం. ఎంతటి లక్ష్యాన్ని అయినా చేజింగ్ చేయడం దీని ఉద్దేశం. వన్డే క్రికెట్, టీ20 క్రికెట్ లో ఎలా బ్యాటింగ్ చేస్తారో.. ఇక్కడ ఇదే విధానాన్ని అవలంభించాలి. మొదట దీన్ని బేస్ బాల్ అని పిలిచేవారు. మెక్ కల్లమ్ దీన్ని బజ్ బాల్ అని పిలవడం ప్రారంభించారు. ఇక్కడ ఢిపెన్స్ క్రికెట్ ఆడడం నిషేధం. అంటే చతేశ్వర పుజారా లాంటి ఆటను ప్రొత్సహించదు.
టెస్ట్ బ్యాటింగ్ సగటు పెరుగుతుందా?
టెస్ట్ క్రికెట్ లో బజ్ బాల్ ఆట వచ్చాకే బ్యాటింగ్ సగటు మెరుగుపడుతుందా? కాదని కొంతమంది నిఫుణులు చెబుతున్న మాట. కాలంతో పాటు ఆటతీరులో, వేగంలోను మార్పు వచ్చిందని కొన్ని గణాంకాలను ఈ విశ్లేషకులు చూపుతున్నారు. హిందూస్థాన్ టైమ్ లో సోమ్ శూవరా ‘ ది డైయింగ్ ఆఫ్ టెస్ట్ బ్యాటింగ్’ అనే ఒక వ్యాసాన్ని ప్రచురించాడు.
అతని ప్రకారం.. బ్యాటింగ్ సగటు పెరుగుతూ ఉంది. బ్యాట్స్ మెన్ విడిచిపెట్టే బాల్స్ సంఖ్య తగ్గుతూ వస్తోంది. పరుగుల సంఖ్య పెరుగుతోంది. వ్యక్తిగత ఆటతో మొదలు, టీమ్ ల ఆటతీరు కూడా మెరుగవుతోంది. అయితే ఇవన్నీ బజ్ బాల్ అనే పేరు రావడాని కంటే ముందే జరిగిందని వివరించే ప్రయత్నం చేశాడు.
2000 సంవత్సరం కంటే ముందు టెస్ట్ బ్యాటింగ్ సగటు 27.5 ఉండగా.. గడిచిన 23 సంవత్సరాలలో అది 32.1 కు పెరిగింది. అలాగే స్ట్రైక్ రేట్ కూడా 42.4 నుంచి 55.8 కు పెరిగింది. అయితే టీ20 క్రికెట్ వల్ల ఆటలో వేగం పెరగడం, బ్యాట్స్ మెన్ ఆత్మ విశ్వాసం పెరగడంతో షాట్ల ఎంపికలో తేడాలు వచ్చి ఆటతీరు మెరుగైందని ఆయన చెబుతున్నారు.
ఆధునిక కాలంలో లభించే అత్యున్నత శిక్షణ కూడా అన్ని ఆటతీరుల్లో మార్పుల తీసుకు వచ్చింది. అంతుకుముందే ఏథెన్స్ ఒలంపిక్స్ లో మారథాన్ పూర్తి చేయడానికి ఆటగాళ్లు దాదాపు 2/58:50 సెకన్స్ తీసుకునే వారు.. అయితే కొన్ని రోజుల క్రితం కార్ ప్రమాదంలో మరణించిన కెల్విన్ మొన్నటి ఒలంపిక్స్ 2.01 గంటల్లోనే మారథాన్ పూర్తి చేశాడు. అంటే కాలానికి తగ్గట్లు ఆటగాళ్లు,ఆట మారుతోంది.
మాజీలు ఏమంటున్నారంటే..
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ ‘ది టైమ్స్’ లో ఒక వ్యాసం రాస్తూ 2023 లో జరిగిన యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ లో బజ్ బాల్ వ్యూహం సరిగా పనిచేయలేదని అభిప్రాయపడ్డారు. రూట్ తన సహజ శైలికి భిన్నంగా ఆడి 46 పరుగుల వద్ద నిష్ర్కమించాడని, దానివల్ల ఇంగ్లండ్ ఇబ్బందులు పడిందని చెప్పుకొచ్చాడు. అలాగే లార్డ్స్ టెస్ట్ లో బజ్ బాల్ క్రికెట్ లో షార్ట్ బాల్ లో మూడు వికెట్లు పడగొట్టారని అయితే ఇది బజ్ బాల్ గేమేనా అని సందేహం కూడా వ్యక్తం చేశారు.
క్రీడలలో ఏదైనా విప్లవాత్మక వ్యూహాన్ని ఆలోచించాలి. ప్రతి గేమ్ లలో కూడా వ్యూహత్మక మార్పులు ఉండవచ్చు. తీవ్రంగా విభేదిస్తే మాత్రం గెలుపుకంటే నష్టాలే ఎక్కువ అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మరికొంత మాజీలు ఆటలో మానసిన స్వేచ్చను స్వీకరించలేదని, స్వీకరించాలని రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
చాలామంది క్రికెట్ విశ్లేషకులు బజ్ బాల్ కు ఆటను మార్చే శక్తి ఉందని దానికి కితాబు ఇచ్చేశారు. అయితే ఇలాంటి ఆటను ఇదివరకు కెన్నడూ ప్రయోగించలేదు. కనీసం వ్యక్తిగతంగా ఆటగాళ్లు కూడా ప్రయత్నించలేదు. అయినప్పటికీ అనలిస్టులు దీనికి ఆటను మార్చే శక్తి ఉందని చెప్పడం ఏంటో.
టెస్ట్ క్రికెట్ లో ఏ బ్యాట్స్ మెన్ వేగంగా పరుగులు సాధించాలని అనుకోరు. ఎందుకంటే వారికి తగినంత సమయం ఉంటుంది. కనీసం 30-40 ఓవర్ల పాటు క్రీజులో నిలబడాల్సి ఉంటుంది. అంతసేపు శక్తిని నిలుపుకుని బ్యాటింగ్ చేయడం సాధ్యమవుతుందా? టీ20లో ఎంత పెద్ద స్కోర్ అయిన చేజ్ చేసే రీతిలో ఆటలు సాగుతున్నాయి.
అయితే ఐదు రోజుల పాటు సాగే టెస్ట్ మ్యాచ్ జరిగిన పిచ్ నాసిరకంగా తయారవుతుంది. అలాంటి దానిపై ఎలా ఆడతారు. ఇది గెలుపు, ఓటములపై ప్రభావం చూపదా? గెలుపులో ఎప్పుడు వ్యూహాలు ఉండాలి. కానీ అది పరిస్థితులకు తగ్గట్లు ఉండాలి. ప్రత్యర్థి బలం, పిచ్, వాతావరణం, ఇంకా ఆటలో ప్రభావం చూపే అంశాలు కీలకపాత్ర పోషిస్తాయి. వాటిని అంచనా వేస్తూ వ్యూహాలు ఉండాలి.
Next Story