
తిరుపతి లడ్డుకు నెయ్యి కొరత లేదు
లడ్డూ ప్రసాదాల కోసం నెయ్యి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి, భక్తులకు ఎలాంటి అంతరాయం లేదన్న టీటీడీ.
కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామికి ప్రసాదం తయారీకి కావాల్సిన నిల్వలు లేవన్న వార్త కొన్ని రోజులుగా తీవ్ర ప్రచారం జరుగుతున్నాయి. లడ్డూ తయారీకి కూడా నెయ్యి నిల్వలు సరిపోవంటూ అనేక వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై తిరుమల తిరుపతి బోర్డ్ స్పందించింది. తిరుపతిలో నెయ్యి కొరతేలేదని స్పష్టం చేసింది. శ్రీవారి లడ్డూలకు కావాల్సినంత నెయ్యి నిల్వలు ఉన్నాయని వెల్లడించింది.
తిరుమలలో భక్తులకు లడ్డూ ప్రసాదాలు అందజేసే టిటిడి, నెయ్యి నిల్వలు సమృద్ధిగా ఉన్నట్లు స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో టిటిడి వద్ద నెయ్యి నిల్వలు లేవని, లడ్డూ తయారీకి అంతరాయం ఏర్పడుతోందని వ్యాప్తి చెందిన అసత్య ప్రచారాలను టిటిడి ఖండించింది. లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి మూడంచెల కొనుగోలు విధానం ద్వారా సరఫరా అవుతోంది. ఒకే సంస్థపై ఆధారపడకుండా మూడు వేర్వేరు సంస్థల ద్వారా సరఫరా జరుగుతుంది.
అందువల్ల ఏదైనా అనుకోని పరిస్థితి ఏర్పడినా, నెయ్యి సరఫరాలో అంతరాయం రావడం లేదు. ఇందాపూర్ డైరీ నుండి వచ్చిన నెయ్యి ట్యాంకర్ కడప జిల్లా కొండాపూర్ సమీపంలో ప్రమాదానికి గురయింది. అయితే, టిటిడి ప్రకారం, ఒక సంస్థ ట్యాంకర్ ప్రమాదం జరిగినప్పటికీ మిగిలిన రెండు సంస్థల ద్వారా సరఫరా యథావిధిగా కొనసాగుతోంది. ప్రస్తుతం భక్తులకు పంపిణీ చేయడానికి సుమారు 7 లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్ధంగా ఉన్నాయి.
వేసవి కాలంలో భక్తుల రద్దీ పెరగే అవకాశం దృష్టిలో ఉంచుకుని, టిటిడి ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. లడ్డూ తయారీకి ఉపయోగించే యంత్రాల నిర్వహణ, కన్వేయర్ బెల్ట్‌ల మరమ్మత్తులు సంబంధిత సంస్థల ద్వారా క్రమంగా జరుగుతున్నాయి. అందువల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. టిటిడి పేర్కొన్నది, అసత్య ప్రచారాలను నమ్మకుండా భక్తులు, ప్రజలు లడ్డూ ప్రసాదాల తయారీకి ఎలాంటి అంతరాయం రాలేదని గుర్తుంచుకోవాలి. భక్తులకోసం ప్రసాదాలు పూర్తి స్థాయిలో సురక్షితంగా, నిరవధికంగా అందిస్తున్నట్లు టిటిడి మరోసారి హామీ ఇచ్చింది.

