
ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐడేటా సెంటర్
ఫ్యూచర్ సిటీలో రు. 5 వేల కోట్ల పెట్టుబడితో(AI Data Center) ఏఐడేటా సెంటర్ ఏర్పాటుకు నిర్ణయమైంది
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కలల సిటి ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల సామర్ధ్యంతో ఒక ఏఐడేటా సెంటర్ ను ఏర్పాటుచేయటానికి (Nederland)నెదర్లాండ్స్ కు చెందిన యూపీసీ కంపెనీ ఒప్పందం చేసుకుంది. (Davos)దావోస్ లో పెట్టుబడుల సదస్సులో రేవంత్ అనేక దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం యూపీసీ వోల్ట్ సీఈవో హాన్ డీ గ్రూట్, యూపీసీ రెన్యువబుల్స్ ఏపీఏసీ సహ వ్యవస్ధాపకుడు స్టీవెన్ జ్వాన్, యూపీసీ రెన్యువబుల్స్ ఇండియా సీఈవో అలోక్ నిగమ్ తో (Revanth)రేవంత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో (Future City) ఫ్యూచర్ సిటీలో రు. 5 వేల కోట్ల పెట్టుబడితో(AI Data Center) ఏఐడేటా సెంటర్ ఏర్పాటుకు నిర్ణయమైంది.
నెదర్లాండ్స్ కు చెందిన యూపీసీ రిన్యూవబుల్స్ గ్రూప్, వోల్ట్ డేటా సెంటర్స్ కలిసి యూపీసీ వోల్ట్ సంస్ధగా మారింది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తెలంగాణ ఏఐడేటా సెంటర్ ఏర్పాటుకు అనువైనదిగా సీఈవో హాన్ డీ గ్రూట్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టును ఐదేళ్ళల్లో రు. 5 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయమైంది. అంటే ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడికి కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు గ్రూట్ తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ దశలోనే ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 వేలమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని గ్రూట్ హామీ ఇచ్చారు. డేటా సెంటర్ ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందన్నారు.
రేవంత్ మాట్లాడుతు 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్ధగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు. అధునాతన ఏఐడేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలను తమ ప్రభుత్వం అందిస్తుందని రేవంత్ హామీ ఇచ్చారు.

