‘మేం మీ కోసం ఇంకా ఎంత కాలం వేచి చూడాలి? ’
పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఉప ఎన్నికలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమతో శాసనసభలోనే ప్రమాణ స్వీకారం చేయించాలని పట్టుబడుతున్నారు.
పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఉప ఎన్నికలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమతో శాసనసభలోనే ప్రమాణ స్వీకారం చేయించాలని పట్టుబడుతున్నారు.
బారానగర్ ఎమ్మెల్యే సయంతిక బందోపాధ్యాయ, భగబంగోలా శాసనసభ్యుడు రాయత్ హుస్సేన్ గత ఐదురోజులుగా అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కూర్చుని ‘మేం గవర్నర్ కోసం ఎదురుచూస్తున్నాం’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు.
గత బుధవారం రాజ్‌భవన్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారానికి గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఆహ్వానించారు. అయితే ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించారు. రాజ్‌భవన్‌లో కాకుండా అసెంబ్లీలోనే ప్రమాణం చేయించాలని పట్టుబడుతున్నారు.
ఉపఎన్నికల విజేతల విషయంలో సభాపతి లేదా డిప్యూటీ స్పీకర్‌తో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉందంటూ వారు గవర్నర్ ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు సమాచారం.
స్పీకర్ బిమన్ బెనర్జీ మాట్లాడుతూ.. 'అసెంబ్లీకి రావాలని, ఇద్దరు ఎమ్మెల్యేలతో స్వయంగా ప్రమాణం చేయించాలని గవర్నర్‌ను కోరుతున్నాం.’ అని పేర్కొన్నారు. ఈ సమస్య వీలైనంత త్వరగా పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్లు టిఎంసి సీనియర్ నాయకుడు ఒకరు పేర్కొన్నారు.