టెస్ట్ క్రికెట్ లో నాలుగో అరుదైన సందర్భం
x
భారత క్రికెటర్, రవిచంద్రన్ అశ్విన్

టెస్ట్ క్రికెట్ లో నాలుగో అరుదైన సందర్భం

ధర్మశాల టెస్ట్ మ్యాచ్ తో స్పిన్నర్ అశ్విన్, బెయిర్ స్టో ఇద్దరు వందో టెస్ట్ పూర్తి చేసుకుంటారు. వీరే కాదు ఇంకో ఇద్దరు కూడా తరువాత వందో టెస్ట్ పూర్తి


కొన్ని సందర్భాలు అంతే.. ఒక్కోసారి అలా కలిసి వస్తుంటాయి. అలాంటిదే భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగే చివరి టెస్ట్ లో చోటు చేసుకోబోతోంది. భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ జానీ బెయిర్ స్టో ఇద్దరికి ఈ టెస్ట్ వందో టెస్ట్. ఇలా ఇద్దరి ఆటగాళ్లు ఒకే మ్యాచ్ లో వందో టెస్ట్ ఆడడం టెస్ట్ క్రికెట్ లో ఇప్పటికి కేవలం మూడు సార్లు మాత్రమే జరిగాయి.

మొదటిసారిగా 2000 వ సంవత్సరంలో వెస్టిండీస్ తో ఇంగ్లండ్ ఓల్డ్ ట్రాఫోర్డ్ ఆడిన టెస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ అథర్టన్, వికెట్ కీపర్ అలెక్ స్టీవార్ట్ ఇద్దరి వందో టెస్ట్ మ్యాచ్.
తరువాత 2006 సెంచూరియన్ వేదికగా జరిగిన దక్షిణాఫ్రికా- న్యూజిలాండ్ గేమ్ ప్రోటీస్ లెజెండరీ బ్యాట్స్ మెన్ జాక్ కలిస్, షాన్ పొల్లాక్, న్యూజిలాండ్ కెప్టెన్ స్టీఫెన్ ప్లెమింగ్ లకు వందో టెస్ట్. ఒక గేమ్ లో ఇద్దరు వందో టెస్ట్ మ్యాచ్ అరుదైన విషయం అయితే ఇందులో ఏకంగా ముగ్గురు ఈ ఘనత అందుకున్నారు.



మూడో సంద్భర్భం 2013 లో చోటు చేసుకుంది. పెర్త్ వేదికగా ఇంగ్లండ్- ఆస్ట్రేలియా యాషెష్ కోసం తలపడిన ఈ గేమ్ లో అలిస్టర్ కుక్, మైకెల్ క్లార్క్ కి వందో టెస్ట్ మ్యాచ్.
తాజాగా జరుగుతున్న భారత్- ఇంగ్లండ్ సిరీస్ లో భారత్ స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవించంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ బెయిర్ స్టో ఈ అరుదైన మైలురాయిని అందుకోనున్నారు. పత్యర్థి జట్లకు చెందిన ఆటగాళ్లు ఒకే గేమ్ లో తమ వందో టెస్ట్ ఆడడం మాత్రం కేవలం రెండు సార్లు మాత్రమే జరిగింది. భారత్- ఇంగ్లండ్ ఆట ప్రారంభమైన ఒక రోజు వ్యవధిలో న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ, మాజీ సారథి కేన్ విలియమ్సన్ కూడా ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ లో పాల్గొననున్నారు. వీరిద్దరికి ఇది వందో టెస్ట్ మ్యాచ్.
అనిల్ కుంబ్లే తరువాత టెస్ట్ క్రికెట్ లో 500 వికెట్లు తీసిన భారత బౌలర్ అశ్విన్. 2011 లో అశ్విన్ టెస్ట్ క్రికెట్ అరంగ్రేటం చేశాడు. 13 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నాడు.
వందో టెస్ట్ ఆడబోతున్న 34 ఏళ్ల బెయిర్ స్టో 2012 లో అరంగ్రేటం చేశాడు. ఇంగ్లండ్ తరుఫును వందో టెస్ట్ ఆడుతున్న 17 ఆటగాడ అవుతాడు. కాగా భారత్ ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను 3-1 తో గెలుచుకుంది.


Read More
Next Story