
ట్రంప్ 2 వారాల కాల్పుల విరమణ, టాక్స్ కు ఇరాన్ ఒకె
హార్ముజ్ జలసంధి తెరచేందుకు అంగీకారం, విజయం సాధించామన్న ఇరాన్
గల్ఫ్ లో అగ్ని వర్షానికి ఆగింది. ఇరాన్ సివిలిజేషన్ ఈ రాత్రికి మొత్తానికి మొత్తం తుడిచేస్తారని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు రెండు వారాల కాల్పుల విమరణ ప్రతిపాదన చేశారు. ఇరాన్ దీనికి అంగీకరించింది. ట్రంప్ ప్రతిపాదనకు జవాబుగా హార్ముజ్ జలసంధి తెరించేందుకు నిర్ణయించింది. శుకక్రవారం నాడు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ చర్చలు జరుగుతాయి. కాల్పులను విరమణ మీద ట్రంప్ చేసిన ప్రకటనను అమెరికా అధ్యక్ష భవన ’వైట్ హౌస్’ ట్వీ ట్ చేసింది.
🚨 President Donald J. Trump makes a statement on Iran: pic.twitter.com/9mqTayL0Q3
— The White House (@WhiteHouse) April 7, 2026
ప్రపంచ చమురు రవాణాకు కీలకమయి హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసి వేయడంతో మొదట ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిన ట్రంపు బూతు మాట్లాడుతూ ఏన్ని హెచ్చరికలు చేసినా ఇరాన్ దిగిరాలేదు. ఇరాన్ ని మొత్తంగా ధ్వంసం చేస్తామని చెప్పినా, దేశాన్ని కాపాడుకునేందుకు 14 మిలియన్ల ఇరానియన్లు ప్రాణ త్యాగానికి సిద్ధమని ఇరాన్ ప్రకటిచింది.
అమెరికా ప్రతిపాదనని ఇరాన్ తన యుద్ధవిజయంగా ప్రకటిచింది. అందుకే హార్ముజ్ తెరిచేందుకు అంగీకరించినా పూర్తిగా ఇరాన్ సైనిక పర్యవేక్షణలోనే నౌకలను అనుమతించడం జరుగుతుందని ప్రకటించింది.
అమెరికా యుద్ధ లక్ష్యాలను సాధించిందని, అందుకే ఇపుడు దౌత్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని ట్రంప్ తన ప్రకటనలో చెప్పుకొచ్చారు. ఇరాన్ నాగరికతను రూపుమాపతామని మంగళవారం నాడు ట్రంప్ ప్రటించాక, పాకిస్తాన్ ఒక దశసూత్ర పథకాన్ని కాల్పుల విరమణ కోసం ప్రతిపాదించి ట్రంప్ కు పంపింది. పాకిస్తాన్ ఒక ఆచరణ సాధ్యమయిన ప్రతిపాదన చేసిందని, దాని మీద చర్చలు సాగించవచ్చని చెబుతూ ట్రంప్ తన సహజరీతిలో మరొక కోత కోశాడు. ఈ కొత్త రెండు వారాల డెడ్ లైన్ లోపు ఇరాన్ అమెరికాతో ఒప్పందం చేసుకొనకపోతే కాల్పుల విపరీతంగా జరపాల్సి వస్తుందని అన్నాడు.
ఈ నేపథ్యంలొో అనూహ్యంగా మంగళవారం నాడు ట్రంప్ కాల్పుల విరమణప్రతిపాదన చేశారు. తాను విధించిన డెడ్ లైన్ గడువు రెండు గంటల్లో ముగియ బోతుండగా పాకిస్తాన్ చేసిన ప్రతిపాదనను అందుకుని అని బెదిరింపులను ట్రంప్ ఉపసంహరించుకున్నాడు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తే, గుట్టుచప్పుడుకాకుండా చైనా రంగంలోకి దిగి ఇరాన్ ను ఒప్పించినట్లు తెలుస్తున్నది. ఇరాన్, చైనాలు కీలకమయిన వాణిజ్యభాగస్వాములు. అందుకే చైనా రంగంలోకి దిగింది. మీడియా రిపోర్టుల ప్రకారం చైనా సూచలన మేరకే పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్టు దేశాలు కూడా కాల్పుల విరమణ సాధించేందుకు, హార్ముజ్ జలసంధి తెరిచేందుకు తెరవెనక నుంచి కృషి చేస్తూ ఉన్నాయి.
ట్రంపు కాల్పుల విరణమ ప్రకటను బదులు గా తామూ జలసంధిని రెండు వారాల పాటు తెరుస్తామని ఇరాన్ ప్రకటించింది. అయితే, జలమార్గం గుండా ప్రయాణించే నౌకలమీద ఇరాన్ మిలిటరీ పర్యవేక్షణ ఉంటుందని ఆదేశ విదేశాంగ శాఖ షరతు విధించింది. శుక్రవారం నాడు ఇస్లామాబాద్ లో అమెరికా-ఇరాన్ దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతాయని, అవసరమయితే, కాల్పుల విమరణను పొడించేందుకు చూస్తామని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ (Supreme National Security Council) ప్రకటించింది.
పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీప్ నిన్న దాడులను ఉధృతం చేసేందుకు విధించిన గడువును పొడిగించాలని, ఇదే విధంగా ఇరాన్ కూడా జలసంధిని తెరవాలని చేసిన విజ్ఞప్తులతో రాజీ దౌత్యం మొదలయింది.
ట్రంప్ కాల్పలు విరమణ ప్రకటించినా, గల్ఫ్ లో ఇజ్రేల్ మిసైల్స్ ను ప్రయోగిస్తూ నే ఉంది. అమెరికా కాల్పుల ను నిలిపి వేసిందని ఆదేశం ప్రకటించింది. అయితే, ఇజ్రేల్ సైనికాధికారులు మాత్రం కాల్పులు కొనసాగుతున్నట్లు ప్రకటించారు.
శాంతిచర్చలకు శుక్రవారం నాడు ఇస్లామా బాద్ కురావాలని అమెరికా, ఇరాన్ దేశాలను పాకిస్తాన్ ఆహ్వానించింది.

