సుక్మాలో ఎదురుకాల్పులు.. 16 మంది నక్సలైట్‌ల దేహాలు స్వాధీనం..
x

సుక్మాలో ఎదురుకాల్పులు.. 16 మంది నక్సలైట్‌ల దేహాలు స్వాధీనం..

మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య తీవ్ర కాల్పులు కొనసాగుతున్నాయి. మరింత మంది నక్సలైట్‌లు మృతి చెందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోని దండకారణ్యాన్ని శనివారం ఉదయం కాల్పుల మోత మోహరించింది. భద్రతా సిబ్బంది, నక్సలైట్ల మధ్య జరిగిన ఎదురుకాల్పులతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఈ కాల్పుల్లో 16 మంది నక్సలైట్లు మరణించారు. వారి మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుకాల్పులు చేశారు. ఈ ఎదురుకాల్పుల్లో 16 మంది మావోలను మట్టుబెట్టారు పోలీసులు. అనంతరం వారి స్థావరాల నుంచి

ఎదురుకాల్పుల ప్రదేశంలో భారీ సంఖ్యలో AK-47, SLR, INSAS రైఫిల్, .303 రైఫిల్, రాకెట్ లాంచర్, BGL లాంచర్ వంటి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. DRG సుక్మా/CRPF సంయుక్త బలగాలు బీజాపూర్ ఆపరేషన్‌ నిర్వహించాయి. ఎదురుకాల్పుల్లో DRG కి చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన జవాన్ల పరిస్థితి స్థిరంగా ఉంది. శనివారం ఉదయం 08:00 గంటల నుండి మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య తీవ్ర కాల్పులు కొనసాగుతున్నాయి. మరింత మంది నక్సలైట్‌లు మృతి చెందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఇంకా సెర్చింగ్, గస్తీ కొనసాగుతోంది.

Read More
Next Story