నంద్యాల గ్రామ్-119ను సాగు చేస్తే డబ్బే డబ్బు!!
x
నంద్యాల శనగ రకం

నంద్యాల గ్రామ్-119ను సాగు చేస్తే డబ్బే డబ్బు!!

119 వంగడం స్వల్పకాలిక కాబూలి శనగ రకం. 100 గింజల బరువు 38-40 గ్రాములు. గింజ లావు. ఆకర్షణీయంగా ఉంటుంది. హెక్టారుకు వర్షాధారంలో 17.5-20 క్వింటాళ్లు,


శనగ సాగుకు పెట్టింది పేరైన ఆంధ్రప్రదేశ్ లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సరికొత్త రికార్డును సాధించింది. యూనివర్శిటీకి అనుబంధంగా ఉండే నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఆవిష్కరించిన నంద్యాల గ్రామ్‌ (ఎన్‌బీఈజీ)-119 రకం అత్యధిక విస్తీర్ణంలో సాగయింది. శనగ రైతుల ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం, కర్నూలు, కడప, గుంటూరు జిల్లాలో అక్కడక్కడా శనగ సాగవుతుంది. ఆంధ్రప్రదేశ్ సుమారు 4.45 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో శనగ పంట సాగవుతుంది. 4.92 లక్షల టన్నుల దిగుబడి ఉంది. హెక్టార్ కు 1105 కిలోల శనగలు పండుతాయని అంచనా. శనగ సాగులో మొత్తం దేశంలోనే ఏపీ వాటా 3.58 శాతం.

ఈ రకం ప్రత్యేకత ఏమిటంటే...


ప్రకాశం జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణంలో 40 వేల హెక్టార్లల్లో నంద్యాల గ్రామ్‌ 119 సాగు చేస్తున్నారు. ఎకరానికి 10-12 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. స్వల్పకాలిక రకం కావడంతో రాయలసీమ జిల్లాల్లో సైతం ఈ రకం సాగు అధికంగా ఉంది. చీడ, పీడలను తట్టుకునే సామర్థ్యం, తక్కువ కాలంలో పంట చేతికి వస్తుంది. 2015లో నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌ నుంచి విడుదలైన నంద్యాల గ్రామ్‌- 119 అత్యధిక విస్తీర్ణంలో సాగవుతోంది. “నంద్యాల గ్రామ్‌-119 రకం శనగ రైతులకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఇప్పటికే సత్ఫలితాలను సాధించింది. ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతోంది. మున్ముందు మరింత విస్తృత స్థాయిలో సాగయ్యే అవకాశం ఉంది“ అన్నారు నంద్యాల పరిశోధన కేంద్రంలో శనగ వంగడాలపై పరిశోధన చేస్తున్న ప్రధాన శాస్త్రవేత్త వి.జయలక్ష్మి.

95 రోజుల్లో పంట చేతికి..

నంద్యాల గ్రామ్‌- 119 రకం 95 రోజుల స్వల్పకాలిక కాబూలి శనగ రకం. 100 గింజల బరువు 38-40 గ్రాములు. గింజ లావు. ఆకర్షణీయంగా ఉంటుంది. హెక్టారుకు వర్షాధారంలో 17.5-20 క్వింటాళ్లు, 1 లేదా 2 తడులతో 20-25 క్వింటాళ్ల దిగుబడితో ఎండు తెగులును తట్టుకునే శక్తి ఈ రకానికి ఉంది.

శనగ రకాలకు పెట్టింది పేరు నంద్యాల

శనగ విత్తన వంగడాల రూపకల్పనలో నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రం. ఇక్కడ రూపొందించిన శనగ వంగడాలు అనేకం రికార్డ్ సృష్టించాయి. “నంద్యాల గ్రామ్‌ 49, నంద్యాల గ్రామ్‌ 779, నంద్యాల గ్రామ్‌ 119 కబూలీ రకం పంట అధిక దిగుబడులను సాధించింది“ అన్నారు శాస్త్రవేత్తలు డాక్టర్లు వీర జయలక్ష్మి, మంజునాథ్‌, రమాదేవి, చైతన్య, రామరాజు. “కడప జిల్లా జమ్మలమడుగు మండలం గోడిగెనూరు గ్రామానికి చెందిన రైతులు శివ శంకర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, ఈశ్వరరెడ్డి పొలాల్లో 42 ఎకరాల్లో కొత్తరకం శనగ పంటను సాగు చేశారు. ఈ పొలాన్ని శాస్త్రవేత్తల బృందం పరిశీలించిన తర్వాత శాస్త్రవేత్త వీర జయలక్ష్మి ఈ కొత్త వంగడం విశిష్టతను రైతులకు సోదాహరణంగా వివరించారు. “అనాదిగా పండిస్తున్న జెజీ 11 శనగ రకంతో పోల్చి చూస్తే కొత్త వంగడమైన నంద్యాల గ్రామ్ 119 అధిక దిగుబడిని ఇస్తుంది. చీడపీడలను తట్టుకునే శక్తిని కలిగి ఉంది. మినీ కిట్ల పరీక్షల్లో ఉన్న నంద్యాల గ్రామ్‌ 779, 119 రకాలు బాగున్నాయని రైతులే చెబుతున్నారు“ అని వీర విజయలక్ష్మి చెప్పారు. పైగా ఈ పంట మిషన్‌ కోతకు అనుకూలంగా ఉంది.

Read More
Next Story