
నారీ శక్తి విజయగాథ చేనేత చీరపై...
నారీ శక్తికి ప్రతీకగా ప్రత్యేక చేనేత పట్టుచీర
ఒకే చీరపై నారీ శక్తి గాథ… సిరిసిల్ల నేతల అద్భుత సృష్టి
నారీ శక్తిని ప్రతిబింబించేలా సిరిసిల్లకు చెందిన నేత కార్మికులు హరిప్రసాద్, రేఖ దంపతులు మూడు నెలల పాటు శ్రమించి ప్రత్యేకమైన చేనేత పట్టుచీరను నేశారు. మహిళల సాధించిన విజయాలను గుర్తుచేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చీరను రూపొందించారు.
గత ఏడాది భారత మహిళలు వివిధ రంగాల్లో ఎన్నో ఘన విజయాలు సాధించారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ మహిళల ధైర్యం, సామర్థ్యం ప్రపంచానికి తెలిసింది. అలాగే క్రీడారంగంలోనూ మన ఆడబిడ్డలు అనేక విజయాలు సాధించి దేశానికి గౌరవం తీసుకువచ్చారు.ఈ విజయాలను ప్రతిబింబించేలా చీరపై ప్రత్యేకమైన చిత్రాలను నేశారు. షూటర్ సుజిత్ సింగ్, ఆర్చర్ సీతల్ దేవి, జ్యోతి వంటి ప్రముఖుల చిత్రాలతో పాటు మహిళా క్రికెట్ వరల్డ్ కప్, మహిళా కబడ్డీ వరల్డ్ కప్, అంధుల మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజయాలను కూడా చీరపై ప్రతిబింబించారు.
ఒకే చీరపై మహిళల విజయాలను ప్రతిబింబించేలా నేసినట్లు హరిప్రసాద్ తెలిపారు. దేశ మహిళలు సాధించిన ఘన విజయాలను గుర్తు చేసుకుంటూ, వారికి అభినందనలు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైన చీరను రూపొందించామని హరిప్రసాద్, రేఖ దంపతులు పేర్కొన్నారు.
Next Story

