సూర్యలంక వద్ద తీరాన్ని దాటిన తుపాన్‌

సూర్యలంక బీచ్‌ మొత్తం మేఘావృతం


సూర్యలంక వద్ద తీరాన్ని దాటిన తుపాన్‌
x
తడిసి ముదై్దన ధాన్యం

బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌ వద్ద మిగ్‌జాం తుపాన్‌ తీరాన్ని దాటింది. రెండు గంటల ప్రాంతంలో తీరాన్ని దాటినట్లు బాపట్ల జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా తెలిపారు. సూర్యలంక బీచ్‌ ప్రాంతమంతా మేఘావృతమై మేఘాలు కిందకు దిగాయి. అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. తుపాన్‌ తీరాన్ని దాటినందున భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉంది. భారీస్థాయిలో ఈదురు గాలులు, చలి, వర్షం ఎక్కువగా ఉంటాయి. మత్స్యకారులు, సముద్ర తీర వాసులు జాగ్రత్తగా ఉండాలని బాపట్ల జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా హెచ్చరించారు.


Next Story