తిరుమలలో మళ్లీ చిరుత కలకలం
x
ప్రతీకాత్మక చిత్రం

తిరుమలలో మళ్లీ చిరుత కలకలం

తిరుమల కాలిబాటలో మరోసారి చిరుత కలకలం చెలరేగింది. అలిపిరి కాలి బాటలో మరో చిరుతపులి కనిపించింది. దీంతో తిరుమలకు వెళ్లే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.


తిరుమల కాలిబాటలో మరోసారి చిరుత కలకలం చెలరేగింది. అలిపిరి కాలి బాటలో మరో చిరుతపులి కనిపించింది. దీంతో తిరుమలకు వెళ్లే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో నడక మార్గంలో చిరుత కదలిలు కనిపించడంతో అధికారులు ప్రయాణీకులను అప్రమత్తం చేశారు. అటవీ శాఖ అధికారులు ప్రయాణీకుల భద్రతకు ఎటువంటి ముప్ప లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. చిరుతను పట్టుకోవడానికి బోన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు నాలుగు చిరుతలను పట్టుకున్నారు. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉండడంతో చిరుతలు తిరుమల కొండకు చేరుకుంటున్నాయని అటవీ శాఖ విభాగం తెలిపింది.

గతంలోనూ చిరుతల సంచారం..

తిరుమల నడక మార్గంలో ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు వెళుతుంటారు. తిరుమలలో ఇటీవల కాలంలో తరచూ చిరుతలు యాత్రికులను భయపెడుతున్నాయి. గతంలో ఓ బాలుడిపై దాడి చేయడం, ఆతర్వాత మరో చిన్నారిని చంపేయడంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. టీటీడీ, ఫారెస్ట్‌ అధికారులు ఉమ్మడిగా ఆపరేషన్‌ చేపట్టారు. ఇప్పటికి నాలుగైదు చిరుతల్ని కూడా పట్టి వేశారు. దారిపొడవునా బోన్లను కూడా ఏర్పాటు చేశారు. మళ్లీ ఇప్పుడు నడక మార్గంలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపింది. గతంలో నరసింహ స్వామి ఆలయం నుంచి 7వ మైలు ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచరించినట్టు అటవీశాఖ గుర్తించారు. టీటీడీ ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుతల్ని పట్టివేశారు.

Read More
Next Story