నాగపూర్ జైలు నుంచి ప్రొఫెసర్ సాయిబాబా విడుదల
x
జైలు నుంచి బయటకు వస్తున్న జీఎస్ సాయిబాబా

నాగపూర్ జైలు నుంచి ప్రొఫెసర్ సాయిబాబా విడుదల

తన భర్త అమాయకుడని, ఆయనకు ఏం తెలీదని మొదటి నుంచీ చెప్తూనే ఉన్నామని, దాన్ని ధర్మాసనం నిరూపించిందని సాయిబాబా భార్య వసంత అన్నారు. మరి, ఆ పదేళ్లు మాటేమిటి ఆమె ప్రశ్న




మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో పదేళ్లు జైలులో మగ్గిన ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కొద్ది సేపటి కిందట నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి విడదల అయ్యారు.






ఈ సందర్భంగా సాయిబాబ భార్య వసంత స్పందన
తన భర్తను నిర్దోషిగా విడుదల చేస్తూ హైకోర్టు ప్రకటించడం అనివార్యమమే.. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన సతీమణి వసంత కుమారి చేసిన వ్యాఖ్య ఇది. కానీ ఈ కేసు తమ జీవితాల్లో పదేళ్ల కాలాన్ని వృధా చేసిందని తెలిపారు. సాయిబాబాకు విధించిన జీవిత ఖైదును కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిన సందర్భంగా ఆమె మీడియాతో ఇలా మాట్లాడారు. తన భర్త అమాయకుడని, ఆయనకు ఏం తెలీదని మొదటి నుంచీ చెప్తూనే ఉన్నామని, దాన్ని ఈ రోజున ధర్మాసనం నిరూపించిందని సంతోషించారు.

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో జీఎన్ సాయిబాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు సెషన్స్ కోర్టు 2017లో జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత 14 అక్టోబర్ 2022న బాంబే హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్‌.. సాయిబాబాను నిర్దోషిగా తేల్చింది. సుప్రీం కోర్టు మాత్రం ఈ తీర్పును అంగీకరించలేదు. వెంటనే నాగ్‌పూర్ ధర్మాసనం ఇచ్చిన సాయిబాబా విడుదల తీర్పును రద్దు చేసింది. ఈ కేసును ఫ్రెష్‌గా మరోసారి పునఃపరిశీలించాలని బాంబే హైకోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 5 మార్చి 2014న సాయిబాబా సహా మరో ఐదుగురికి న్యాయస్థానం విచారించి, మరోసారి వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థ వైఫల్యమేనని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సాయిబాబాను బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ రెండోసారి కూడా నిర్దోషిగా విడుదల చేయడాన్ని తీర్పు ఇచ్చిన రోజే రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. అయితే నిర్దోషిగా తేలినప్పటికీ సంబంధిత ఆధారాలు అందని కారణంగా మరుసటి రోజే సాయిబాబాను విడుదల చేయలేదని నాగ్‌పూర్ సెంట్రల్ జైలు వర్గాలు తెలిపాయి.






అహింస నా భర్త సిద్ధాంతం: వసంత కుమారి

తన భర్త అమాయకుడని సాయిబాబా భార్య వసంత కుమారి పునరుద్ఘాటించారు. అహింస అనేది తన భర్త సిద్ధాంతమని, హింస ద్వారా హింసే పుడుతుంది తప్ప శాంతి రాదని ఆయన గట్టిగా నమ్ముతారని ఆమె వెల్లడించారు. ‘‘మా జీవితాల్లో పదేళ్లు వృధా అయ్యాయి. నా భర్త సహా మిగిలిన ఐదుగురికి ప్రాసిక్యూట్ చేయడానికి ఇచ్చిన అనుమతులు చట్టవ్యతిరేకమైనవని హైకోర్టు తీర్పు తేటతెల్లం చేస్తోంది. దీని అర్థం వారందరినీ ఇన్నాళ్ల పాటు (2014 నుంచి) అరెస్ట్ చేసి ఉంచడం చట్టవ్యతిరేకమే. వాళ్లని అసలు తొలుత దోషులుగా నిర్ధారించడానికి ఆస్కారం కూడా ఉండదు. మా కేసు చాలా బలంగా ఉందని అంతా నమ్మాం. అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగాం. నా భర్తకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు. ఒక సిద్ధాంతాన్ని కలిగి ఉండటం నేరం కాదు కదా. దీనికి హైకోర్టు కూడా అంగీకరించింది.’’

నా భర్త ప్రశ్నించింది అప్పుడే

ఏం జరిగినా మౌనంగా ఉండే తన భర్త ప్రజల ప్రాథమిక హక్కులను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించినప్పుడే ఆయన ప్రశ్నించారని తెలిపారు వసంత కుమారి. తన భర్త విడుదలకు ప్రాసిక్యూషన్ ఇకమీదట ఎటువంటి అడ్డంకులు కలిగించదని ఆశాభావం వ్యక్తం చేశారు. అరెస్ట్ సమయంలో ఆయనకు కేవలం హైపర్ టెన్షన్ ఉండేదని, ఇప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.


Read More
Next Story