‘‘సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి 366 రైళ్లు ’’ : జీఎం
x

‘‘సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి 366 రైళ్లు ’’ : జీఎం

సాధారణ బోగిల సంఖ్య పెంచామన్న ఎస్సీఆర్


సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి సంక్రాంతి, ఇతర పండగల సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఉన్న సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 188 రైళ్లను నడుతున్నామని, అలాగే ఈ జోన్ నుంచి మరో 178 రైళ్లు నడుస్తున్నాయని ఇలా మొత్తంగా 366 సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

వీటిని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరింది. తన పరిధిలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల అవసరాలు, డిమాండ్లకు అనుగుణంగా సర్వీలు నడుపుతున్నామని ఆ సంస్థ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. కొత్తగా ప్రారంభించిన చర్లపల్లి టెర్మినల్ నుంచి 59 సర్వీసులు ప్రారంభించామని సౌత్ సెంట్రల్ రైల్వే వివరించింది.

ప్రయాణికుల అవసరాల నిమిత్తం రిజర్వేషన్ బోగిలతో పాటు సాధారణ కోచ్ ల సంఖ్యను సైతం పెంచామని పేర్కొంది. ముఖ్యంగా జనవరి నెలలో రద్దీకి అనుగుణంగా అనేక సేవలను తాము అందిస్తున్నామని పేర్కొంది. ఆపరేషన్ ఆఫ్ సంక్రాంతి పేరుతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి నిరంతరం రైల్వే శాఖ కృషి చేస్తున్నట్లు చెప్పుకుంది.
చర్లపల్లి నుంచి ఎక్కువగా నర్సాపూర్, కాకినాడ, శ్రీకాకుళం ప్రాంతాలకు రైళ్లు నడుస్తున్నాయని, ఇక్కడ నుంచి జన్ సాధారణ్ రైళ్లు ఆపరేట్ చేస్తున్నట్లు తెలిపింది. అలాగే చర్లపల్లి నుంచి విశాఖ పట్టణం వెళ్లే సర్వీస్ ను ఇక్కడ నుంచే ప్రారంభించినట్లు తెలిపింది.
చాలామంది ప్రయాణికుల కోసం టికెట్ల రేట్లు తక్కువగా ఉండటంతో సాధారణ బోగిలలో ప్రయాణించడానికి వస్తారని, వారికి అనుగుణంగా వాటి సంఖ్యను పెంచినట్లు వెల్లడించింది. ప్రయాణికులు వివిధ మార్గాల్లో టికెట్లను కొనుగోలు చేసుకునే సౌలభ్యం కూడా కల్పించామని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని ఆకాంక్షించింది.
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు మరో నాలుగు అదనపు చైర్ కార్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. వెయిటింగ్ లిస్ట్ భారీగా ఉండటం ప్రయాణికుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపింది.
సికింద్రాబాద్ నుంచి ప్రముఖ ప్రదేశాలకు రైళ్లు నడుస్తున్నాయని ఉదాహారణకు తిరుపతి, మచిలీపట్నం, జైపూర్, మధురై, కటక్, గోరక్ ఫూర్ వంటి ప్రాంతాలకు సర్వీసులు ఉన్నాయని వివరించించింది. ఇవే కాకుండా నెల్లూర్, విజయవాడ, వరంగల్ , రాజమండ్రి వంటి ప్రాంతాలకు సాధారణ సర్వీసులతో పాటు ఇతర జోన్ స్టాపులు ఉన్నాయని తెలిపారు. వాటిని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరింది.
Read More
Next Story