తెలంగాణలో 600 వీధికుక్కల సామూహిక హత్య
x

తెలంగాణలో 600 వీధికుక్కల సామూహిక హత్య

కలకలం రేపుతున్న వీధికుక్కల అకస్మిక సామూహిక మరణాలు, విషప్రయోగమని అనుమానం


తెలంగాణలోని పలు గ్రామాల్లో ఉన్నట్లుండి వీధి కుక్కల మృత దేహాలు వందల సంఖ్యలో కనిపించడం కలకలం రేపుతూ ఉంది. హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లోీ ఈ దుర్ఘటనలు నమోదయ్యాయి. ఈ జిలాల్లోని పలు గ్రామాల పరిధిలో వారం రోజుల్లోనే దాదాపు 500 నుంచి 600 వరకు వీధి కుక్కలు చనిపోయి ఉండటం కనిపించింది. ఇంత పెద్ద ఎత్తున కుక్కులు మృతి చెందడం సాధారణంగా జరగదు. వీటిమీద విష ప్రయోగం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కొన్నికోట్ల సామూహికంగా పూడ్చేశారు.

వీధి కుక్కల ఫౌండేషన్ 'స్ట్రే యానిమల్స్ ఫౌండేషన్ ఇండియా' (SAFI) ప్రతినిధులు ఈ ఘోరాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈ జిల్లాలలో పర్యటించి కుక్కల మరణాలకు సంబంధించిన విషయాలను ఈ సంస్థ ప్రతినిధులు సేకరించారు.

కామారెడ్డి జిల్లా కు సంబంధించి మాచారెడ్డి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఫరీద్‌పేట, బండ రామేశ్వర్‌పల్లి, పాల్వంచ, వాడి, భవానీపేట గ్రామాల్లో వందలాది కుక్కలను చంపి పూడ్చి పెట్టారని జంతు హక్కుల సంఘం కార్యకర్తలు మూల రజని, అనపోలు అనిత, భానుప్రకాశ్‌, గోవర్ధన్‌ లు మీడియాకు తెలిపారు.

ఫౌండేషన్ ప్రతినిధి అధికారి గౌతమ్ మీడియాతో మాట్లాడుతూ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఆయన కొన్ని ఆసక్తి కరమయిన విషయాలను వెల్లడించారు.

తెలంగాణ ప్రాంతాల్లో అనేక చోట్ల కోతులు కుక్కల బెడద ఉన్నవిషయం తెలిసింది. ఇటీవల ముగిసిన సర్పంచుల ఎన్నికల సమయంలో ఇది క్యాంపెయిన్ అంశం అయింది. ఈ కుక్కల, కోతుల బెడద లేకుండా చేస్తామని, తమని గెలిపించాలని ప్రచారం చేశారు. ఎన్నికలయిన తర్వాత ఈ వాగ్దానం నెరవేర్చేందుకు ఎన్నికైన ప్రతినిధులు చట్టాన్ని ఉల్లంఘించి ఈ నేరం చేశారని ఆయన ఆరోపించారు. ఇతర గ్రామాలలో ఇదే విధంగా మూగజీవులపై హింసకు పాల్పడే అవకాశం ఉందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటలను వెలుగులోకి వచ్చాక పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ దారుణానికి పాల్పడినవారిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.

తాజాగా కామారెడ్డి జిల్లాలో దాదాపు 200 వీధి కుక్కలను చనిపోయాయి. ఈ ఘోరం మీద ఆరుగురు మీద కేసులు నమోదు చేశారు. ఇందులో మ ఐదుగురు సర్పంచులు. కుక్కల మృతి విషప్రయోగం కారణమై ఉండవచ్చని అధికారులుఅనుమానిస్తున్నారు.

‘‘గత సంవత్సరం డిసెంబర్‌లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు కొంతమంది అభ్యర్థులు వీధి కుక్కలు, కోతుల బెడదను పరిష్కరిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. వారు ఇప్పుడు వీధి కుక్కలను చంపడం ద్వారా ఆ వాగ్దానాలను నెరవేరుస్తున్నారు’’ అనేది సర్వత్రా వినపడుతున్న వాదన.

హన్మకొండ జిల్లా శాయంపేట సర్పంచ్‌తో సహా తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జనవరి 9న 'స్ట్రే అనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా' నుంచి ఒక ఫిర్యాదు తమకు అందిందని, సుమారు 300 కుక్కలను సర్పంచ్, ఉప సర్పంచ్, ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు ఇతరుల సహకారంతో చంపారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు శాయంపేట‌ పోలీస్‌ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. రంజిత్ రావు మీడియా కు తెలిపారు. ఆ ఫిర్యాదును బట్టి భారతీయ న్యాయ సంహిత 325 సెక్షన్ (బీఎన్ఎస్) జంతువుల పట్ల క్రూరత్వ ప్రదర్శన నివారణ చట్టం 11 సెక్షన్ క్రింద కేసు నమోదు చేసామని ఆయన తెలిపారు.

Read More
Next Story