జీరో జిఎస్ టి ఉద్యమం,  100వ సంతకం చేయనున్న సోనియా గాంధీ
x

జీరో జిఎస్ టి ఉద్యమం, 100వ సంతకం చేయనున్న సోనియా గాంధీ

ఇప్పటి దాకా 96 మంది వివిధ రాష్ట్రాలకు, పార్టీలకు చెందిన ఎంపిలు జీరో జిఎస్టీ ఉద్య మానికి మద్దతుగా సంతకాలు చేశారు. వీరంతా చేనేత మీద జిఎస్టీ ఎత్తేవేయాలన్నారు.


చేనేత రంగం మీద జీఎస్టీ తొలగించాలన్న (జీరో జిఎస్ టి) ఉద్యమానికి సర్వత్రా మద్దతు లభిస్తూ ఉంది. వివిధ రాజకీయ పార్టీలకు, వివిధ రాష్ట్రాలకు చెందిన పదిమంది ఎంపీలు ఈరోజు మద్దతు తెలిపారు. హైదరాబాదులోని తాజ్ కృష్ణ హోటల్లో చేనేత మహా వస్త్ర లేఖపై వారంతా ఈ ఉద్యమానికి సంఘీభావంగా సంతకాలు చేశారు. పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులు సంతకాలు చేశారున వారి పేర్లు. జస్బీ ర్ సింగ్ గిల్, వందన హేమంత్, మలుక్ నగర్, ఓం ప్రకాష్, రంజన్ బాబు రాయ్, సురేష్ పూజారి, సంధ్యా రాయ్, దర్శన సింగ్, రఘురామకృష్ణరాజు, కనకమెడల రవీందర్రావు.




వీరంతో సంతకాలు చే స్తూ జీరో జిఎస్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సహకారం అందిస్తామని తెలిపారు.

. దీనితో ఇప్పటివరకు జీరో జీఎస్టీ ఉద్యమానికి మద్దతు తెలిపిన ఎంపీల సంఖ్య 96 చేరింది. 100వ వసంతకం సోనియాగాంధీ గారు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఇదివరకే సంతకాలు చేసి మద్దతు తెలిపిన పార్లమెంటు సభ్యులు వివేక్ తన్క, కె.ఆర్.సురేష్ రెడ్డి, వెంకటేష్ నేత తదితరులు ఉన్నారు.

అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షులు యర్రమాద వెంకన్న నేత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ ఈరావత్రి అనిల్ కుమార్, నటి, సామాజిక కార్యకర్త పూనమ్ కౌర్ మరియు పద్మశాలి సంఘ యువ నాయకులు జెల్లా నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Read More
Next Story